S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/29/2017 - 02:54

విజయవాడ, ఆగస్టు 28: నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రజలకు రఘువీరారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఆ ఆదరణ ఓట్ల రూపంలో కనబడకపోవడానికి కారణం అందరికీ తెలిసిన విషయమేనన్నారు.

08/29/2017 - 02:53

నెల్లూరు, ఆగస్టు 28: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడే అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను నెల్లూరు టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ సోమవారం విలేఖరులకు తెలిపారు. మొత్తం 21 మంది సభ్యులున్న ముఠాను పట్టుకున్నామని, వీరిలో ఇద్దరు పేరుమోసిన అంతరాష్ట్ర స్మగ్లర్లు సందింటి సుబ్బయ్య, సాదినేని సుబ్బయ్య ఉన్నారు.

08/29/2017 - 02:53

విజయవాడ, ఆగస్టు 28: కేంద్ర ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి తాజాగా మరో లక్షా 25వేల గృహాలు మంజూరయ్యాయి. ఈమేర సోమవారం ఉత్తర్వులు జారీకాగా దీనిపై సిఎం చంద్రబాబునాయుడు స్పందిస్తూ ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 26 లక్షల గృహాలు మంజూరైతే ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే 21 శాతం అధికంగా ఇప్పటికి మొత్తం 5లక్షల 25వేల గృహాలు మంజూరయ్యాయి.

08/29/2017 - 02:52

అమరావతి, ఆగస్టు 28: పార్టీ ఉనికికి సవాలుగా మారిన నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ ఓటమికి జగన్ నియమించుకున్న కన్సల్టెంట్ ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహాలు, చేసిన సర్వేలే కారణమని ఆ పార్టీ సీనియర్లు విరుచుకుపడుతున్నారు. ఇకపైనా పీకేను కొనసాగిస్తే పార్టీని పీకేయించేస్తారేమోనన్న వ్యాఖ్యలు పార్టీలో వినిపిస్తున్నాయి.

08/29/2017 - 01:48

విజయనగరం, ఆగస్టు 28: కళలకు కాణాచి విజయనగరంలోని గురజాడ గృహాన్ని అందరికీ స్ఫూర్తినిచ్చేలా తీర్చిదిద్దుతామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో 125 ఏళ్ల కన్యాశుల్కం జాతీయ ఉత్సవాల ముగింపు రోజు సందర్భంగా సోమవారం గురజాడ గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి గంటా శ్రీనివాసరావు, మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ హాజరయ్యారు.

08/29/2017 - 01:46

అమరావతి, ఆగస్టు 28: ప్రపంచంలోని 10 అగ్రశ్రేణి కట్టడాలపై సమగ్రంగా అధ్యయనం జరిపి వాటి కి దీటుగా అమరావతి ఐకానిక్ టవ ర్స్ నిర్మాణం చేపట్టాలని ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడు సూచించారు. సోమవారం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అధికారులు.. ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధులతో ముఖ్యమంత్రిని కలిసి నూతన రాజధానిలో తలపెట్టిన ట్విన్ టవర్ నిర్మాణంపై వివరించారు.

08/29/2017 - 01:46

ప్రత్తిపాడు, ఆగస్టు 28: కాపు ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణ బుధవారం జరిగే జెఎసి సమావేశంలో నిర్ణయిస్తామని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. కిర్లంపూడి నుంచి వీరవరం వరకూ ఆదివారం జరిగిన ఆకస్మిక పాదయాత్రకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అంతా తనదేనని, తన వెనుక ఎవరూ లేరని, ఆ బాధ్యత తనదేనని ముద్రగడ స్పష్టం చేశారు.

08/29/2017 - 01:43

అమరావతి, ఆగస్టు 28: సెప్టెంబర్ 6,7,8 తేదీల్లో ‘జలసిరికి హారతి’ కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. నదుల దగ్గర నుంచి చెరువుల వరకు రాష్ట్రంలోని అన్ని జలవనరులను ఆ మూడు రోజులు పూజించుకునేలా, ఇందులో ప్రజలు భాగస్వామ్యులు అయ్యేలా చూడాలని సూచించారు.

08/29/2017 - 01:42

విజయవాడ, ఆగస్టు 28: రాష్ట్రంలో మొత్తం 48 మంది తహశీల్దారకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం సాయంత్రం సంబంధిత ఫైల్‌పై సంతకం చేశారు. దీనికి సంబంధించి మంగళవారం ఉత్తర్వులు వెలువడనున్నా యి.

08/29/2017 - 01:41

రాజమహేంద్రవరం, ఆగస్టు 28: అఖండ గోదావరి నదిలో వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. స్థానిక పరీవాహ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. సోమవారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద 10.80 అడుగుల నీటి మట్టం నమోదైంది. గత ఇరవై నాలుగు గంటలుగా కురుస్తోన్న భారీ వర్షాల వల్ల తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

Pages