S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/20/2016 - 12:44

విశాఖ: కశింకోట మండలం బయ్యవరం వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డుపై ఆగిఉన్న లారీని వెనుక నుంచి మరోలారీ, బస్సు ఢీకొనడంతో 40 మంది గాయపడ్డారు. బస్సులోపలి భాగం చాలావరకూ ధ్వంసమైంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

07/20/2016 - 08:32

హైదరాబాద్, జూలై 19: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రి సభ్య కమిటీ సమావేశం బుధవారం హైదరాబాద్‌లో జరుగుతుంది. కృష్ణా జలాల వినియోగాన్ని పర్యవేక్షించడం ఈ కమిటీ ప్రధాన విధి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ఇంజనీరింగ్ చీఫ్‌లు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులు. గత సమావేశంలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్య కార్యదర్శిగా గుప్తా వ్యవహరించారు.

07/20/2016 - 08:30

హైదరాబాద్, జూలై 19: రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం తెదేపా-్భజపా మిత్రపక్షాల మధ్య మరోసారి చిచ్చుకు కారణమవుతోంది. అసలు ఓటింగు సాధ్యం కాని ప్రత్యేక హోదా బిల్లును అడ్డుపెట్టుకుని తెదేపా రాజకీయం చేస్తోందని, కేంద్రంలో ఇద్దరు మంత్రులుండగా, కాంగ్రెస్ ఎంపి కెవిపి ప్రైవేటు బిల్లును ఎలా సమర్థిస్తుందని భాజపా నేతలు మండిపడుతున్నారు.

07/20/2016 - 08:24

హైదరాబాద్, జూలై 19: అమరావతి నగర నిర్మాణాలను సింగపూర్ కంపెనీలతో నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలవాలనుకుంటున్న తెదేపా సర్కారు నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. స్విస్ చాలెంజ్ పద్ధతిలో అసలు నిర్మాణదారు సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలు రహస్యంగా ఉంచడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి.

07/20/2016 - 08:22

విజయవాడ, జూలై 19: రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ఆదాయంలో 72 శాతం వాణిజ్య పన్నుల శాఖ ద్వారానే వస్తోందని, ఏ శాఖలోనైనా నీతి, నిజాయితీతో పనిచేసే అధికారులకు ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తోందని రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నులు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.

07/20/2016 - 08:05

హైదరాబాద్, జూలై 19: టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ కార్యక్రమం అనంతపురం జిల్లాల్లో విజయవంతం కావడంతో ఈ విధానాన్ని తాజాగా కర్నూలు, విజయనగరం జిల్లాలో అమలుచేయాలని సర్వశిక్షా అభియాన్ నిర్ణయించింది.

07/20/2016 - 08:04

విజయవాడ, జూలై 19: భారతదేశంలో పవిత్ర నదులకు నిత్య హారతులు ఇస్తుంటారు. కొన్ని నదులకు ప్రత్యేక పర్వదినాల్లో హారతులు ఇస్తుంటారు. ఏ నదికి హారతి ఇచ్చినా, అది సూర్యాస్తమయ సమయానికి కాస్త అటుఇటుగా ఇస్తుంటారు. గత ఏడాది జరిగిన గోదావరి పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నదీ హారతిని ప్రవేశపెట్టారు. దాన్ని నిత్య హారతిగా నిర్వహించాలని ఆదేశించారు.

07/20/2016 - 08:03

హైదరాబాద్, జూలై 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో వౌలిక సదుపాయాల అభివృద్ధికి వచ్చే రెండేళ్లలో రూ. 13,710 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఏపి ట్రాన్స్‌కో డైరెక్టర్ దినేష్ పరుచూరి తెలిపారు.
మంగళవారం ఢిల్లీలో జరిగిన దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్ధల ఉన్నతాధికారుల సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపిలో విద్యుత్ కోతలు లేవని, మిగులు విద్యుత్ సాధించామన్నారు.

07/20/2016 - 05:55

విజయవాడ, జూలై 19: ఎన్టీఆర్ దగ్గర నుంచి తాను పట్టుదలంటే ఏమిటో నేర్చుకున్నానని, ఆ పట్టుదలతోనే నదులను అనుసంధానం చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణ, గోదావరి నదీ సంగమ ప్రాంతానికి ఆయన మంగళవారం మధ్యాహ్నం హారతి ఇచ్చారు. ఆ తరువాత జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఏ పనీ అసాధ్యం కాదని అన్నారు. నదీ సంగమం వలన వేల ఎకరాల్లో అదనపు భూమి సాగుబడిలోకి వస్తుందని అన్నారు.

07/20/2016 - 05:53

విజయవాడ, జూలై 19:అమరావతిలో వౌలిక సదుపాయాల కల్పనలో సహాయ సహకారాలు అందించేందుకు చైనాకు చెందిన గుజౌ మారిటైం సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ కార్పొరేషన్ (జిఐఐసి) ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ఇటీవల చైనాలో పర్యటించిన సందర్భంగా జరిగిన ప్రాథమిక చర్చల పర్యవసానంగా జిఐఐసి ప్రతినిధులు మంగళవారం విజయవాడకు వచ్చారు. సిఎం, మంత్రి నారాయణ, సీఆర్‌డిఏ అధికారులతో వారు చర్చలు జరిపారు.

Pages