S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/18/2016 - 18:28

ఏలూరు : రాజధాని నిర్మాణం విషయంలో సింగపూర్ ప్రైవేటు కంపెనీతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడమేంటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ పద్ధతిని కేంద్రప్రభుత్వం, సుప్రీంకోర్టు తప్పుపట్టినా అదే విధానాలను అనుసరించడం దారుణమన్నారు.

07/18/2016 - 18:09

విజయవాడ: ఈ నెలాఖరున ఎపి డిజిపి జెవి రాముడు పదవీ విరమణ చేస్తున్నందున ఆయనను మరో రెండు నెలలు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. కృష్ణా పుష్కరాలు ముగిశాక ఆయన స్థానంలో మరో అధికారిని నియమిస్తారని సమాచారం. ఆర్టీసీ ఎండి నండూరి సాంబశివరావు డిజిపి రేసులో ఉన్నారని అంటున్నారు. సిఎం చంద్రబాబు కూడా నండూరి పట్ల మొగ్గు చూపుతున్నారని తెలిసింది.

07/18/2016 - 18:08

గుంటూరు: రేపల్లెలో జాస్మిన్ అనే యువతిపై అత్యాచారం చేసి, హత్య చేశారన్న ఆరోపణలపై ఇద్దరు యువకులను చితకబాదిన నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. గ్రామస్థుల దాడిలో గాయపడిన సాయి అనే యువకుడు మరణించాడు. జాస్మిన్ ఉరివేసుకుని మరణించడాన్ని చూసిన సాయి, పవన్ అనే యువకులు గట్టిగా కేకలు వేశారు. ఈ ఇద్దరే జాస్మాన్‌ను చంపారని అనుమానించిన గ్రామస్థులు వారిని నడివీధిలో చితకబాదారు.

07/18/2016 - 18:07

తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి రూపొందించిన తాజా చట్టం ప్రకారం నిందితులకు పదేళ్ల జైలు శిక్ష ఖాయమని, బెయిలు సైతం రాదని ఎపి డిజిపి జెవి రాముడు తెలిపారు. ఆయన సోమవారం ఇక్కడ పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిపిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ప్రముఖ స్మగ్లర్లను అరెస్టు చేసి ఎర్రచందనం అక్రమరవాణాకు అడ్డుకట్ట వేశామన్నారు.

07/18/2016 - 12:02

కర్నూలు: కృష్ణానది పుష్కరాల కోసం చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయకుంటే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టి కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఆయన సోమవారం ఉదయం శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జునస్వామిని సందర్శించిన అనంతరం పుష్కరాల పనులను పరిశీలించారు. ఈ పనుల్లో నాణ్యత లోపించినా, జాప్యం జరిగినా అందుకు అధికారులు కూడా బాధ్యులేనన్నారు.

07/18/2016 - 12:01

తిరుపతి: రాష్ట్రంలో శాంతిభద్రతలు వర్ధిల్లుతూ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని దైవాన్ని కోరుకున్నట్లు ఎపి డిజిపా జెవి రాముడు తెలిపారు. ఆయన సోమవారం ఉదయం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని సందర్శించుకుని పూజలు చేశారు. ఇక్కడి పాపవినాశనం వద్ద ఆక్టోపస్ విభాగం బేస్‌క్యాంప్ నిర్మాణాలకు ఆయన భూమిపూజ చేశారు.

07/18/2016 - 12:01

కడప: జమ్మలమడుగు మండలం ఎస్.ఉప్పలపాడు వద్ద సోమవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న ఆటో, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మరణించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించారు.

07/18/2016 - 08:02

జగ్గంపేట, జూలై 17: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఆదివారం ఆగి ఉన్న తాటి దుంగల లోడు ట్రాక్టర్ ట్రక్కును మోటారుసైకిల్ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి.

07/18/2016 - 08:00

కాకినాడ, జూలై 17: వినియోగదారుడి కళ్ళు బైర్లుకమ్మే రీతిలో మార్కెట్‌లో పప్పుల ధరలు ఆకాశన్నంటాయి. రెండేళ్లలో పప్పుల ధరలు మూడు, నాలుగు రెట్లు పెరిగాయి. కేవలం రెండు నెలల వ్యవధిలో ఊహించని ధరకు పప్పు ధాన్యాలు చేరాయి. అమాంతం పెరిగిన ధరలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. పప్పు దినుసులతోపాటు నిత్యావసరాలైన చక్కెర, ఎండుమిర్చి, వెల్లుల్లి, మసాలా దినుసులకు రెక్కలొచ్చాయి.

07/18/2016 - 07:58

నర్సీపట్నం, జూలై 17: బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడుతుందని, దీనిలో భాగంగానే వచ్చే నెల ఆరో తేదీన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విశాఖ ఏజన్సీలో పాదయాత్ర చేస్తారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి వెల్లడించారు.

Pages