S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/02/2016 - 04:27

కర్నూలు, డిసెంబర్ 1: ప్రజలు వినియోగిస్తున్న మోబైల్ ఫోనే ఇకపై మనీపర్స్ కానుంది. నగదు రహిత లావాదేవీలకు ప్రజలు ఖచ్చితంగా అలవాటు పడేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయానికి సిద్ధపడటంతో ప్రసుత్తం నగదు లభ్యత కష్టతరంగా మారింది.

12/02/2016 - 04:23

విశాఖపట్నం, డిసెంబర్ 1: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన నాడా తుపాను నేపథ్యంలో తూర్పు నౌకాదళం సహాయ చర్యలకు సిద్ధంగా ఉందని ఇఎన్‌సి పేర్కొంది.

12/02/2016 - 04:19

తిరుపతి, డిసెంబర్ 1: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో బాగంగా ఆరో రోజైన గురువారం ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి గరుడ వాహనంపై అలమేలు మంగ విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తన్మయులయ్యారు.

12/02/2016 - 03:44

మచిలీపట్నం, డిసెంబర్ 1: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్మార్గపు పాలన ఎల్లకాలం సాగదని, ఆయన ప్రభుత్వం మనుగడ రెండేళ్ళు మాత్రమేనని, దేవుడు దయదలిస్తే ఏడాదిలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.’ అని శాసనసభ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. బందరు ఓడరేవు, అనుబంధ పరిశ్రమల స్థాపనకు చేపట్టిన 33 వేల ఎకరాల భూ సమీకరణను నిరసిస్తూ గురువారం రైతు భరోసా యాత్ర నిర్వహించారు.

12/02/2016 - 03:41

విజయవాడ (క్రైం), డిసెంబర్ 1: గుంటూరు బ్యాంకు క్యూలైన్లలో నగదు కోసం నిరీక్షిస్తున్న సామాన్యులపై పోలీసుల దాడులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు ఖండించారు. అనంతపురం ఘటనపై పోలీసుశాఖ తరఫున ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పారు. గుంటూరులోని నగరం పాలెం, పాత గుంటూరు పోలీస్టేషన్లను ఆదర్శ పోలీస్టేషన్లుగా నిర్మిస్తూ జరుగుతున్న పనులను గురువారం తనిఖీ చేశారు.

12/02/2016 - 03:39

అమరావతి, డిసెంబర్ 1: ‘సార్ కేంద్రం బంగారంపై ఆంక్షలు పెడితే ఆడవాళ్లు ఊరుకోరు. మీరు ఇప్పుడు సంక్షోభ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు. మీరు ప్రధానికి ఫోన్ చేసి అలాంటి ఆంక్షలు వద్దని చెప్పండి. మహిళల మనోభావాలు దెబ్బతింటే రాజకీయంగా మనమూ నష్టపోతామ’ని పలువురు మంత్రులు ముఖ్యమంత్రికి సూచించారు.

12/02/2016 - 03:38

భీమవరం, డిసెంబర్ 1: సంక్రాంతి సంప్రదాయం ముసుగులో ఏటా జరిగే కోడి పందాల జాతరకు పశ్చిమ గోదావరి జిల్లాలో అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయి. పందాలకు అవసరమైన కోడిపుంజుల పెంపకం ఈ జిల్లాలో కుటీర పరిశ్రమగా వర్థిల్లే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే డెల్టా ప్రాంతంలోని పలు రహస్య ప్రాంతాల్లో కోడిపుంజుల పెంపకం జోరుగా సాగుతోంది. ఇక కోట్లలో జరిగే ఈ పందాల్లో రూ.500, రూ.1000 నోట్లే చెలామణీ అవుతాయి.

12/02/2016 - 03:36

విజయవాడ, డిసెంబర్ 1: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రాలకు ఆర్‌బిఐ కేటాయిస్తున్న నగదు, తదితర అంశాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని నీతి ఆయోగ్ నియమించిన కమిటీ కన్వీనర్ కూడా అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయ పడ్డారు. దేశంలో డిజిటల్ చెల్లింపుపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని నీతి ఆయోగ్ ఏర్పాటా చేయడం తెలిసిందే.

12/02/2016 - 03:35

హైదరాబాద్, డిసెంబర్ 1: ఆంధ్రప్రదేశ్‌లో చెరువుల నుంచి ఇష్టం వచ్చినట్లు పూడికను వెలికి తీసేందుకు అధికారులు అనుమతి ఇవ్వడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గుంటూరు నగరంలోని పోతూరు చెరువు నుంచి పూడికను తీసి అక్రమంగా విక్రయిస్తున్నట్లు వచ్చిన అభియోగాలపై అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు గుంటూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

12/02/2016 - 03:34

హైదరాబాద్, డిసెంబర్ 1:ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు మార్చి 17నుంచి ఏప్రిల్ 1 వరకూ, ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1నుంచి 17వ తేదీ వరకూ జరగనున్నాయి. ఏపిలో ఇంటర్ పరీక్షలను తెలంగాణ పరీక్షల షెడ్యూలు సమయంలోనే నిర్వహించనున్నారు. గత రెండేళ్లుగా రెండు రాష్ట్రాల్లో ఒకే తేదీ, ఒకే సమయంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Pages