S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/22/2016 - 04:15

వెంకటాచలం, జూలై 21: నెల్లూరు జిల్లాకేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న వెంకటాచలం టోల్‌ప్లాజా సమీపంలో దారిదోపిడీ జరిగింది. చెన్నై నుంచి నెల్లూరుకు కారులో బంగారం తీసుకుని వస్తుండగా గుర్తుతెలియని దుండగులు కారును అడ్డగించి అందులోని వారిని కత్తులు, కర్రలతో బెదిరించి కారుతో పాటు లోపల ఉన్న 3.5 కిలోల బంగారంతో పరారయ్యారు.

07/22/2016 - 04:14

న్యూఢిల్లీ, జూలై 21: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి శకునిలా మారారని, ప్రత్యేక హోదా, మిగిలిన అంశాలు అమలు కాకపోవడానికి ఆయనే ప్రధాన అడ్డంకి అని ఎపిపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి దుయ్యబట్టారు. ఢిల్లీలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేకహోదాపై ప్రైవేటు మెంబర్ బిల్లు విషయంలో బాధ్యత లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు.

07/22/2016 - 04:13

న్యూఢిల్లీ, జూలై 21: ఎయిమ్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి జెపీ నడ్డాను కలసి ఏపీ ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. గురువారం నాడు ఢిల్లీలో కేంద్రమంత్రులు అనంత్‌కుమార్, అనిల్ మాధవ్ దవేలను కలసి పలు అంశాలు చర్చించారు.

07/22/2016 - 04:12

హైదరాబాద్, జూలై 21: ఆంధ్రప్రదేశ్ రాష్టస్థ్రాయిలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన సూచనలు ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రైవేట్ సెక్టార్ సలహామండలిని ఏర్పాటు చేస్తూ జీవోను జారీ చేసింది. ఈ మండలికి చైర్‌పర్సన్‌గా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిని నియమించారు. కన్వీనర్‌గా రాష్ట్ర ప్రాజెక్టు సలహాదారు ఉంటారు.

07/22/2016 - 04:11

గుంటూరు, జూలై 21: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి మరో రెండు కీలక విభాగాలను తరలించారు. తొలివిడత గత నెల 29వ తేదీన పంచాయతీరాజ్, గృహనిర్మాణశాఖల కార్యాలయాలు ఏర్పాటు కాగా, తాజాగా గురువారం మధ్యాహ్నం రవాణా, రోడ్లు, భవనాలు, విజిలెన్స్ కమిషనరేట్లకు చెందిన ఉద్యోగులు సుమారు వంద మంది ప్రత్యేక బస్సుల్లో సచివాలయానికి చేరుకున్నారు.

07/22/2016 - 03:59

విశాఖపట్నం, జూలై 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపగా పులస చేపను ప్రకటించాలంటూ కొందరూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే కొరమీను చేపను రాష్ట్ర చేపగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రుచికరమైన ఈ చేపను రాష్ట్ర చేపగా ప్రకటించాలని కోరుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి (ఐసిఎఆర్) 2007 ఒక ప్రతిపాదన తెరమీదకు తీసుకువచ్చింది.

07/22/2016 - 03:56

విజయవాడ, జూలై 21: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను ప్రజా సాధికార సర్వేలో ఎన్యూమలేటర్లుగా వినియోగించుకునే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్స్ సర్వే కార్యక్రమ పురోగతిని గురువారం ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

07/22/2016 - 03:55

విజయవాడ, జూలై 21: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో పసికందు కిడ్నాప్ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మగబిడ్డ కోసమే ఐదురోజుల పసికందును ఆస్పత్రి వార్డు నుంచి మహిళ కిడ్నాప్ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ తెలిపారు.

07/22/2016 - 03:54

కడప, జూలై 21: ఎర్రచందనం దుంగలు వేలం నోటిఫికేషన్ జారీ నేపధ్యంలో స్మగ్లర్లు, కాంట్రాక్టర్ల సిండికేట్‌పై ఇంటలిజెన్స్‌వర్గాలు నిఘా పెట్టినట్లు సమాచారం. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో స్మగ్లర్లతో కాంట్రాక్టర్లు కుమ్మకు కాకుండా చూసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

07/22/2016 - 03:54

విజయవాడ, జూలై 21: రాష్ట్రంలో కొత్త బార్ పాలసీని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్‌తోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 766 బార్‌లు పనిచేస్తున్నాయి. బారుల నిర్వహణపై కొత్త విధానాన్ని తీసుకురావాలన్న యోచనలో ఉన్నట్టు మంత్రి రవీంద్ర చెప్పారు.

Pages