S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/19/2016 - 02:40

భీమవరం, అక్టోబర్ 18: వివాదాస్పదంగా మారిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో నెలకొల్పుతున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు ప్రభావిత గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి బుధవారం పర్యటించనున్నారు.

10/19/2016 - 02:38

విజయవాడ, అక్టోబర్ 18:ప్రతిభావంతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సాఫ్ట్‌వేర్‌తో కూడిన స్మార్ట్ ఫోన్స్ పంపిణీ చేస్తున్నదని ఇవి వారి ఎదుగుదలకు ఉపయోగపడతాయని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. బధిరుల దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడిక్కడ జరిగిన సభలో ఆయన ప్రతిభావంతులకు (బధిరులు) స్మార్ట్ మొబైల్ ఫోన్లు అందించారు.

10/19/2016 - 02:35

అనంతపురం, అక్టోబర్ 18: రానున్న సార్వత్రిక (2019) ఎన్నికల్లో తాను పోటీ చేయనని, రాజకీయాల నుంచి వైదొలుగుతానని అనంతపురం ఎంపి జెసి.దివాకర్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చట్టసభల్లో ఎంపిలు, ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చెప్పినట్లు వినాల్సి వస్తోందన్నారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొన్నా ప్రయోజనం ఉండడం లేదన్నారు.

10/19/2016 - 02:35

రాజమహేంద్రవరం, అక్టోబర్ 18: పట్టిసం ఎత్తిపోతల తరహాలో పోలవరం ఎడమ కాలువ ఆధారంగా విశాఖ జిల్లాకు గోదావరి నీరు తరలింపునకు తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తంపట్నం వద్ద నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల పథకానికి ఎన్నో ఆటంకాలు కనిపిస్తున్నాయి. అఖండ గోదావరి ఎడమ గట్టుపై పుష్కర ఎత్తిపోతల పథకం చెంతనే నిర్మించనున్న ఈ ఎత్తిపోతల పథకంపై ఆరంభంలోనే ఆందోళన సెగ రాజుకుంటోంది.

10/19/2016 - 02:34

విజయవాడ, అక్టోబర్ 18: ఇప్పటి వరకు డ్రైగోడౌన్లకే పరిమితమైన ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ. 123 కోట్ల వ్యయంతో విశాఖపట్నం, భీమవరం, గుంటూరులలో కోల్డ్ స్టోరేజీలను నిర్మిస్తున్నట్లు వేర్ హౌసింగ్ చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ తెలిపారు. ఇందుకోసం సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సహకారం కూడా తీసుకుంటున్నామన్నారు.

10/19/2016 - 02:33

విశాఖపట్నం, అక్టోబర్ 18: మరో మూడు, నాలుగు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు తీరాన్ని తాకవచ్చు. రుతుపవనాల రాకకు వాతావరణం అనుకూలంగా ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు వాతావరణం వీలుగా ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనాలు బలంగా ఉన్నాయి. దీంతో ఇవి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది దక్షిణ తమిళనాడు తీరానికి సమీపంలోకి వచ్చేందుకు మూడు, నాలుగు రోజులు పడుతుంది.

10/18/2016 - 07:56

విజయవాడ, అక్టోబర్ 17: దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, డిప్లొమా కోర్సులు చదువుకోటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేవలం రెండేళ్ల వ్యవధిలోనే రెండు లక్షలతో ప్రారంభించి రూ.25లక్షల వరకు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకొచ్చారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు.

10/18/2016 - 07:55

విజయవాడ, అక్టోబర్ 17: విశాఖలో నిర్వహించిన పార్టనర్‌షిప్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి 10 లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయని తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో నిజం లేదని మాజీ సభాపతి, ఏపిపిసిసి ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ, విశాఖ జిల్లాలో నిర్వహించిన పార్టనర్‌షిప్ సమ్మిట్ బోగస్ అని విమర్శించారు.

10/18/2016 - 07:54

హైదరాబాద్, అక్టోబర్ 17: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేతగా పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. కనీసం అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగినప్పుడు ఓటింగ్ కూడా పెట్టించలేకపోయారని విమర్శంచారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలను అమలు చేయించుకోలేని దుస్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని విమర్శించారు.

10/18/2016 - 07:54

హైదరాబాద్, అక్టోబర్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావుడిగా ప్రారంభించిన రెయిన్ గన్స్‌తో ఒక్క ఎకరా పండించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రెయిన్ గన్స్ ద్వారా 24 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని ఆర్భాటం చేశారని, చివరకు ఒక్క ఎకరాలో కూడా పంట రాలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఖరీఫ్‌లో రైతులు దెబ్బతిన్నారని అన్నారు.

Pages