S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/04/2016 - 07:24

విశాఖపట్నం, ఏప్రిల్ 3: భారత్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు విశాఖకు చెందిన ఆదినారాయణ. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎం.ఆదినారాయణ ఆరు ఖండాల్లోని 14 దేశాల్లో 35 వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం సాగించారు.

04/04/2016 - 07:23

విజయవాడ, ఏప్రిల్ 3: వచ్చే అసెంబ్లీ సమావేశాలు అమరావతిలోనే జరగనున్నాయని మున్సిపల్ మంత్రి నారాయణ తెలియచేశారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ సెక్రటేరియట్‌వద్ద అసెంబ్లీ కోసం నిర్మిస్తున్న ఆరో భవనంలో ఇంటీరియర్ ప్లాన్‌ను స్పీకర్, మండలి చైర్మన్ సహా ముఖ్యులంతా చూసి ఆమోదించారని చెప్పారు. ఈ భవన నిర్మాణాన్ని ఆగస్ట్ చివరినాటికి పూర్తి చేస్తామని ఆయన తెలియచేశారు.

04/04/2016 - 07:21

హైదరాబాద్, ఏప్రిల్ 3: రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.13,787 కోట్లను భర్తీ చేస్తామని ఊరించి నిరాశపరిచిన కేంద్రం గత ఆర్ధిక సంవత్సరం చివరి మూడు రోజుల్లో కేవలం రూ. 3272 కోట్లు ఇచ్చింది.

04/04/2016 - 05:24

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 3: రాజమహేంద్రవరం ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టిడిపిలో చేరనున్నట్లు తెలిసింది. ఆయన వెంట కొంతమంది మాజీ కార్పొరేటర్లు, ప్రస్తుత కార్పొరేటర్లు కూడా పార్టీ మారనున్నారు. శనివారం వైసిపికి చెందిన ఒక నాయకుడి కుమార్తె పెళ్లి వేడుకల్లో ఆదిరెడ్డి పార్టీ మారే విషయం చర్చకు రాగా ఆదిరెడ్డి ఖండించకపోవడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది.

04/04/2016 - 05:17

విజయవాడ, ఏప్రిల్ 3: కాల్ మనీ.. గత ఏడాది డిసెంబర్‌లో రాష్ట్రాన్ని కుదిపేసిన అంశం. అవసరార్థం డబ్బు అప్పు తీసుకుంటే, అధిక వడ్డీలు బనాయించడం, బలవంతంగా ఆస్తులు రాయించుకోవడం, మహిళలను లైంగికంగా వేధించడం.. ఇవీ కాల్ మనీ వ్యాపారుల దురాగతాలు. విజయవాడలో వెలుగుచూసిన ఈ దారుణాలు రాష్టవ్య్రాప్తంగా సంచలనమయ్యాయి.

04/04/2016 - 05:14

విజయవాడ, ఏప్రిల్ 3: భూముల డబుల్ రిజిస్ట్రేషన్లను నిరోధించడానికి రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22(బి)ని సవరించడానికి విధాన మండలి ఆమోదం తీసుకోవలసిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆదివారం ఆయన నివాసంలో భేటీ అయ్యారు. చట్ట సవరణకు కౌన్సిల్ ఆమోదం లభించాలంటే ఆగస్ట్ వరకూ వేచి చూడాలని, ఈలోగా ఆర్డినెన్స్ ఇవ్వవచ్చని కేఇ ప్రతిపాదించారు.

04/04/2016 - 05:12

విజయవాడ, ఏప్రిల్ 3: అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకోడానికి ఆయన అష్టకష్టాలు పడుతున్నారు. విభజన తరువాత కేంద్రం ఆదుకుంటుంది అని అనుకున్నారు. కేంద్రంతో ఎంత సన్నిహితంగా మెలగాలనుకున్నా, అనేక అంశాలు బాబు, మోదీల మధ్య అగాధాన్ని పెంచేస్తున్నాయి. దీంతో రాష్ట్రం లోటు బడ్జెట్‌లో కూరుకుపోయింది.

04/04/2016 - 05:08

మచిలీపట్నం, ఏప్రిల్ 3: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆదివారం గుర్తుతెలియని దుండగులు కాపు సామాజికవర్గం నేత, దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తెల్లవారుజామున 3గంటల సమయంలో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. రంగా విగ్రహాన్ని ధ్వంసం చేశారనే విషయం తెలుసుకున్న కాపు సామాజికవర్గానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకు దిగారు.

04/03/2016 - 11:27

విజయవాడ, ఏప్రిల్ 2: విద్యుత్ పొదుపుతో రూ.200 కోట్లు మేర ఆదా చేయగలిగినట్టు విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ వైస్ చైర్మన్ అజయ్‌జైన్ తెలిపారు. తొలిదశలో ఇప్పటికే ఇంటికి రెండు చొప్పున ఒక కోటీ 85 లక్షలమేర ఎల్‌ఇడి బల్బులను గృహావసరాలకు పంపిణీ చేయడం జరిగిందని, రెండో దశలో మున్సిపల్ వీధి దీపాలను ఎల్‌ఇడిలతో మార్పు చేస్తున్నామన్నారు. పంచాయతీల్లో కూడా ఈ ప్రక్రియ ఆరంభం కానున్నదన్నారు.

04/03/2016 - 11:26

విజయవాడ, ఏప్రిల్ 2: రాష్ట్రంలో పశుసంపద సంరక్షణే తమ ప్రభుత్వ ధ్యేయమని ఇందుకు పశువుల పెంపకందారులకు ప్రయోజనం చేకూర్చే అనేకానేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ పశు సంవర్థకశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

Pages