S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/12/2016 - 06:57

పోలవరం, ఏప్రిల్ 11: పోలవరం ప్రాజెక్టు కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపునకు గురవుతున్న గ్రామాల్లో జాతీయ మానవ హక్కుల సంఘం బృందం సోమవారం పర్యటించింది.

04/12/2016 - 06:40

కడప, ఏప్రిల్ 11: నేపాల్‌కు చెందిన స్మగ్లర్లతో సంబంధాలు కలిగి యథేచ్ఛగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని సోమవారం కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 169 దుంగలు, నాలుగు వాహనాలు, ఆరుసెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠి తెలిపారు.

04/12/2016 - 06:39

హైదరాబాద్, ఏప్రిల్ 11: జగన్ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?, వారసత్వంగా వచ్చిన వ్యక్తికాదా? ఆయన ఏం సేవ చేసి వచ్చాడు? వాళ్ల నాన్న పేరు చెప్పుకునే కదా ఓట్లు అడుగుతున్నారు అని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణనాయుడు ప్రశ్నించారు. సోమవారం ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో మాట్లాడుతూ, లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వడం టిడిపి అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు.

04/12/2016 - 06:35

సీలేరు, ఏప్రిల్ 11: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని కళాపొదర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను 104 బిఎస్‌ఎఫ్ బెటాలియన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఈ డంప్‌లో భారీ ఆయుధ సామగ్రి లభించింది. మల్కాన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో కళాపొదర్ అటవీప్రాంతానికి బిఎస్‌ఎఫ్ బలగాలు కూబింగ్ చేస్తూ ఆదివారం సాయంత్రం వెళ్ళారు.

04/12/2016 - 06:34

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 11: విశాఖపట్నం నుంచి విరామం లేకుండా రాజమహేంద్రవరం వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇపిఎఫ్ సబ్‌రీజినల్ కార్యాలయ శంకుస్థాపనకు సోమవారం రాత్రి రాజమహేంద్రవరం వచ్చిన ఆయన కార్యక్రమం అనంతరం సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఇంటికి వెళ్లారు.

04/12/2016 - 06:33

హైదరాబాద్, ఏప్రిల్ 11: మారిషస్ బ్యాంకు ఫిర్యాదు మేరకు నాంపల్లి 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను రద్దు చేయాలని కేంద్రమంత్రి సుజనా చౌదరి సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.

04/12/2016 - 06:33

హైదరాబాద్, ఏప్రిల్ 11: రాష్ట్రంలో సాగునీటి సంఘాలు, పంపిణీ, ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేదీ వెల్లడించేందుకు వారం గడువు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును కోరింది. వైకాపా ఎమ్మెల్యే కోన రఘుపతి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి.బోసేల్, జస్టిస్ పి.నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణకు స్వీకరించింది.

04/12/2016 - 06:32

విజయవాడ, ఏప్రిల్ 11: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) రద్దు తీర్పును సుప్రీం కోర్టు ఉపసంహరించుకోవటంపై సర్వత్రా హర్షం వ్యక్తవౌతోంది. దీనిపై విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రతినిధులు మాట్లాడుతూ 2013లో దీన్ని రద్దు చేయడం వల్ల మెరిట్ విద్యార్థులకు ఇప్పటి వరకూ అన్యాయం జరిగిందన్నారు. సామాన్యులెవ్వరూ వైద్య విద్యను అభ్యసించలేకపోయారని పేర్కొన్నారు.

04/12/2016 - 06:24

విశాఖపట్నం, ఏప్రిల్ 11: అంతర్జాతీయస్థాయి హెల్త్‌సిటీగా విశాఖను తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఒక్క రోజు పర్యటన నిమిత్తం సోమవారం విశాఖపట్నం వచ్చిన ఆయన కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 300 పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్(విమ్స్)లో ఔట్‌పేషెంట్ విభాగాన్ని ప్రారంభించారు.

04/12/2016 - 06:30

కాకినాడ, ఏప్రిల్ 11: అర్చకత్వం అనేది మతపరమైన బానిసత్వంలా మారిందని, అర్చకుల సంక్షేమం కోసం పట్టించుకునే నాథుడే కరవయ్యాడని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ఆవేదన వ్యక్తంచేశారు. వ్రత పురోహితులకు కనీసం రూ.5000 జీతం చెల్లించేలా దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు.

Pages