S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/12/2016 - 05:56

కడప, ఏప్రిల్ 11: కడప జిల్లా బద్వేలు సబ్ రిజిస్ట్రార్, ఇతర సిబ్బంది సోమవారం ఎసిబి వలలో చిక్కారు. ఏసిబి డిఎస్పీ నాగరాజు నేతృత్వంలో బద్వేలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై మెరుపుదాడి నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్, సిబ్బందిని లంచం సొమ్ముతో అదుపులో తీసుకున్నారు. లెక్కలు లేకుండా సుమారు రూ.50వేలు నిల్వవుండగా, స్వాధీనం చేసుకుని వారిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.

04/12/2016 - 05:56

విజయవాడ, ఏప్రిల్ 11: నూతన విద్యా సంవత్సరం ఆరంభం నాటికి హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ శాఖలన్నింటినీ రాజధాని అమరావతి ప్రాంతానికి తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈలోపుగానే తాత్కాలిక సచివాలయం నిర్మాణం కూడా పూర్తికానుంది. ప్రస్తుతానికి మరికొన్ని కార్యాలయాలను విజయవాడ, గుంటూరులో ఏర్పాటు చేయబోతున్నారు.

04/11/2016 - 16:28

విశాఖ: స్పోర్ట్సు కాంప్లెక్స్ నిర్మాణంపై కథలు ఎందుకు చెబుతారంటూ ఎపి సిఎం చంద్రబాబు ఈరోజు ఇక్కడ విశాఖ స్టీల్‌ప్లాంట్ సిఎండి మధుసూదనరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిలోగా అరకులో స్పోర్ట్సు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తికావాలన్నారు. విశాఖ జిల్లాలో అభివృద్ధి పథకాల అమలుతీరుపై అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

04/11/2016 - 16:26

ఒంగోలు: ఒంగోలు-తెనాలి ప్యాసింజర్ రైలు ఇంజన్‌లో సోమవారం మంటలు వ్యాపించడంతో చినగంజాం వద్ద నిలిపివేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదం కారణంగా సుమారు గంటసేపు ప్యాసింజర్‌ను నిలిపివేశారు.

04/11/2016 - 16:25

విజయవాడ: ఈ ఏడాది కృష్ణానది పుష్కరాలకు అదనపు బస్సులతో పాటు మరిన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని ఎపిఎస్ ఆర్టీసీ ఎండి సాంబశివరావు తెలిపారు. ఆయన ఇక్కడి జవహర్‌లాల్ నెహ్రూ బస్ స్టేషన్‌లో సోమవారం ఉదయం జ్యోతిరావు పూలే జయంతి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చేస్తున్న సేవలను వివరించారు. పుష్కరాల సందర్భంగా నగర శివార్లలో ప్రత్యేకంగా ఒక బస్టాండ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

04/11/2016 - 16:23

కడప: సిద్ధవటం మండలం బాకరాపేట వద్ద సోమవారం వేగంగా వెళుతున్న కారు రోడ్డుపక్కన చెట్టును ఢీకొనడంతో గుంటూరు జిల్లాకు చెందిన చర్చి ఫాదర్ అక్కడికక్కడే మరణించారు.

04/11/2016 - 16:23

విశాఖ: విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద ఆదివారం కారు ప్రమాదంలో 11 మంది మరణించడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేస్తున్నట్లు ఎపి సిఎం చంద్రబాబు సోమవారం ఇక్కడ ప్రకటించారు. బుచ్చిరాజుపాలెంలో మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

04/11/2016 - 14:13

కడప: గోపవరం మండలం పీపీకుంట వద్ద సోమవారం ఉదయం నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేసి, సుమారు కోటి రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీరు వినియోగిస్తున్న నాలుగు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కడప ఎస్పీ నవీన్ గులాటీ తెలిపారు.

04/11/2016 - 12:56

విశాఖ: బడుగువర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన జ్యోతిరావు పూలే ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. విశాఖ ఎయులో సోమవారం ఉదయం పూలే 190వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. పూలే విధానాలను అనుసరించి అలనాడు టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బడుగువర్గాల కోసం పలు సంక్షేమ పథకాలను ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు.

04/11/2016 - 12:55

అనంతపురం: గుంతకల్లు పట్టణంలో సోమవారం ఉదయం ఓ వివాహితపై అత్యాచార యత్నానికి పాల్పడిన యువకుడిని స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

Pages