S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/20/2016 - 13:56

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఆదివారం ఉదయం వృద్ధ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో భర్త వెంటనే మరణించగా, భార్య పరిస్థితి విషమంగా ఉన్నందున ఆమెను ఆస్పత్రికి తరలించారు. దంపతుల ఆత్మహత్యాయత్నానికి కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు.

03/20/2016 - 13:55

విశాఖ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మే నెలలో విశాఖ ఏజెన్సీలో పాదయాత్ర జరుపుతారని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆదివారం ఇక్కడ తెలిపారు. బాక్సైట్ తవ్వకాలపై ఆందోళన చేస్తున్న గిరిజనులకు బాసటగా నిలిచేందుకే రాహుల్ విశాఖ ఏజెన్సీకి వస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలపై జీవోను రద్దు చేసేవరకూ తమ పార్టీ పోరాటం చేస్తుందని రఘువీరా ప్రకటించారు.

03/20/2016 - 13:54

విజయవాడ: వచ్చే ఏడాది చివరినాటికి పోలవరం సాగునీటి ప్రాజెక్టు తొలి దశ నిర్మాణం పూర్తవుతుందని ఎపి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. ఆయన ఆదివారం ఇక్కడి ప్రకాశం బ్యారేజీ యాప్రాన్ ఆధునీకరణ పనుల తీరును పరిశీలించిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ, పోలవరాన్ని పూర్తి చేసిన నేతగా సిఎం చంద్రబాబు పేరు చరిత్రలో చిరస్థాయిగా ఉంటుందన్నారు.

03/20/2016 - 07:23

హైదరాబాద్: శాసనసభనుంచి రోజాను సంవత్సరంపాటు సస్పెండ్ చేయడం, ఆ వ్యవహారం కోర్టుకెక్కడంవంటి పరిణామాలపై అధికార ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఆత్మ పరిశీలనలో పడ్డారు.

03/20/2016 - 07:22

గుంటూరు (కల్చరల్): సంఘంలో నానాటికీ తరగిపోతున్న ఉత్తమ మానవీయ విలువల పునరుద్ధరణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిర ప్రాంగణంలో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ స్ఫూర్తి అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించారు.

03/20/2016 - 07:21

హైదరాబాద్, మార్చి 19: న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై సభలో చర్చిస్తామని చెప్పడం సరికాదని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రోజాను అసెంబ్లీ హాలులోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ ట్యాంకు బండ్ చౌరాస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన వైకాపా నేతలు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

03/20/2016 - 07:17

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పిల్లలకు వారి సామర్థ్యానికి మించి పుస్తకాలను పాఠ్యాంశాలుగా చేర్చలేదని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శాసనమండలిలో శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో టిడిపి సభ్యుడు ఎంవివిఎస్ మూర్తి తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, ఒకటి, రెండు తరగతులకు మూడు పాఠ్యపుస్తకాలు, మూడు, నాలుగు, ఐదు తరగతులకు నాలుగు పుస్తకాలు ఉన్నాయన్నారు.

03/20/2016 - 07:14

తిరుపతి: రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 10 నెలల వ్యవధిలో 10,593 మంది పేద బ్రాహ్మణులకు,వారి పిల్లలకు ఏపి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రూ.50 కోట్లను వివిధ పథకాల కింద అందజేశామని కార్పొరేషన్ ఎండి చెంగవల్లి వెంకట్ వెల్లడించారు.

03/20/2016 - 03:22

విజయనగరం, మార్చి 19: ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలని ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ స్వామీజీ పేర్కొన్నారు. విజయనగరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం రామతీర్థం అభివృద్ధికి ప్రభుత్వం 1.70 కోట్ల రూపాయలను ప్రకటించిందని, కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

03/20/2016 - 03:18

రాజమహేంద్రవరం, మార్చి 19: గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు ప్రారంభించి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఇంత వరకు కేవలం 40శాతం పనులు మాత్రమే జరగటంతో పనులు ప్రారంభంకాని ప్యాకేజీల టెండర్లను రద్దుచేయాలని జలవనరులశాఖ సిఫార్సు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Pages