S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/27/2017 - 02:33

తిరుపతి, జూన్ 26: శ్రీవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణమైన కర్ణాటకు చెందిన భక్తులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో సోమవారం సాయంత్రం వి ఎస్ టి వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. బ్రేకులు ఫెయిల్‌కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈప్రమాదంలో వాహనం బాగా దెబ్బతిన్నప్పటికీ అందులో ఉన్న ప్రయాణికులు మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారు.

06/27/2017 - 02:19

విశాఖపట్నం, జూన్ 26: పాస్‌పోర్టు సేవా కేంద్రాల (పిఎస్‌కె) సేవలు ఇక ఇక నుంచి తగ్గనున్నాయి. వీటి కార్యకలాపాలు క్రమేపీ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రాల ద్వారా అభ్యర్థులకు అందుతున్న సేవలకు సంబంధించి పిర్యాదులు వెల్లువెత్తున పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం పారదర్శకంగా వీటిని అందివ్వాలని నిర్ణయించింది.

06/27/2017 - 02:11

ద్వారకాతిరుమల, జూన్ 26: పొలంలో కట్టివుంచుకున్న పశువులను చంపుతున్న గుర్తుతెలియని జంతువుకోసం రైతులు ఉంచిన విషపు ఎరకు ఒక చిరుతపులి బలయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి... గ్రామంలోని పొలంలో కట్టివుంచిన పశువులపై నాలుగు రోజుల క్రితం గుర్తుతెలియని జంతువుదాడిచేసి, ఒక ఆవుదూడను హతమార్చింది.

06/27/2017 - 02:10

కాకినాడ, జూన్ 26: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన కళాకారుడు రూపొందించిన సూక్ష్మ కళాఖండం పలువురి ప్రశంసలు అందుకుంది. సూది రంధ్రంలో ఇమిడిపోయే పరిమాణంలో అతి సూక్ష్మ బంగారు రంజాన్ చిహ్నాన్ని కళాకారుడు ఆరిపాక రమేష్‌బాబు తయారుచేశారు. 30 మిల్లీగ్రాముల బంగారాన్ని మాత్రమే వినియోగించి, సుమారు 20రోజుల పాటు శ్రమించి ఈ సూక్ష్మ రంజాన్ చిహ్నాన్ని తయారుచేశారు.

06/27/2017 - 02:03

అమరావతి, జూన్ 26: క్లౌడ్ మేనేజ్‌మెంట్, మిషన్ లెర్నింగ్ అంశాల్లో ఏపీ ప్రభుత్వానికి సహకరించేందుకు ప్రఖ్యాత అమృతా యూనివర్సిటీ ముందుకొచ్చింది. ఇప్పటికే ఇ-గవర్నెన్స్ అమలుచేస్తున్న ప్రభుత్వానికి ఇ-ఎడ్యుకేషన్, ఇ-హెల్త్ తదితర విషయాల్లో తమ వర్సిటీ అభివృద్ధి చేసిన వినూత్న సాంకేతికతను సమకూర్చడానికి సిద్ధమని వర్సిటీ ప్రతినిధి బృందం ప్రకటించింది.

06/27/2017 - 02:01

లేపాక్షి, జూన్ 26: అనంతపురం జిల్లా లేపాక్షి పోలీస్టేషన్‌లో సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. లేపాక్షి మండలం పులమతికి చెందిన ఉప్పర రమేష్(30) పోలీస్‌స్టేషన్‌లో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పులమతి గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు జరిపారు.

06/27/2017 - 01:57

అమరావతి, జూన్ 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యంత ఇంధన సమర్థ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టనున్నది. దీనిలో భాగంగా అన్ని ప్రభుత్వ సంస్థల భవనాలను ‘స్టార్’ భవనాలుగా మార్పు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. ఇకపై ప్రభుత్వ సంస్థల్లో ఇంధన సమర్థ 5 స్టార్ రేటింగ్ ఉపకరణాలను అమర్చనున్నారు. విద్యుత్ ఆదా చేయడంతో కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోనున్నారు.

06/27/2017 - 01:39

అమరావతి, జూన్ 26: మంత్రి అఖిలప్రియ ప్రతిభకు నంద్యాల ఉప ఎన్నిక పరీక్ష కానుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తన సోదరుడైన భూమా బ్రహ్మానందరెడ్డిని ఎంపిక చేసుకోవడంలో ఆమె విజయం సాధించినప్పటికీ, ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా ఆమెపైనే పడింది. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల బట్టి అదంత సులభంగా ఉన్నట్టు కనిపించడం లేదన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.

06/27/2017 - 01:38

విజయవాడ (క్రైం), జూన్ 26: గిరిజన తండాల్లో సంభవిస్తున్న మరణాలపై సాంఘిక, గిరిజన సంక్షేమ మంత్రి నక్కా ఆనందబాబు వివరణ ఇచ్చారు. వాగులో ఆవు చనిపోవడం వల్ల ఆ నీళ్ళు కలుషితం కావటమే రోగాలకు కారణమన్నారు. మరణాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, గత రెండురోజుల నుంచి వైద్యపరంగా తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. గిరిజనులకు కనీస అవగాహన లేకపోవటంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

06/27/2017 - 01:36

అమరావతి, జూన్ 26: ఇప్పటికే తన వ్యక్తిగత పనితీరు, ఒంటెత్తు పోకడ మనస్తత్వంపై విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తాజాగా మరో విమర్శలకు తావిచ్చారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడం ఆ పార్టీని ఇరుకునపెట్టినట్టయింది. తన మాట ఎదుటివారు వినాల్సిందే తప్ప, తానెవరి మాట వినరని, సీనియర్లను గౌరవించరన్న ప్రచారం ఉన్న జగన్..

Pages