S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/19/2016 - 03:31

న్యూఢిల్లీ, అక్టోబరు 18: ఏపీలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. మంగళవారం నాడు ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధి చూసి ఓర్వలేకే ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్‌పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.

10/19/2016 - 03:30

విశాఖపట్నం, అక్టోబర్ 18: అధ్యాపక నియామకాలకు సంబంధించి అర్హత పరీక్ష ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు (ఎపిసెట్) ఫలితాలను బుధవారం విశాఖలో విడుదల చేయనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎయు ప్లాటినం జుబ్లీ సమావేశ మందిరంలో నిర్వహించే ఒక కార్యక్రమంలో ఉదయం 10 గంటలకు ఎయు వైస్ చాన్సలర్ ఆచార్య జి.నాగేశ్వరరావు విడుదల చేస్తారు.

10/19/2016 - 03:29

హైదరాబాద్, అక్టోబర్ 18: కాపునేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రపై రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీ నేతలను ఆదేశించారు. సోమవారం పోలవరం పనులను సమీక్షించిన నేపథ్యంలో ఆయన తెదేపా ఎమ్మెల్యేలతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

10/19/2016 - 03:28

హైదరాబాద్, అక్టోబర్ 18: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే ఎంపిక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే అభ్యర్థుల పట్ల కఠినంగా వ్యవహరించేందుకు చట్టంలో మార్పులు తీసుకువచ్చింది. ఈ మేరకు మంగళవారం నాడు ఎపిపిఎస్‌సి గెజిట్ ప్రకటన చేసింది. అక్రమాలకు పాల్పడినట్టు తేలితే అభ్యర్థులను డిబార్ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు కూడా వీలుకల్పించారు.

10/19/2016 - 03:28

ఒంగోలు అర్బన్, అక్టోబర్ 18: ప్రజలు పూజిస్తున్న షిర్డీ సాయిబాబా దేవుడు, గురువు కాదని బదిరీ జ్యోతిపీఠం, ద్వారకా శారదాపీఠం పీఠాధీశ్వరులు శ్రీ స్వరుపానంద సరస్వతి మహారాజ్ పేర్కొన్నారు. దక్షిణా భారతదేశ విజయయాత్రలో భాగంగా మంగళవారం రాత్రి ఆయన ఒంగోలుకు చేరుకున్నారు.

10/19/2016 - 02:50

విజయనగరం(టౌన్), అక్టోబర్ 18: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేలుపు పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం అంబరాన్ని తాకింది. మంగళవారం సాయంత్రం సిరిమాను సంబరాన్ని తిలకించేందుకు అశేష భక్తజనంతో విజయనగరం నిండిపోయింది. ముందుగా ప్రకటించిన సమయానికి సిరిమాను ఇరుసు సీల అమర్చడంలో సాంకేతిక సమస్య ఉత్పన్నం కావడంతో గంటన్నర ఆలస్యంగా వేడుక ఆరంభమైంది.

10/19/2016 - 02:47

విజయవాడ, అక్టోబర్ 18: ఆంధ్రప్రదేశ్‌లో 45 వేల మంది వైద్య విద్యార్థుల క్రీయాశీలక భాగస్వామ్యంతో నవంబర్ 1న భారీ స్థాయిలో స్వాస్థ్య విద్యా వాహిని కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఎపి వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎంబిబిఎస్, పిజి, బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల ప్రధాన భాగస్వామ్యం ఉంటుంది.

10/19/2016 - 02:45

కురుపాం, అక్టోబర్ 18: ఇకపై ఎంపి, ఎమ్మెల్యే వంటి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత శత్రుచర్ల విజయరామరాజు ప్రకటించారు. మంగళవారం విజయనగరం జిల్లా కురుపాంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఇంతవరకు ఎమ్మెల్యేగా, ఎంపిగా, మంత్రిగా ఎంతో అభివృద్ధి చేశానన్నారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి పదవులు వరించే అవకాశం వస్తే పార్టీకి, ప్రజల కోసం పని చేస్తానన్నారు.

10/19/2016 - 02:43

హైదరాబాద్, అక్టోబర్ 18: కాపులకు బీసీ హోదా కల్పించేందుకు ఏపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు క్షేత్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. దానికోసం ఏర్పాటుచేసిన మంజునాధ కమిషన్ పర్యటనలు అన్ని జిల్లాల్లోనూ ఘర్షణ వాతావారణం నెలకొని, రసాభాసగా ముగుస్తుండటంతో కమిషన్ తలపట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

10/19/2016 - 02:41

హైదరాబాద్, అక్టోబర్ 18: తమ పరిధిలో ఉన్న భూముల్లో వచ్చే మూడు వారాల పాటు ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ హైకోర్టు మంగళవారం ఖమ్మం మమత ఎడ్యుకేషనల్ సొసైటీని ఆదేశించింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ శంకర్ నారాయణతో కూడిన ఈ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ పిల్‌ను ఎం సుధాకర్‌రావు దాఖలు చేశారు.

Pages