S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/30/2016 - 04:16

విజయవాడ, నవంబర్ 29: తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య రవాణాకు సంబంధించి సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కోరారు. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం సిఎంను ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ అంశం దాదాపు రెండు సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉందని, దీనిని పరిష్కరించాలని కోరుతూ సిఎంను కలిసేందుకు నిర్ణయించామన్నారు.

11/30/2016 - 04:16

విజయవాడ, నవంబర్ 29: విశాఖ రైల్వే స్టేషన్‌లో ఇంజన్ రివర్స్ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు వీలుగా బల్బ్‌లైన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించే ప్రతిపాదనను తూర్పు కోస్తా రైల్వే తెరపైకి తెచ్చింది. దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయం కాగల ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు రైల్వే అధికారులు ఉంచారు.

11/30/2016 - 04:15

జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 29: కోదాడ నుండి విజయవాడ వెళుతున్న ఆర్‌టిసి సిఎన్‌జి షటిల్ సర్వీస్ బస్సు మంగళవారం ఉదయం 9గంటల సమయంలో చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో పల్టీ కొట్టింది. చిల్లకల్లు దాటిన తరువాత టోల్ ప్లాజా సమీపంలోకి వచ్చేసరికి బస్సు డ్రైవర్ కొండయ్యకు ఛాతిలో నొప్పిరావడంతో స్టీరింగ్ అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకుపోయి టోల్ ప్లాజాకు చెందిన హోర్డింగ్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది.

11/30/2016 - 04:15

అనకాపల్లి, నవంబర్ 29: రోజువారీ పొదుపు, నెలవారీ చీటీల పేరుతో అమాయక మహిళలను మోసగించి సుమారు రూ. 3 కోట్లతో ఉడాయించిన దంపతుల ఉదంతమిది. ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద పొదుపు స్కీమ్‌లు, చీటీల పేరుతో నెలవారీగా పెద్దమొత్తాలను సేకరించి బకాయిలు చెల్లించాల్సిన సమయం వచ్చేసరికి దంపతులిద్దరూ ఉడాయించడంతో లబోదిబోమంటూ బాధిత మహిళలు పట్టణ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు.

11/30/2016 - 04:14

హైదరాబాద్, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ పది, ఇంటర్ ఫలితాలను సోమవారం నాడు విడుదల చేశారు.

11/30/2016 - 04:13

హైదరాబాద్, నవంబర్ 29: పెద్ద నోట్ల రద్దు వల్ల ఉత్పన్నమయ్యే పరిస్ధితులను సరిదిద్దేందుకు కేంద్రం నియమించిన కమిటీ బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పగించడం వల్ల దేశం సర్వనాశనమవుతుందని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రామకృష్ణారెడ్డి, ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు.

11/30/2016 - 04:12

హైదరాబాద్, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ నియామకం చెల్లదని హైకోర్టు సింగిల్ జడ్జికోర్టు ఇచ్చిన తీర్పుపై సవాలు చేస్తూ ధర్మాసనం ఎదుట దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం మంగళవారం ప్రకటించింది. ఈ నెల 4వ తేదీన సింగిల్ జడ్జి కోర్టు కారెం శివాజీని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించడం చెల్లదని తీర్పు ఇచ్చింది.

11/30/2016 - 04:11

హైదరాబాద్, నవంబర్ 29: అరకు ఎంపి కొత్తపల్లి గీత వాల్మీకి ఎస్టీ తెగకు చెందిన మహిళ అని ధృవీకరిస్తూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయంపై దాఖలై పిల్‌ను హైకోర్టు విచారించింది. ఈ కేసులో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ధర్మాసనం మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను జిల్లా కలెక్టర్ జూలై 27వ తేదీన జారీ చేశారు.

11/29/2016 - 06:46

హైదరాబాద్, నవంబర్ 28: మెట్రో ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం శే్వతపత్రం విడుదల చేయాలని టిడిపి నాయకుడు, మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెట్రో ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్, టిఆర్‌ఎస్ ప్రభుత్వాలు ఆలస్యం చేశాయని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

11/29/2016 - 06:37

అమరావతి, నవంబర్ 28: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతిపక్షాలు సోమవారం నిర్వహించిన భారత్ బంద్ రాష్ట్రంలో విఫలమయింది. కొన్ని విద్యాసంస్థలు మినహా మిగిలినవన్నీ యథావిధిగా పనిచేశాయి. అయితే ముందుజాగ్రత్తగా రాజకీయ పార్టీల నాయకులు కొందరిని పోలీసులు అరెస్టు చేశారు.

Pages