S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/04/2016 - 15:07

మచిలీపట్నం: ఇక్కడి నిజాంపేటలో దివంగత కాపు నాయకుడు వంగవీటి రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తిలేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని అణచివేస్తామని ఎపి హోం మంత్రి ఎన్.చినరాజప్ప అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ రంగా విగ్రహం విధ్వంసానికి గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. దోషులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన పోలీసులను ఆదేశించారు.

04/04/2016 - 15:04

ఏలూరు: ఏలూరు పట్టణంలో సోమవారం ఉదయం గాంధీ హైస్కూల్ వద్ద ఓ దుకాణంలో కూర్చున రాయలు అనే న్యాయవాదిని గుర్తుతెలియని దుండగులు హత్యచేశారు. పట్టపగలే కత్తులతో దారుణంగా పొడిచి లాయర్‌ను హత్యచేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

04/04/2016 - 15:04

విజయవాడ: భారతమాతను గౌరవిస్తూ అన్ని జిల్లాల్లోనూ ర్యాలీలు జరపాలని ప్రజలకు బిజెపి పిలుపునిచ్చింది. విజయవాడలో ఎపి బిజెపి అధ్యక్షుడు, ఎంపి హరిబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6న పార్టీ వ్యవస్థాపక దినం, 14,15 తేదీల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించాలని కార్యకర్తలను ఆదేశించారు.

04/04/2016 - 15:03

విజయవాడ: గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టిడిపి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ ఒకరోజు నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. అధికారంలోకి వస్తే ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు కానందన యువత తీవ్ర నిరాశలో మునిగిపోయిందని కాంగ్రెస్ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు అన్నారు.

04/04/2016 - 12:34

విజయవాడ: దివంగత కాపు నాయకుడు వంగవీటి రంగా విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితి చేయిదాటిపోకుండా వ్యవహరించాలని ఎపి సిఎం చంద్రబాబు ఆదేశించడంతో రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప మచిలీపట్నం చేరుకున్నారు. విజయనగరం జిల్లా పర్యటనను రద్దు చేసుకుని ఆయన బందరులో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.

04/04/2016 - 07:35

అనంతపురం, ఏప్రిల్ 3: అనంతపురం జిల్లాలోఉచిత ఇసుక విధానం బడా బాబులకు కాసుల వర్షం కురిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా అధికార పార్టీ ముఖ్య నేతలు, వారి అనుయాయులు, ద్వితీయ శ్రేణి నాయకులు, బిల్డర్లు, నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టర్లు ఉచిత ఇసుక విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వీరందరూ దొరికినకాడికి ఇసుకను తవ్వుకుంటూ దాచుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఉచిత ఇసుకను పోగేసుకుని నిల్వ చేసుకుంటున్నారు.

04/04/2016 - 07:35

విజయవాడ, ఏప్రిల్ 3: రాష్ట్రంలోని 80 లక్షల మంది డ్వాక్రా మహిళల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మెప్మా డైరెక్టర్ చిన తాతయ్య ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ప్రాంతీయ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వారికి ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు.

04/04/2016 - 07:34

విజయనగరం, ఏప్రిల్ 3: ‘తెలంగాణలో ఉన్నది మా ప్రభుత్వమే, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, అక్కడి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మా పార్టీ వారే, పార్టీ పేరు మాత్రమే మారింది, కానీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీయే’.. ఇదీ తెలుగుదేశం పార్టీ ఎపి రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు అభిప్రాయం.

04/04/2016 - 07:33

గుంటూరు, ఏప్రిల్ 3: దేశంలోనే ఎక్కడాలేని విధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 225 కోట్ల రూపాయల పెట్టుబడితో మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు.

04/04/2016 - 07:31

నెల్లూరు, ఏప్రిల్ 3: మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో ఎమ్మెల్సీ సోమిరెడ్డికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Pages