S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/27/2017 - 01:31

విజయవాడ, జూన్ 26: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని గోదివిమాకుల్లపల్లి గ్రామం పంద్యాల మడుగు పంచాయితీకి చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైకాపాకు చెందిన వీరంతా ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఆ పార్టీకి రాజీనామా చేసి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.

06/27/2017 - 01:29

అమరావతి, జూన్ 26: బిజెపికి చెందిన వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అయ్యప్పస్వామి దీక్షను అవమానించారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు.
హిందుత్వాన్ని భుజాన వేసుకునే బిజెపికి ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రి కామినేని ఇటీవల జరిపిన శబరిమలై పర్యటన సోషల్ మీడియాలో వచ్చిన ఫొటో పుణ్యాన వివాదమయింది.

06/27/2017 - 01:25

విజయవాడ, జూన్ 26: నీట్‌లో అఖిల భారత స్థాలో 30వ ర్యాంక్ సాధించిన అడుసుమిల్లి హేమంత్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఉండవల్లిలోని నివాసంలో తండ్రి ఎవికె ప్రసాద్‌తో హేమంత్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తెలంగాణలో 3వ ర్యాంక్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాలుగో ర్యాంక్ సాధించడంపై అభినందించారు
గుడ్లవల్లేరు రైతుల కృతజ్ఞతలు

06/26/2017 - 03:20

విజయవాడ, జూన్ 25: అభివృద్ధి చేసే ప్రభుత్వానికే అన్ని విధాలా మద్దతు ఇవ్వాల్సిన అవసరం వుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తాను కార్యకర్తలతో అన్న మాటలను ఒక వర్గం మీడియా వక్రీకరించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యులతో అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం పార్టీ ముఖ్యులతో సమావేశమైన ముఖ్యమంత్రి కర్నూలు సభలో తన ప్రసంగంపై దుమారం రేగడాన్ని ప్రస్తావించారు.

06/26/2017 - 03:16

హిందూపురం, జూన్ 25: అనంతపురం జిల్లా హిందూపురంలో ఆదివారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బాలకృష్ణ పింఛనుదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా 3500 మందికి వివిధ రకాల పింఛన్లు మంజూరయ్యాయి. దీంతో స్థానిక ఎంజిఎం ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే బాలయ్య పాల్గొన్నారు.

06/26/2017 - 03:13

విశాఖపట్నం, జూన్ 25: టిడిపి మూడేళ్ల పాలనపై కాంగ్రెస్ పార్టీ చార్జ్‌షీట్ విడుదల చేసింది. టిడిపి, బిజెపి ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసగించిందని, రాష్ట్రంలో టిడిపి విశృంఖల దోపిడీకి తెరతీసిందని పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ ఆరోపించారు. పిసిసి ఆదేశాల మేరకు ‘దోపిడీ బాబు’ పేరిట ఛార్జ్‌షీట్‌ను ఆయన విశాఖలో ఆదివారం విడుదల చేశారు.

06/26/2017 - 03:12

గుంటూరు, జూన్ 25: రాష్ట్రంలో బ్రాహ్మణుల అణచివేత చర్యలకు నిరసనగా హక్కుల సాధనకోసం సంఘటితం కావాలని నేతలు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా డిసెంబర్‌లో లక్ష మందితో భారీగా ఆత్మగౌరవ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. ఆదివారం గుంటూరు నగరంలోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ జరిగింది.

06/26/2017 - 03:10

విజయనగరం, జూన్ 25: వైకాపా నేత బొత్స సత్యనారాయణపై ఏ ఆరోపణలు ఉన్నాయో వాటిని నిరూపిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భశాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు స్పష్టం చేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చే విధంగా ఏ అంశం మీద విచారణ జరిగిందో ఆ రికార్డులను కాల్చేసిన విషయం ప్రజలు మరచిపోలేదని అన్నారు. తనకు రిమోట్ కంట్రోల్ రాజకీయాలు చేతకాదన్నారు.

06/26/2017 - 03:09

విజయవాడ, జూన్ 25: మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు నెరవేర్చాం కాబట్టే తెలుగుదేశం పార్టీకి సహకరించమని ప్రజలను అడగటంలో తప్పేమిటని, అది బెదిరించడమెలా అవుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చడంతో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.

06/26/2017 - 02:57

మారేడుమిల్లి/ రంపచోడవరం, జూన్ 25: తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం వై రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ పరిధిలోని చాపరాయి గ్రామంలో గత కొద్ది రోజులుగా గిరిజనులు అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో మృతిచెందుతున్నారు. గత 20 రోజుల నుండి 16 మంది జ్వరాలు, వాంతులు, విరేచనాలతో మృత్యువాతపడ్డారు. అయితే ఏజెన్సీలోని మారుమూల ప్రాంతం కావడంతో ఆలస్యంగా ఈ మరణాల వ్యవహారం వెలుగుచూసింది.

Pages