S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/19/2016 - 01:57

కోరుకొండ/గోకవరం, సెప్టెంబర్ 18: భారీ వర్షాలకు తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ మండలంలోని శ్రీరంగపట్నం, మండల కేంద్రం గోకవరంలోని మూడు కాలనీలు ఆదివారం నీట మునిగాయి. శనివారం అర్థరాత్రి తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదయ్యింది. ఫలితంగా ఏజెన్సీలోని సూరంపాలెం ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. దీనితో వరద నీటిని దిగువకు వదిలివేయడంతో కోరుకొండ మండలంలోని శ్రీరంగపట్నం గ్రామం నీటమునిగింది.

09/19/2016 - 01:56

ఓర్వకల్లు, సెప్టెంబర్ 18 : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని పుడిచెర్ల గ్రామ సమీపంలో కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు నగరంలోని బాలాజీనగర్‌కు చెందిన మహేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి కారులో పాణ్యంలోని కొత్తూరు సుబ్బరాయుడిస్వామి దర్శనార్థం వెళ్లారు.

09/19/2016 - 01:55

నందిగామ, సెప్టెంబర్ 18: కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పల్లెంపల్లి గ్రామ సమీపంలో గల వైరా ఏటి నీటి కుంటలో పడి ఆదివారం ముగ్గురు మృతి చెందారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వీరులపాడు మండలం కొణతాలపల్లికి చెందిన తుపాకుల శ్రీనివాసరావు (37) తన బైక్‌ను శుభ్రం చేసుకుంటుండగా అతనితో వెళ్లిన మేనళ్లులు వీరంశెట్టి అరుణ్‌కుమార్ (11), సుగ్గన నారేంద్రబాబు (9) నీటి కుంటలో స్నానం చేసేందుకు దిగారు.

09/19/2016 - 01:54

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: జమ్మూకాశ్మీర్‌లో ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం రెఫరెండం నిర్వహించాలని ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ పొలిటికల్ అధికార ప్రతినిధి, మావోయిస్టు నేత జగబందు డిమాండ్ చేశారు. ఈ నెల 21న మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఒక లేఖ విడుదల చేశారు. స్కాట్‌లాండ్‌లో ఇటీవల జరిగిన రెఫరెండంలో ప్రజలు తమ మనోభావాలను వెల్లడించారని గుర్తు చేశారు.

09/19/2016 - 01:53

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాను ఆనుకుని సముద్ర ఉపరితలం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

09/19/2016 - 01:52

కడప, సెప్టెంబర్ 18: కడప జిల్లా పోలీసు శాఖలో ప్రక్షాళనకు ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ నడుం బిగించారు. అందులో భాగంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు ఎస్‌ఐలు, ఒక కానిస్టేబుల్‌పై సమగ్ర విచారణ చేసి సస్పెన్షన్‌కు సిఫారసు చేశారు.

09/19/2016 - 01:49

విజయవాడ, సెప్టెంబర్ 18: నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు సంబంధించి వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యానికి చేరువగా పనిచేస్తోంది. రాష్ట్రంలోని నగర పంచాయతీల్లో 38,916 మరుగుదొడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయగా 33,185 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. మరో 5731 మరుగుదొడ్ల నిర్మాణం కొనసాగుతోంది.

09/19/2016 - 01:48

హిందూపురం, సెప్టెంబర్ 18: మానసిక స్థితి సరిగా లేని పనె్నండేళ్ల కూతురికి ఉరి వేసి ఆపై తల్లీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లెలో చోటుచేసుకుంది. పల్లా రమేష్ భార్య రాజేశ్వరి (31), కూతురు పద్మశ్రీ (12)లతో కలిసి ముద్దిరెడ్డిపల్లిలో నివసిస్తున్నారు.

09/19/2016 - 01:47

ఎచ్చెర్ల, సెప్టెంబర్ 18: హోదాకు దీటుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్యాకేజీను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాధించారని అయితే రాజకీయ పరిపక్వత లేని పలువురు నేతలు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా, పూడివలస గ్రామంలో ఆదివారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, అక్కడి సభలో మాట్లాడారు.

09/19/2016 - 01:46

రాజాం, సెప్టెంబర్ 18: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కొందరు, ప్యాకేజీ కావాలని మరికొందరు డిమాండ్ చేయడంతో దానిపై స్పష్టత ఇవ్వలేమని కేంద్ర పౌర విమానాయానశాఖామంత్రి పి.అశోక్‌గజపతిరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా, రాజాం, రేగిడి మండలాల్లో ఆదివారం పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన రాజాం నగర పంచాయతీ ఆవరణలో విలేఖర్లతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై ప్రశ్నించినప్పుడు ఆయన కొంత అసహనానికి గురయ్యారు.

Pages