S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/20/2016 - 02:46

విజయవాడ, సెప్టెంబర్ 19: దక్షిణ మధ్య రైల్వేలో అతిపెద్ద విజయవాడ జంక్షన్ రైల్వేస్టేషన్‌లో దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో జరుగనున్న రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిగ్నలింగ్ వ్యవస్థ, ప్లాట్‌ఫారాల ఆధునీకరణ పనుల కోసం ఈ నెల 20 నుంచి 28 వరకు రైళ్ల రాకపోకలన్నీ పూర్తిగా నిలిచిపోనున్నాయి. దాదాపు రెండు వేలమంది కార్మికులు ఈ ఆధునీకరణ పనుల్లో పాల్గొంటున్నారు.

09/20/2016 - 02:42

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 19: రాష్ట్రంలోని ఎయిర్‌పోర్టులు, ఓడరేవులను అభివృద్ధిచేయడంతోపాటు కొత్తగా మరిన్ని ఏర్పాటుచేయడం ద్వారా అభివృద్ధికి బాటలు వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. త్వరలో రాజమహేంద్రవరం, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.

09/20/2016 - 02:32

అమరావతి, సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. రాష్ట్భ్రావృద్ధికి అన్ని విధాలా సాయం చేస్తామంటూ పదే పదే చెప్తూనే, నిబంధనల పేరుతో నిర్దయగా వ్యవహరిస్తోంది.

09/19/2016 - 18:21

రాజమండ్రి : హోదాతో సమానంగా ప్యాకేజీ ఇస్తామంటే ఎందుకు తీసుకోకూడదని, నిధులు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, దానికి హోదా ఐతేనేమి, ప్యాకేజీ ఐతేనేమి అని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పేర్కొన్నారు. తాను ఎవరికీ భయపడనని, ఎక్కడా రాజీ పడేది లేదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ అడుగడుగునా అడ్డుకుంటోందని, వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చంద్రబాబు చెప్పారు.

09/19/2016 - 18:00

రాజమండ్రి: డ్వాక్రా మహిళలకు వచ్చే నెలలో రెండో విడత మాఫీ నిధులు విడుదల చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రకటించారు. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగకుండా కాపులను న్యాయం చేస్తామని అన్నారు. కాపులకు రిజర్వేషన్లపై మంజునాథ కమిషన్‌ వేశామని, కాపులకు బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించామని గుర్తు చేశారు.

09/19/2016 - 16:30

కడప: ఎస్‌ఐ రమేష్‌బాబు సస్పెన్షన్‌కు నిరసనగా రైల్వేకోడూరు హైవేపై సోమవారం విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. మంత్రి గంటా కారును అడ్డుకునేందుకు విపక్షాలు యత్నించాయి. పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. తప్పుడు ఆరోపణలతో ఎస్‌ఐని సస్పెండ్‌ చేశారని విపక్షాలు ఆరోపించాయి.

09/19/2016 - 16:23

పామర్రు: మారిన పరిస్థితులకు అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పామర్రు మండలం నెమ్మలూరులో బెల్‌ పరిశ్రమకు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ- 2018 నాటికి బెల్‌ పరిశ్రమ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి అనేక సంస్థలు వస్తున్నాయని..

09/19/2016 - 16:18

హైదరాబాద్‌: ప్యాకేజీలో లేనివి ఏమిటో చెప్పాలని, ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై దుష్ప్రచారం ఆపాలని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కావాలని కోరుతున్నామని తెలిపారు. రబీలో 40 శాతం రాయితీపై అపరాల విత్తనాలు పంపిణీ చేస్తామని చెప్పారు. రైతులు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు.

09/19/2016 - 16:10

హైదరాబాద్‌: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామాతో ఖాళీ అయిన ఖమ్మం ఎమ్మెల్సీ స్థానం ఎన్నికకు ఈ నెల 26న నోటిఫికేషన్‌ జారీ చేసి, అక్టోబర్‌ 17న పోలింగ్‌ జరపనున్నారు. ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌ పేరును తమ అభ్యర్థిగా గతంలోనే తెరాస ప్రకటించింది.

09/19/2016 - 14:27

పామర్రు : కృష్ణా జిల్లా పామర్రు మండలం నెమ్మలూరులో రూ.300కోట్లతో నిర్మించనున్న భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌) సంస్థకు సోమవారం శంకుస్థాపన నిర్వహించారు. రక్షణశాఖకు అవసరమైన అడ్వాన్స్‌ నైట్‌విజన్‌ లెన్స్‌ను ఈ కర్మాగారంలో తయారుచేయనున్నారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎంపీ కొనకళ్ల నారాయణ, పలువురు ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.

Pages