S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/02/2017 - 04:15

విజయవాడ, ఆగస్టు 1: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలకు సంబంధించి నిధులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15వేల కోట్ల రూపాయలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కేంద్ర నిధుల వినియోగానికి సంబంధించి యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లను ఎప్పటికప్పుడు కేంద్రానికి సమర్పించాలని స్పష్టం చేశారు.

08/02/2017 - 04:15

అమరావతి, ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. రాష్ట్ర ఇంధన పొదుపు ప్రచార కమిటీకి కన్వీనర్, సీఆర్‌డిఏ ఇంధన శాఖ మీడియా సలహాదారుగా ఉన్న చంద్రశేఖరరెడ్డిని జాతీయ ఇంధన పొదుపు ప్రచార కమిటీ కన్వీనర్‌గా నియమిస్తూ కేంద్ర ఇంధన శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ కమిటీ అన్ని రాష్ట్రాల్లోనూ ఇంధన పొదుపు ఏ విధంగా అమలుచేయాలి?

08/02/2017 - 04:14

హైదరాబాద్, ఆగస్టు 1: మాదకద్రవ్యాల కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల విచారణ మంగళవారంతో ముగిసింది. రోజుకొకరి చొప్పున సిట్ అధికారులు 12 మందిని విచారించారు. ఈ కేసులో సిట్ అధికారులు చేపట్టే తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇకపై నోటీసులు ఇచ్చే వారందరిని గోప్యంగా విచారించాలన్న యోచనలో సిట్ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.

08/02/2017 - 01:57

భీమవరం, ఆగస్టు 1: భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్ష నియామకంపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును ఉప రాష్టప్రతి అభ్యర్థిగా ఎంపికచేయడం, ప్రస్తుత అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చనే ఊహాగానాల మధ్య పార్టీ అధ్యక్ష బాధ్యతలు కొత్తవారికి అప్పగించవచ్చని అందరూ భావిస్తున్నారు.

08/02/2017 - 01:53

నెల్లూరు, ఆగష్టు 1: క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న అంతర్జాతీయ క్రికెట్ బుకీని పది రోజుల కిందట నెల్లూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో అతను పోలీసులకు అందిస్తున్న సమాచారం ఆధారంగా జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులను ఒక్కొక్కరిగా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాను ఈ బెట్టింగ్ కేసు వ్యవహారం కుదిపేస్తోంది.

08/02/2017 - 01:52

విశాఖపట్నం, ఆగస్టు 1: సింహాచలం దేవస్థానానికి చెందిన భూముల్లో నిర్మాణాలను క్రమబద్ధీకరించే అంశం ఇప్పట్లో తేలేట్టు లేదు. గాజువాక ఈనాం భూముల్లో నిర్మాణాలను క్రమబద్ధీకరించిన ప్రభుత్వం ఇక ఈ భూములపైనే దృష్టి సారిస్తుందని అంతా భావించారు. అయితే న్యాయస్థానంలో ఉన్న కేసు ప్రభుత్వ నిర్ణయానికి పూర్తి భిన్నంగా ఉండేలా ఉంది.

08/02/2017 - 01:52

విజయనగరం, ఆగస్టు 1: వివిధ రాష్ట్రాల్లో లారీల దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా నాయకుడిని వన్‌టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయమై మంగళవారం సిఐ చంద్రశేఖరరావు విలేఖరులతో మాట్లాడుతూ సిసిఎస్ పోలీసుల సహకారంతో ముఠాలో కీలకమైన వ్యక్తి జగన్నాథరావును అరెస్టు చేశామన్నారు.

08/02/2017 - 00:20

ఒంగోలు/కోవూరు, ఆగస్టు1: ఒంగోలు ఫైర్‌స్టేషన్ ఆఫీసర్ ఎంవి సుబ్బారావులంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖాధికారులు దాడులుచేసి పట్టుకున్నారు. ఒంగోలులోని విజయహాస్పటల్‌కు అగ్నిమాపక రెన్యూవల్ సర్ట్ఫికెట్ జారీచేయాలంటే 35వేల రూపాయలను ఆ హాస్పటల్ మేనేజరు శ్రీనివాసరావును డిమాండ్ చేశారు.

08/02/2017 - 00:19

దొనకొండ, ఆగస్టు 1:మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగుపడి ముగ్గురు మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ఎర్రబాలెం గ్రామ పొలాల్లో జరిగింది. తెలిసిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ఎం గురవయ్య (35), భార్య లక్ష్మీ (29), కురిచేడు మండలం గంగవరం గ్రామానికి చెందిన పులి సుబ్బారెడ్డి (50) ఈప్రమాదంలో మృతి చెందారు.

08/02/2017 - 00:19

తిరుపతి, ఆగస్టు 1: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రెండోఘాట్ రోడ్డులోని రెండో కిలోమీటర్ వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొన్న సంఘటన మంగళవారం ఉదయం 4గంటలకు జరిగింది. ఈసంఘటనలో బస్సులో ఉన్న పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో టిటిడి ఉద్యోగులు,సులభ్ కార్మికులతోపాటు భక్తులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను 108 ద్వారా తిరుపతి రుయాకు తరలించారు.

Pages