S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/22/2016 - 03:53

ఏలూరు, జూలై 21 : పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలోవున్న సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఎసిబి అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 3,66,415 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. లెక్కకు అందని ఈ నగదు ఏ రకంగా కార్యాలయంలోవుందన్న అంశంపై ఆరాతీస్తున్నారు. ఈ హడావిడిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి జారుకున్నట్లు తెలుస్తోంది.

07/22/2016 - 03:52

విశాఖపట్నం, జూలై 21: ప్రతిష్టాత్మకమైన క్యుఎస్ విశ్వవిద్యాయలం బ్రిక్స్ దేశాలకు సంబంధించి తాజాగా ప్రకటించిన ర్యాంక్‌ల్లో భారత దేశ విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 23వ ర్యాంక్ సాధించింది.

07/22/2016 - 03:52

విశాఖపట్నం, జూలై 21: ఒడిశా, తమిళనాడు, పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకుని ఉపరితల ఆవర్తనం గురువారం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. ఆవర్తనానికి రుతుపవనాల ప్రభావం తోడవటంతో శనివారం మరిన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

07/22/2016 - 03:51

అనంతపురం, జూలై 21: అనంతపురం నగరంలో గురువారం పట్టపగలు జంట హత్యలు జరిగాయి. మోటార్‌బైక్‌పై వెళ్తున్న వెంకటేష్‌నాయక్(24), గోపీనాయక్(27)ను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపారు. సంచలనం రేపిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

07/22/2016 - 03:50

కర్నూలు, జూలై 21: జూరాలలో విద్యుదుత్పత్తి అనంతరం గురువారం దిగువకు 11 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఈ నీరు శుక్రవారం నాటికి శ్రీశైలం జలాశయం చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్నా వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండిపోయాయి. దీంతో దిగువకు విడుదల చేసిన నీరు జూరాలకు చేరుకుంటోంది. గురువారం ఎగువ నుంచి జూరాలకు 58,485 క్యూసెక్కుల నీరు వచ్చింది.

07/22/2016 - 03:47

కంభం, జూలై 21: ఉపాధ్యాయుడు కొట్టడంతో కంటిచూపు కోల్పోయిన విద్యార్థి ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ప్రకాశం జిల్లా కంభం మండలంలోని రావిపాడు గ్రామానికి చెందిన కె గోపాల్ కుమారుడు మోహనరంగ కంభంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కెజి చదువుతున్నాడు. వారంరోజుల కిందట పాఠశాలలో ఉపాధ్యాయుడు మోహనరంగను కొట్టాడు. దీనితో మోహనరంగకు కంటిచూపు సరిగా కనిపించకపోవడంతో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు తెలిపాడు.

07/22/2016 - 03:46

గుంటూరు, జూలై 21: వచ్చే నెల 12 నుంచి జరిగే కృష్ణా పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాలో ఆర్‌అండ్‌బి పరిధిలోని రహదారుల అభివృద్ధికి 300 కోట్ల రూపాయలు కేటాయించినట్లు రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు.

07/22/2016 - 03:45

న్యూఢిల్లీ, జూలై 21: ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక హోదా ఇవ్వాలని టిడిపి సభ్యుడు అవంతి శ్రీనివాసరావులోక్‌సభలో డిమాండ్ చేశారు. శ్రీనివాసరావు గురువారం లోక్‌సభ జీరోఅవర్‌లో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రత్యేక హోదా ఎంతో అవసరమని శ్రీనివాస రావు స్పష్టం చేశారు.

07/21/2016 - 18:52

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన ఇతి వృత్తంగా ‘చంద్రోదయం’ పేరుతో నిర్మించే సినిమాకి సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు దర్శక, నిర్మాతలు చెప్పారు.

07/21/2016 - 18:24

కర్నూలు: కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నాయకుడు మురళీకృష్ణను అదనపు కట్నం కోసం భార్యను వేధించిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టు కాకుండా మురళీకృష్ణ హైకోర్టును ఆశ్రయించి బెయిల్‌ తీసుకున్నా, విచారణ నిమిత్తం కర్నూలు పోలీసులు ఎదుట హాజరు కావాలని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. మురళీకృష్ణను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ వినోద్‌కుమార్‌ తెలిపారు.

Pages