S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/29/2017 - 03:07

విజయవాడ, ఆగస్టు 28: నంద్యాలలో తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించడం ద్వారా నంద్యాల ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన పట్ల ప్రజలు పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని వ్యక్తం చేశారని, ఇది ప్రజా విజయమని మంత్రి శిద్దా రాఘవరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ కనుమరుగు కావటం ఖాయమని జోస్యం చెప్పారు.

08/29/2017 - 03:06

కర్నూలు, ఆగస్టు 28: నంద్యాల శాసనసభ ఉప ఎన్నికలో విజయం సాధించిన టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన తన ట్విట్టర్ ద్వారా ఎన్‌డిఎ భాగస్వామి అయిన తెలుగుదేశం ఉప ఎన్నికలో విజయం సాధించడం హర్షణీయమని పేర్కొన్నారు. విజయం కోసం కృషి చేసిన చంద్రబాబు, ఆయన పార్టీ సహచరులకు ప్రశంసలు అందించారు.

08/29/2017 - 03:06

నంద్యాల, ఆగస్టు 28: నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక విజయం వెనుక టిడిపి మంత్రుల నిరంతర శ్రమ కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. ప్రచార బాధ్యతలను మొత్తం తన భుజస్కంధాలపై వేసుకున్న వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రణాళికాబద్దంగా టిడిపిని విజయతీరాలకు చేర్చడంలో కృతకృత్యులయ్యారని చెప్పాలి.

08/29/2017 - 03:05

కర్నూలు, ఆగస్టు 28: కర్నూలు జిల్లా నంద్యాల శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించడానికి ప్రధాన కారణాలు సానుభూతి, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలేనని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.

08/29/2017 - 03:04

కర్నూలు, ఆగస్టు 28: నంద్యాల ఉప ఎన్నికలో విజయం కోసం అధికారదర్పాన్ని ప్రయోగించి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం, తల్లిదండ్రులు లేని పిల్లలంటూ చేసిన ప్రచారం కారణంగానే టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారని వైకాపా అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి అన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఆయన సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ నంద్యాలలో విజయం ప్రభుత్వానికి సానుకూల సంకేతమేమీ కాదని అభిప్రాయపడ్డారు.

08/29/2017 - 03:00

అమరావతి, ఆగస్టు 28: రాష్ట్ర రాజకీయాలపై వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అంచనాల గురి తప్పుతున్నట్లు కనిపిస్తోంది. వైసీపీకి తిరుగులేని పట్టున్న రాయలసీమలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఆ పార్టీకి పట్టుకొమ్మలుగా భావించే ముస్లిం మైనారిటీలు, ముద్రగడ ఆందోళన వల్ల కలసివస్తాయనుకుంటున్న బలిజ, కాపు వర్గాలు దూరమవుతున్నాయా?

08/29/2017 - 02:59

విజయవాడ, ఆగస్టు 28: నంద్యాల ఉప ఎన్నికలో సాధించిన ఘన విజయంతో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాసం లోపల, వెలుపల అంగరంగ వైభవంగా విజయోత్సవ సంబరాలు జరిగాయి.

08/29/2017 - 02:56

అమరావతి, ఆగస్టు 28: ఇదే విధంగా మరో మూడేళ్లు కృషిచేస్తే నీటి కొరత తీరిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ‘నీరు-ప్రగతి’ పురోగతిపై సోమవారం తన నివాసం నుంచి జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. దశాబ్దాలుగా సతమతం చేస్తున్న నీటి సమస్యను అధిగమించేందుకు చేపట్టిన ‘నీరు-ప్రగతి’ కార్యక్రమ ఫలితాలు అందే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

08/29/2017 - 02:55

విజయవాడ, ఆగస్టు 28: సాయం కోసం వచ్చిన పలువురికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాసటగా నిలిచారు. అవసరమైన ఆర్థిక సాయం అందించారు. గుంటూరు జిల్లా పొత్తూరు నుంచి వచ్చిన గుమ్మడి సుమన్ (17) చిన్నపుడు తగిలిన దెబ్బతో ఆరోగ్యం దెబ్బతిని ఉన్న కొద్దిపాటి ఆస్తి కరిగిపోయింది. ప్రత్యేక చికిత్స చేస్తే అతడికి తెలివి వస్తుందని వైద్యులు చెప్పటంతో తల్లితండ్రులు సోమవారం ముఖ్యమంత్రిని కలిశారు.

08/29/2017 - 02:54

విజయవాడ, ఆగస్టు 28: ఢిల్లీ అక్షరధామ్ తరహాలో ఏపి రాజధాని అమరావతి నగర ప్రాంతంలోనూ ప్రతిష్ఠాత్మకంగా ఒక ఆధ్యాత్మిక సంస్థను నెలకొల్పేందుకు అనువైన 30 ఎకరాల స్థలం కేటాయించాలని అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ ప్రతినిధులు సోమవారం ఏపి సిఆర్‌డిఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్‌ని కల్సి కోరారు. తమ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆధ్యాత్మిక ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతిపాదనను ప్రతినిధులు వివరించారు.

Pages