S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/19/2016 - 03:55

తిరుమల: అంతకు ముందు డిజిపి రాముడు తిరుమలలో ఆక్టోపస్ బేస్ క్యాంపు నిర్మాణానికి భూమి పూజ చేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల, ఆలయ భద్రతపై రాజీపడే ప్రసక్తే ఉండదని, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

07/19/2016 - 03:54

మదనపల్లె, జూలై 18: ఎర్రచందనం కేసుల చట్టానికి పదును పెట్టినట్లు ఆంధ్రప్రదేశ్ డిజిపి జె.వి.రాముడు స్పష్టం చేశారు. ఈ చట్టంలో మార్పు తీసుకురావడంతో కేసులు త్వరితగతిన పరిష్కారంతో పాటు నిందితులకు కఠిన శిక్షలు పడతాయని తెలిపారు. చిత్తూరుజిల్లా మదనపల్లె పట్టణం రెండో పట్టణపోలీస్‌స్టేషన్‌లో కంట్రోల్ కమాండ్ కేంద్రాన్ని డిజిపి సోమవారం ప్రారంభించారు.

07/19/2016 - 03:53

పరవాడ, జూలై 18: ఔషధ పార్కులను ప్రభుత్వాలే అభివృద్ధి చేసే విధంగా ఉండాలని రాష్ట్ర ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కమిటీ పరవాడ మండలం సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎన్టీపీసీ), జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని రాంకీ కమర్షియల్ హబ్‌ను సందర్శించింది.

07/19/2016 - 03:52

ఖమ్మం, జూలై 18: రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో 240కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సోమవారం ఖమ్మం నగరంలో ఒకేరోజు రెండు లక్షల మొక్కలను నాటే కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం మంత్రి రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజునే 9 కోట్ల మొక్కలు నాటామని చెప్పారు.

07/19/2016 - 03:51

అనంతపురం, జూలై 18: రాష్ట్రంలో ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ దుకాణాల ద్వారా లబ్దిదారులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు పౌర సరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. లబ్దిదారులు గ్రామంలోని ఏ దుకాణం నుంచైనా సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు.

07/19/2016 - 03:51

కాకినాడ, జూలై 18: రాష్ట్రంలో కాపుల సంక్షేమం కోసం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు మంజూరు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు కాపులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. యూనిట్‌కు రూ.10 లక్షలు సబ్సిడీగా నిర్ణయించిచామన్నారు.

07/19/2016 - 03:50

తిరుమల, జూలై 18: సర్వకోటి జీవరాశులకు ముఖ్యంగా మానవకోటి జీవనానికి రక్షణ కల్పిస్తున్న వృక్ష సంపదను పరిరక్షించుకోవాలని, ఇందులో మొలు నాటడం ప్రతి మనిషి జీవితంలో ఒక భాగం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ అన్నారు. శ్రీవారి దర్శనార్థం సోమవారం తిరుమలకు వచ్చిన ఆయన ముందుగా జిఎన్‌సి టోల్‌గేట్ వద్ద ఉన్న దివ్యారామం వద్ద ఉన్న నర్సరీని పరిశీలించారు.

07/19/2016 - 03:49

కాణిపాకం, జూలై 18 : చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలోనిత్య అన్నదాన సత్రం నుంచి కందిపప్పును తస్కరిస్తున్న నలుగురు ఆలయ ఉద్యోగులపై వేటు పడింది. ఈ మేరకు ఆలయ ఇ ఓ పూర్ణచంద్రరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనలో ఒకరు శాశ్వత ఉద్యోగిని సస్పెండ్ చేసి, మరో ముగ్గురు కాంట్రాక్టు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు.

07/19/2016 - 03:49

విశాఖపట్నం, జూలై 18: విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీ సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పలు కేసుల్లో నిందితునిగా ఉన్న రౌడీ షీటర్ రెడ్డి వెంకట శివ కిరణ్ అలియాస్ పొడుగు కిరణ్(32) ఆత్మహత్యకు పాల్పడినట్టు జైలు సూపరింటెండెంట్ ఇండ్ల శ్రీనివాస్ తెలిపారు. మృతుడు కిరణ్‌పై 7 క్రిమినల్ కేసులతో పాటు హత్యాయత్నం కేసు నమోదైంది.

07/19/2016 - 03:48

విశాఖపట్నం, జూలై 19: ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం నిర్వహిస్తున్న 44 కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజిసి) ఏర్పాటు చేసిన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో(డిఇబి) అనుమతి లభించింది. ఈ విషయాన్ని ఎయు సెనేట్ హాల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆ వర్సిటీ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు, దూర విద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య ఎల్.డి. సుధాకర బాబు తెలిపారు.

Pages