S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/24/2017 - 03:43

అమరావతి, మార్చి 23: స్థానిక సంస్థలు, టీచర్లు, గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలు చివరకు ఉప ఎన్నికల సవాళ్లకు దారితీస్తున్నాయి. వైఎస్ కుటుంబానికి ప్రతిష్టాత్మకమైన కడప సహా మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాలూ గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ, చివరకు అన్ని టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడిపోయింది.

03/24/2017 - 03:42

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 23: రాష్ట్రంలోని కరువు జిల్లాలుగా ఎంపికైన ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన వౌలిక సదుపాయాల కల్పనలకు ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.

03/24/2017 - 03:42

అమరావతి, మార్చి 23: అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుమీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపక్ష నాయకుడు నిర్ణయించారు. స్పీకర్ మీద తమకు నమ్మకం, గౌరవం పోయాయని, అందుకే తాము అవిశ్వాస తీర్మానం పెడతామని ఆయన చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింటులో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

03/24/2017 - 03:41

అమరావతి, మార్చి 23: విద్యార్థులను ర్యాంకులతో పాస్ చేయిస్తామన్న భరోసా ఇచ్చే నారాయణ విద్యాసంస్థల అధినేత, మంత్రి నారాయణ.. ఎన్నికల పరీక్షలో తాను నిలిపిన అభ్యర్థినే గెలిపించుకోలేక, తన ప్రత్యర్థుల చేతికి చిక్కారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలు మంత్రి నారాయణ ఉనికికి చిక్కులు తెచ్చి పెడుతున్నాయి.

03/24/2017 - 02:26

తిరుపతి, మార్చి 23: టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద ట్రస్టుకు ఓ అజ్ఞాత భక్తుడు రూ.2 కోట్లను విరాళంగా అందించారు. తిరుమల జెఇఓ శ్రీనివాసరాజును కలసి ఆయన ఈ మొత్తాన్ని గురువారం అందించారు. అయితే ఆయన తన పేరును చెప్పడానికి నిరాకరించారు. టిటిడి అన్నప్రసాద ట్రస్టుకు ఇంత పెద్దమొత్తంలో విరాళం ఇవ్వడం ఇదే తొలిసారి.

03/24/2017 - 02:25

విజయవాడ, మార్చి 23: కష్టపడి పని చేస్తూ.. రాష్ట్భ్రావృద్ధిలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ఆకాంక్షను వ్యక్తం చేశారు. విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్ భవన సముదాయంలో గురువారం, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనరేట్ నూతన కార్యాలయాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ, ఐటి, మైనార్టీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు.

03/24/2017 - 02:23

విజయవాడ, మార్చి 23: భారతీయ జనతాపార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాల మేరకు పనిచేస్తూ ఉత్తరాంధ్రప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యులు పివిఎన్ మాధవ్ హామీ ఇచ్చారు.

03/24/2017 - 02:21

విశాఖ సాగర తీరానికి గురువారం అతిపెద్ద సముద్రపు తాబేలు మృతదేహం కొట్టుకొచ్చింది. గత కొద్ది రోజులుగా విశాఖ బీచ్ కోతను నివారించేందుకు డ్రెడ్జింగ్ పనులు నిర్వహిస్తున్నారు. సముద్రంలోని ఇసుక ఒడ్డున వేసేందుకు జరుగుతున్న పనులకు సముద్రపు తాబేళ్లు బలవుతున్నాయని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

03/24/2017 - 02:15

హైదరాబాద్, మార్చి 23: ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల సంఘం ఏర్పాటుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై ఏపి ప్రభుత్వానికి నోటీసులను హైకోర్టు జారీ చేసింది. ఏపి పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి పొత్తూరి సురేష్ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథం, జస్టిస్ షామీమ్ అక్తర్‌లు విచారించారు.

03/24/2017 - 02:14

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 23: ప్రజల భాగస్వామ్యంతో రాజధాని అమరావతితో సహా రాష్ట్రంలో హరిత భవనాల నిర్మాణంపై విస్తృత ప్రచారం చేయాల్సి ఉందని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ జి.్ఫణికుమార్ చెప్పారు. గ్రీన్ బిల్డింగ్‌కు సంబంధించి గత సెప్టెంబర్‌లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కొనసాగింపుగా మరో సమావేశాన్ని గురువారం విజయవాడ నగరంలోని ఒక హోటల్‌లో ఏర్పాటు చేశారు.

Pages