S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/06/2016 - 08:21

విశాఖపట్నం, ఏప్రిల్ 5: అనేక ఒడుదుడుకులతో నెట్టికొస్తోన్న ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) విద్యుత్ పంపిణీ నష్టాలను గణనీయంగా తగ్గించగలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మండలి నుంచి ఈపిడిసిఎల్‌గా ఏర్పడినప్పటి నుంచి అధిక శాతం ఉండే విద్యుత్ పంపిణీ నష్టాలను క్రమేపీ తగ్గించుకుంటూ వస్తోంది. సబ్‌స్టేషన్ల దూరాన్నిబట్టి విద్యుత్ నష్టాలు పెరుగుతుంటాయి.

04/06/2016 - 08:15

బ్రహ్మంగారిమఠం, ఏప్రిల్ 5: మహా యోగి అచలానంద స్వామి సోమవారం రాత్రి ఒంగోలులోని తన ఆశ్రమంలో పరమపదించారు. రాత్రికి రాత్రే ఆయన పార్థివ దేహాన్ని కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం తోట్లపల్లెలోని ఆయన ఆశ్రమానికి తరలించారు. ప్రకాశంజిల్లా నాగులుప్పలపాడు మండలం వమ్మేవరం గ్రామానికి చెందిన నెల్లూరు పుల్లయ్యశర్మ, వెంకటసుబ్బమ్మ దంపతులకు అచలానంద స్వామి జన్మించారు.

04/06/2016 - 05:08

విజయవాడ, ఏప్రిల్ 5: రాష్ట్రంలో తెలుగుదేశం, బిజెపిల మధ్య స్నేహానికి త్వరలోనే తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. టిడిపితో కలిసి ఉంటూ అవమానాలు భరించేకన్నా, విడిపోయి, సొంతంగా ఎదగాలని బిజెపి భావిస్తోంది. మరో నాలుగైదు నెలల్లో రాష్ట్రంలోని 11 నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. కలిసి ఉన్నా సుఖం లేదని భావిస్తున్న బిజెపి...టిడిపితో తెగతెంపులకు సిద్ధపడుతుందా?

04/06/2016 - 04:56

విజయవాడ, ఏప్రిల్ 5: పర్యావరణ అనుమతులు లేకుండా రాష్ట్రంలోని ఏ రీచ్‌లోనూ ఇసుక తవ్వకాలు జరపరాదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పర్యావరణ అనుమతులను ఆయా జిల్లా కలెక్టర్లే జారీ చేసే విధంగా ఆదేశాల్లో పేర్కొంది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.

04/06/2016 - 04:52

విజయవాడ, ఏప్రిల్ 5: పేదలు, బడుగు బలహీనవర్గాలకు తనతో కలిసి రావాలని, వారికి తాను అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. బాబూ జగ్జీవన్‌రామ్ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలు మంగళవారం విజయవాడలో జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పేదలు, బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేసేది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు.

04/06/2016 - 04:46

విజయవాడ, ఏప్రిల్ 5: ప్రతిపక్ష వైకాపా నుంచి మరో ఎమ్మెల్యే అధికార పార్టీలోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. మంచి మూహూర్తం చూసుకుని పార్టీలో చేరుతానని ముఖ్యమంత్రికి సునీల్ చెప్పినట్టు తెలిసింది. బహుశా ఉగాది రోజున ఆయన టిడిపిలో చేరే అవకాశం ఉంది.

04/06/2016 - 04:40

విజయవాడ, ఏప్రిల్ 5: నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిలో తాత్కాలిక సచివాలయం ప్రారంభం కూడా కాకముందే మావోయిస్టుల కదలికలు చోటుచేసుకుంటున్నాయి. ఇది పోలీసు వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.

04/05/2016 - 17:30

విశాఖ: ఉద్యోగాలిప్పిస్తానని పలువురు యువకులను మోసగించిన కేసులో చంద్రశేఖర్ అనే నిందితుడిని విశాఖ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇతని నుంచి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని వివరాలు రాబడుతున్నారు.

04/05/2016 - 17:29

గుంటూరు: గుంటూరు జిల్లా కొరిటెపాడు ఆంధ్రాబ్యాంకు శాఖ వద్ద సోమవారం ఓ మహిళ దృష్టి మరల్చి 53 వేల రూపాయలను దొంగలు తస్కరించారు. బ్యాంకు నుంచి నగదు విత్ డ్రా చేసుకుని ఆమె బయటకు రాగా దొంగలు ఈపనికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

04/05/2016 - 17:27

కడప: ఓ ప్రముఖ నిర్మాణ సంస్థలో కేటరింగ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తామని హోటల్ యజమానిని వంచించిన కేసులో అంత్రర్రాష్ట ముఠాకు చెందిన నలుగురిని కడప పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు సందీప్‌సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టు చేసిన నలుగురి నుంచి 15 లక్షల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు.

Pages