S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/20/2016 - 07:58

గుంటూరు, అక్టోబర్ 19: ‘రాజకీయాల్లో నిబద్ధతతో రాణిస్తున్నాం. మాకు అక్రమాస్తులులేవు. లెక్కకు మించి ఆస్తులు ఉన్నట్టు నిరూపించిన వారికి మా ఆస్తులన్నీ రాసిస్తాం. దేశంలో ఏ రాజకీయ పార్టీ నేతలూ ఇన్నిసార్లు బహిరంగంగా ఆస్తులు ప్రకటించిన దాఖలాలు లేవు’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.

10/20/2016 - 07:57

విజయవాడ, అక్టోబర్ 19: కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన 23 ఏళ్ల యువకుడు గంగుల వంశీకృష్ణ తాను చనిపోతూ తన అవయవాలను దానం చేయడం ద్వారా మరో ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపిన ఘటన మరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఇక కొన్ని గంటలు... కొన్ని క్షణాల్లో వంశీకృష్ణ చనిపోతున్నాడు..

10/20/2016 - 05:07

గుంటూరు, అక్టోబర్ 19: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందిన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇల్లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్పు తీసుకుని నిర్మిస్తున్నట్లు ఆయన కుమారుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వెల్లడించారు. అప్పులు పోగా ఆయనకు మిగిలిన ఆస్తుల విలువ కేవలం రూ.68 లక్షలు ఉన్నాయని ఆయన వివరించారు. మనవడు దేవాంశ్‌కు మాత్రం తాతకు మూడింతల స్థిరచరాస్తులు ఉన్నాయి.. ఇక లోకేష్‌కూ అప్పులున్నాయి..

10/20/2016 - 05:04

విజయవాడ, అక్టోబర్ 19: వౌలిక వసతుల కల్పనతో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రూపురేఖలు మారిపోనున్నాయి. వచ్చే నాలుగేళ్లలో రూ. 32,500 కోట్లతో వౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమయ్యే నిధులను వేగవంతంగా సేకరించాలని, తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రదింపులు జరపాలని సూచించారు.

10/20/2016 - 05:03

భీమవరం, అక్టోబర్ 19: ప్రజా సంక్షేమం దృష్ట్యా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణం నిలిపివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి (జగన్) డిమాండ్‌చేశారు. ఈ పార్కును సముద్ర తీర ప్రాంతానికి తరలించి నిర్మిస్తే తమ పార్టీ మద్దతిస్తుందన్నారు.

10/20/2016 - 05:01

విశాఖపట్నం, అక్టోబర్ 19: రాష్ట్రంలో 100 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు వేల డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలియచేశారు. బుధవారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ డిజిటల్ తరగతుల ఏర్పాటుకు అవసరమయ్యే నిధుల్లో 70 శాతం రాష్ట్రప్రభుత్వం భరిస్తుందని, 30 శాతం ఎన్‌ఆర్‌ఐలు విరాళంగా ఇవ్వనున్నారని చెప్పారు.

10/19/2016 - 03:37

గుంటూరు, అక్టోబర్ 18: ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి ఆయుర్వేద హబ్‌కు అన్నివిధాల అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తిరుపతి కొండల్లో ఆయుర్వేద ఔషధాలకు అవసరమైన మొక్కలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆధ్యాత్మికతతో పాటు ఆయుర్వేద హబ్‌ను ఏర్పాటుచేస్తే సత్ఫలితాలు సాధించవచ్చని ఇండో స్విస్ ప్రతినిధులకు సిఎం సూచించారు.

10/19/2016 - 03:34

హైదరాబాద్, అక్టోబర్ 18: ఇప్పటివరకూ ప్రభుత్వం, అమరావతికి నిధుల సేకరణ, అభివృద్ధిపై దృష్టి సారించిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇక పార్టీపై దృష్టి సారించనున్నారు. స్థానిక సంస్థలు, రాష్ట్రంలో వైసీపీ ఆందోళన కార్యక్రమాలు ముమ్మరం చేస్తుండటం, పార్టీ నేతల్లో సీరియస్‌నెస్ తగ్గిన నేపథ్యంలో ఇక పార్టీపై దృష్టి సారించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.

10/19/2016 - 03:33

హైదరాబాద్, అక్టోబర్ 18: అభివృద్ధి, పెట్టుబడులలో 12 వేల కోట్ల రూపాయల గల్లంతయ్యాయన్నది అబద్ధమని ఏపి సమాచారశాఖ కమిషనర్ వెంకటేశ్వర్ ఖండించారు. కేవలం అంకెల్లో తేడాలను చూపి 12 వేల కోట్లు గల్లంతయ్యాయని చెప్పడం తగదన్నారు. సీఎం కోర్ డాష్‌బోర్డులో ఉన్న సమాచారం మేరకు తాము గణాంకాలు అందించామన్నారు. కేవలం ఊహలు, కల్పితాల ఆధారంగా పెట్టుబడులపై వార్తాకథనం ఇవ్వడాన్ని ఖండించారు.

10/19/2016 - 03:32

హైదరాబాద్, అక్టోబర్ 18: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని, దీనికి సంబంధించి కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ సినీనటుడు ఎస్ శివాజీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఏపికి ప్రత్యేక హోదాను కల్పించే విషయమై హైకోర్టుకు ఉన్న అధికారాలు ఏమిటో వివరించాలని హైకోర్టు పిటిషనర్ న్యాయవాదిని కోరింది. పార్లమెంటు వేదికగా ఈ అంశంపై కేంద్రం హామీ ఇచ్చిందని న్యాయవాది కోర్టుకు తెలిపారు.

Pages