S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/21/2017 - 03:34

అమరావతి, మార్చి 20: కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ఇప్పటికే కమిషన్ వేసి తొలిసారిగా వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటుచేసి కాపులకు రుణాలందిస్తున్నప్పటికీ అందుకు తగిన ప్రచారం లేకపోవడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది.

03/21/2017 - 03:33

తాడేపల్లి, మార్చి 20: పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్ శివాజీ రోడ్డుపై బైఠాయించి హడావుడి సృష్టించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరవటానికి ఎమ్మెల్యే శివాజీ ప్రకాశం బ్యారేజ్ మీదుగా కరకట్టపై వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లటానికి ప్రయత్నించారు. అప్పటికే సిఎం కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను నిలిపివేసిన పోలీసులు కరకట్ట మార్గంలో శివాజీ వెళ్లటానికి అనుమతించలేదు.

03/21/2017 - 03:30

విజయవాడ, మార్చి 20: అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని, పేదవాడికి అవినీతి రహిత సమాజం ద్వారా సేవ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టే ముందు రాష్ట్ర శాసనమండలిలో సోమవారం ఆయన ప్రసంగించారు. దాదాపు రెండున్నర గంటల సేపు ఆయన సభలో ప్రసంగించారు. రాష్ట్భ్రావృద్ధికి తీసుకుంటున్న చర్యలు వివరించారు.

03/21/2017 - 03:29

విజయవాడ, మార్చి 20: ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గ కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లోని దాదాపు లక్షా 10వేల మంది ప్రజల దాహార్తిని తీర్చేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.14 కోట్లతో నిర్మితమైన రక్షిత మంచినీటి పథకం మూడేళ్లు కావస్తున్నప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదంటూ వైకాపా శాసనసభ్యురాలు రోజా ఆగ్రహం వ్యక్తపర్చారు.

03/21/2017 - 03:29

విజయవాడ, మార్చి 20: ‘రైతు రుణమాఫీ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే చరిత్రాత్మక ఘట్టం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా రూ.24వేల కోట్ల మేర 35 లక్షల 65వేల మంది రైతులు లబ్ధిపొందారం’టూ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. శాసనసభలో సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాల్లో రుణమాఫీపై సభ్యులు తరిమెల్ల రాధాకృష్ణ, డాక్టర్ నిమ్మల రామానాయుడు అడిగిన ప్రశ్నలకు పుల్లారావు పైవిధంగా స్పందించారు.

03/21/2017 - 03:21

కడప/కర్నూలు/ నెల్లూరు, మార్చి 20: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టిడిపి సత్తాచాటింది. కడప, కర్నూలు, నెల్లూరుల్లో ఘన విజయం సాధించింది. ప్రతిక్ష వైకాపా ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు. కడపలో నువ్వానేనా అన్నట్టుగా సాగిన ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిటెక్ రవి(మారెడ్డి రవీంద్రారెడ్డి) తన సమీప వైకాపా అభ్యర్థి వైఎస్.వివేకానందరెడ్డిపై 38 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

03/21/2017 - 03:19

కడప, మార్చి 20: వైకాపాకు కంచుకోటగా నిలిచిన కడప జిల్లాలో టిడిపి పాగా వేసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా సత్తా చాటింది. సొంత జిల్లాలో తమ అభ్యర్థి ఓటమి వైకాపా అధినేత జగన్‌కు షాక్ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

03/21/2017 - 03:16

గుంటూరు, మార్చి 20: ‘అధికారంలో ఉన్నామని దిగజారుడు రాజకీయాలతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు.. ఓ ఎమ్మెల్సీ సీటు గెలిచి సిగ్గులేకుండా గొప్పలు చెప్పుకుంటున్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేదంతా గ్యాస్.. దమ్ముంటే ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల బరిలో నిలిచి గెలవండ’ని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి టిడిపికి సవాల్ విసిరారు.

03/21/2017 - 03:15

గుంటూరు, మార్చి 20: ‘హౌస్‌లో ఓ పద్దతిలేకుండా పోయింది.. వీళ్లకు రాజకీయం కావాలి.. ప్రజలు ఇబ్బందిపడాలి.. తిన్నింటి వాసాలు లెక్కేసే వాళ్లకు నిజాలేం తెలుస్తాయి.. ఇకపై అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతా.. అలగాజనం మాదిరి తయారయ్యారు.. శాసనసభలో తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రివిలేజెస్ మోషన్‌కు వెళతాం.. ఆపై బాధ్యత వహించాల్సింది మీరే’..

03/21/2017 - 03:14

విజయవాడ, మార్చి 20: ‘గత పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల పేరిట రైతుల నుంచి దాదాపు లక్ష ఎకరాల వ్యవసాయ భూములను అడ్డగోలుగా దోచేశారు.. తీరా ఒక్క పరిశ్రమ రాలేదం’టూ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.

Pages