S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/22/2017 - 02:21

విజయవాడ, మార్చి 21: రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. తహశీల్దార్ వనజాక్షి పైనే ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యం చేస్తే ఇక సామాన్య మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందం’టూ వైకాపా సభ్యురాలు గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు.

03/22/2017 - 02:21

విజయవాడ, మార్చి 21: రాష్ట్రంలో సాగునీటి రంగానికి పెద్దపీట వేశామని, గడచిన మూడేళ్లలో రూ. 21వేల 632కోట్లు ఖర్చుచేశామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. పెండింగ్‌లోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేయడమే కాకుండా 2018 నాటికి పోలవరం నిర్మాణాన్ని సైతం పూర్తిచేస్తామంటూ ప్రకటించారు.

03/22/2017 - 02:20

విశాఖపట్నం, మార్చి 21: రాష్ట్రంలో బిజెపి పూర్తిగా కునారిల్లిపోయిన రోజులు.. మోదీ క్రేజ్‌తో మళ్లీ జీవం పోసుకున్న పరిస్థితులవి. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు విశాఖలో బిజెపి దాదాపు అథమ స్థితిలో ఉంది. మోదీ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి రాక ముందు విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు, విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి బిజెపి తరపున అభ్యర్థులు లేని పరిస్థితులు.

03/22/2017 - 00:32

విజయవాడ, మార్చి 21: గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న తెలుగువారిని ఆదుకోవాలని పలువురు సభ్యులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర శాసన మండలిలో మంగళవారం నాటి ప్రశ్నోత్తరాల సమయంలో సౌదీ అరేబియాలో తగిన ఆదాయ వనరులు లేక రాష్ట్రానికి తిరిగి రాలేకపోతున్న వారి గురించి తీసుకున్న చర్యలపై ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి ప్రశ్నించారు.

03/22/2017 - 00:31

విజయవాడ, మార్చి 21: అరుపులు, కేకలు, ప్లకార్డులతో నిరసనలు, బైఠాయింపుల మధ్య శాసనసభ మంగళవారం దద్దరిల్లింది. ప్రశ్నోత్తరాల సమయంలో 10 ప్రశ్నలు సభలో ప్రస్తావనకు రావాల్సి వుండగా రెండే రెండు ప్రశ్నలు చర్చకు వచ్చాయి. గందరగోళం మధ్య సభ రెండుసార్లు వాయిదా పడింది. సభా ప్రారంభంలోనే రభస చోటుచేసుకుంది.

03/22/2017 - 00:30

విజయవాడ, మార్చి 21: దోమల నియంత్రణకు సరైన చర్యలు చేపట్టపోవడంపై రాష్ట్ర శాసనమండలిలో మంగళవారం ఆసక్తికరమైన చర్చ జరిగింది. సభలోనూ దోమలు కుడుతున్నాయని సభ్యులు చెప్పగా, ‘పాస్ లేకుండా ఎలా వస్తాయం’టూ మండలి చైర్మన్ చక్రపాణి చమత్కరించారు. త్వరలో మస్కిటో బ్రీడింగ్ ప్రివెంటివ్ యాక్టును రూపొందించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.

03/22/2017 - 00:30

అమరావతి, మార్చి 21: ‘మనం గెలిచి ఓడామా? ఓడి గెలిచామా?’.. ఇదీ నేడు తెలుగుదేశం నేతల్లో సాగుతున్న అంతర్మథనం. శాసనమండలికి స్థానిక సంస్థల నుంచి మూడు సీట్లలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీకి టీచర్, పట్ట్భద్రుల ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురుకావడం షాకిచ్చింది.

03/21/2017 - 03:37

అమరావతి, మార్చి 20: రెండున్నరేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీకి కడప రూపంలో వచ్చిన భారీ విజయాన్ని తెలుగుతమ్ముళ్లు ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. ఇప్పటివరకూ కడప వైపు కనే్నసేందుకే భయపడిన పార్టీ నాయకత్వం ఇప్పుడు ఏకంగా వైఎస్ కుటుంబానికి పట్టున్న కడపను కొల్లగొట్టడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పార్టీ శ్రేణులంతా ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

03/21/2017 - 03:35

అమరావతి, మార్చి 20: స్థానిక సంస్థలు, టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఇద్దరు అధినేతలకు సొంత జిల్లాల్లో అవమానాల పాలుచేశాయి. కడపలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని పార్టీ అభ్యర్ధిగా నిలబెట్టారు. కొద్ది మెజారిటీతోయినా గెలుస్తారని, దేశం ఓటర్ల క్రాస్ ఓటింగ్‌తో బయటపడతామని ధీమాతో ఉన్న జగన్ అంచాలు తారుమయి, చిన్నాన్న ఘోరంగా ఓడిపోయారు.

03/21/2017 - 03:35

అమరావతి, మార్చి 20: స్థానిక సంస్థల ద్వారా శాసనమండలికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన తెలుగుదేశం పార్టీ విజయం వెనుక నలుగురు ఇన్చార్జి మంత్రుల కృషిని పార్టీ శ్రేణులు అభినందిస్తున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకమైన కడప ఎన్నికలపై మూడుసార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.

Pages