S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/02/2016 - 03:11

హైదరాబాద్, డిసెంబర్ 1: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి నీట్ల రద్దు గండి భారీగా పడింది. గత ఏడాది ఆగమేఘాల మీద సభ్యత్వం తీసుకున్న వారు సైతం ఈ ఏడాది రెన్యువల్ చేసుకోకపోగా, కొత్త సభ్యులను సైతం ఆకర్షించలేకపోయింది. ఉన్న సభ్యులను నచ్చచెప్పి చేర్పిద్దామనుకునేంతలో పులిమీద పుట్రలా పెద్ద నోట్ల రద్దు వ్యవహారం వచ్చి పడింది.

12/02/2016 - 03:09

హైదరాబాద్, డిసెంబర్ 1: భూమి సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసే ముందు మార్కెట్ విలువను జిల్లా కలెక్టర్లు నిర్ధారించేందుకు తీసుకుంటున్న చర్యలపై వచ్చే మంగళవారం లోపల అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, జస్టిస్ ఏ శంకర్ నారాయణ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ పిల్‌ను మాజీ ఎమ్మెల్యే ఎ కోదండరెడ్డి దాఖలు చేశారు.

12/02/2016 - 03:08

హైదరాబాద్, డిసెంబర్ 1: అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చి (ఎఎండి) డైరెక్టర్‌గా ఎల్ కె నందా గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ ఎ కె రాయ్ పదవీ విరమణ అనంతరం ఈ పదవిని స్వీకరించిన నందా ప్రస్తుతం హెచ్ ప్లస్ స్థాయి సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు.

12/02/2016 - 03:07

హైదరాబాద్, డిసెంబర్ 1: హైదరాబాద్‌లో ఓ ఆదాయపు పన్నుశాఖ అధికారి ఇంటిపై సిబిఐ అధికారులు గురువారం సాయంత్రం మెరుపుదాడులు జరిపారు. నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఐటి శాఖ అధికారి బొడ్డు వెంకటేశ్వరరావు ఇంటితోపాటు ఆయన సమీప బంధువులకు చెందిన నాలుగు ఇళ్లల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపి, ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించారు.

12/02/2016 - 03:05

హైదరాబాద్, డిసెంబర్ 1: సింగరేణి కాలరీస్‌లోని ఉద్యోగులకు జీతాల చెల్లింపునకు బ్యాంకు మేనేజర్లను సంప్రదించి ఉద్యోగులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సింగరేణి కాలరీస్‌లోని అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లకు సింగరేణి డైరెక్టర్ జె పవిత్రన్ కుమార్ ఆదేశించారు.

12/01/2016 - 08:39

కొవ్వూరు, నవంబర్ 30: కాపు ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి డిసెంబర్ 2న తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో 13 జిల్లాల కాపు నేతల సమావేశం నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపు ఉద్యమాన్ని అణచేందుకు ప్రయత్నిన్నారని ఆరోపించారు.

12/01/2016 - 08:38

గూడెం కొత్తవీధి, నవంబర్ 30: విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ గణనీయంగా పడిపోతున్నాయి. ఆంధ్రా కాశ్మీర్‌గా పేరుగాంచిన లంబసింగిలో బుధవారం నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, చింతపల్లిలో ఏడు, గూడెంకొత్తవీధిలో ఐదు డిగ్రీల కనీస ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాల్లో గత రెండు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావడంలేదు.

12/01/2016 - 07:18

విజయవాడ, నవంబర్ 30: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో నగదు రహిత చెల్లింపులకు ప్రత్యేకంగా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు రూ.10 వేల రూపాయల మేరకు నగదు చెల్లించనున్నారు. నగదు లేకుండానే రేషన్ సరకులను తీసుకువేళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

12/01/2016 - 07:17

విజయవాడ, నవంబర్ 30: తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన గత రెండున్నరేళ్ల కాలంలో ఇప్పటికి రికార్డుస్థాయిలో 52 వేల 500 జీవోలు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి, మంత్రులు నిర్వహిస్తున్న శాఖల అధిపతులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇప్పటివరకూ రాష్ట్ర పాలనకు 52 వేల 500 జీవోలు ప్రభుత్వం జారీ చేసింది.

11/30/2016 - 04:26

విజయవాడ, నవంబర్ 29: తిరుపతిలో రహదారులు, బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్ట్, వర్సిటీల ప్రాంగణాలు, ముఖ్య కూడళ్లు సుందరీకరించాలి. డిసెంబర్ రెండవ వారంలోగా ఆయా పనులన్నీ పూర్తి చేసి ఇతర ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సైన్స్ కాంగ్రెస్‌పై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. చరిత్రలో నిలిచేలా ఈవెంట్ ఉండాలన్నారు.

Pages