S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/18/2016 - 02:53

అనంతపురం సిటీ, అక్టోబర్ 17: బిసిల అభివృద్ధిని అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నాయని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

10/17/2016 - 04:09

విజయవాడ (ఇంద్రకీలాద్రి), అక్టోబర్ 16: పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గమ్మ శ్రీ స్వర్ణకవచాలంకృత అలంకారంతో భక్తులకు దివ్యదర్శనం మిచ్చింది. దసరా మహోత్సవాలు ముందు ఒక దాత సుమారు 4 కోట్ల 50 లక్షల ఖర్చుతో అమ్మవారికి పసిడి కవచం, పసిడి ఆభరణాలు తదితరాలు అమ్మవారికి సమర్పించారు. పౌర్ణమి సందర్భంగా దాత ఇచ్చిన ఆభరణాలను అమ్మవారికి అలకరించారు.

10/17/2016 - 04:07

తిరుమల, అక్టోబర్ 16: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆదివారం పౌర్ణమి సందర్భంగా పున్నమి వెలుగుల్లో గరుడ వాహనంపై విహరించి భక్తులకు కనువిందుచేశారు. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్యన మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ శ్రీవారి పున్నమి గరుడ సేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది. మలయప్పస్వామి సర్వాలంకార భూషితుడై సువర్ణునిపై విహరించిన వైనాన్ని తిలకించిన భక్తులు పునీతులయ్యారు.

10/17/2016 - 04:05

నెల్లూరు, అక్టోబర్ 16: మతాలకు, ప్రాంతాలకు అతీతంగా నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండగ ఆదివారంతో ముగిసింది. ఈనెల 12న ప్రారంభమైన ఈ వేడుక ఐదు రోజుల పాటు సాగింది. చివరిరోజైన ఆదివారం కూడా యాత్రికులు అధిక సంఖ్యలో పాల్గొని స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్పిడి చేసుకున్నారు.

10/17/2016 - 04:02

శ్రీకాళహస్తి, అక్టోబర్ 16: తమిళనాడు సిఎం డాక్టర్ జయలలిత ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ శ్రీ కాళహస్తిలో ఆదివారం మహా మృత్యుంజయ యాగం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్టుబోర్డు అధ్యక్షుడు గురవయ్యనాయుడు భరద్వాజ తీర్థంలో యాగాన్ని జరిపించారు. దేవస్థానం పూజారులు, వేద పండితులు వేదమంత్రాలతో యాగాన్ని నిర్వహించారు. అనారోగ్యం నుంచి జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

10/17/2016 - 04:00

దర్శి, అక్టోబర్ 16: అవినీతి కుంభకోణంలో కురుకుపోయిన జగన్ అవినీతిని ఎన్ని గడపలు ఎక్కినా కడగలేరని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, శిద్దా రాఘవరావు ధ్వజమెత్తారు.

10/17/2016 - 03:59

హైదరాబాద్, అక్టోబర్ 16: గన్నవరం విమానాశ్రయం విస్తరణలో భాగంగా నాలుగు గ్రామాల్లో భూసేకరణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.24 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. అజ్జంపూడి, అల్లాపురం, బుద్ధవరం, కీసరపల్లి గ్రామాల్లో రైతుల పౌల్ట్రీ షెడ్లు, నిర్మాణాలు, చెట్లు, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ, కొన్ని భూములు సేకరించాలని ఇంధన, వౌలిక సదుపాయాల శాఖ నిర్ణయించింది.

10/17/2016 - 03:59

పెరవలి, అక్టోబర్ 16: ప్రమాదవశాత్తు భార్యాభర్తలు కాలువలో పడి మృతిచెందిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రు వద్ద చోటుచేసుకుంది. ఘటన శనివారం రాత్రి చోటుచేసుకోగా, మృతదేహాలు ఆదివారం ఉదయం లభ్యమయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం పెరవలి మండలం తీపర్రు గ్రామానికి చెందిన ప్రత్తిపాటి అచ్యుతరామచంద్రరావు (51), జ్యోతి దంపతులు కొంతకాలంగా కాకరపర్రు గ్రామంలో నివాసం ఉంటున్నారు.

10/17/2016 - 03:58

తెనాలి, అక్టోబర్ 16: రాడికల్ యువజన సంఘం రాష్ట్ర తొలి అధ్యక్షుడు, విరసం మాజీ సభ్యుడు విజె వర్ధనరావు (70) గుంటూరు జిల్లా తెనాలిలోని తన నివాసంలో శనివారం అర్ధరాత్రి హఠాన్మరణం చెందారు. విఎస్‌ఆర్ అండ్ ఎన్‌విఆర్ కళాశాల అధ్యాపకునిగా ఆయన పనిచేశారు. మరోవైపు విప్లవోద్యమంలో ఎందరో యువకులను రాజకీయ శిక్షణ తరగతుల ద్వారా ఉద్యమ పథాన నడిపించారు. అనేక సార్లు అరెస్ట్‌లు, వేధింపులతో జైలు జీవితం గడిపారు.

10/17/2016 - 03:58

విజయవాడ, అక్టోబర్ 16: రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రను పునాదుల నుంచి నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ దేశమైనా, రాష్టమ్రైనా అభివృద్ధి పథంలో ముందుండాలంటే పారిశ్రామిక ప్రగతి తప్పనిసరి. ఈ విషయాన్ని గుర్తెరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్భ్రావృద్ధికి ప్రత్యేక పారిశ్రామిక పాలసీని ప్రవేశపెట్టారు. సింగిల్ డెస్క్ విధానంలో 14 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అనుమతులిస్తున్నారు.

Pages