S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/18/2015 - 07:52

పరారీలో ప్రధాన నిందితుడు రామకృష్ణ చెక్కులు, ప్రామిసరీ నోట్లు లభ్యం ఓ లాయర్‌కూ ప్రమేయం

12/17/2015 - 13:11

చిత్తూరు: చిత్తూరు నగరంలోని 36వ డివిజన్ కార్పొరేటర్ శివప్రసాద్ రెడ్డి (46) గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. చిత్తూరు మేయర్ కఠారి అనూరాధ, కఠారి మోహన్ దంపతుల హత్య కేసులో అనవసరంగా తనను ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని భావించిన శివ ప్రసాద్ రెడ్డి మనోవేదనకు గురై ఇంటికి వస్తూనే గదిలో ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

12/17/2015 - 11:33

తిరుమల: ధనుర్మాసం ప్రారంభమైన సందర్భంగా గురువారం ఉదయం వేంకటేశ్వర స్వామివారికి సుప్రభాత సేవలకు బదులుగా అర్చకులు ధనుర్మాస పాశురాలను నివేదిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ధనుర్మాస పారాయణం నెల రోజులపాటు జరుగుతుంది. శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు.

12/17/2015 - 11:32

విజయవాడ: విజయవాడలో కాల్‌మనీ వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో గురువారం మూడో రోజు కూడా రాష్టవ్య్రాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడులు చేస్తున్నారు. మదనపల్లిలో ఐదుగురిని, చీరాలలో ఒకరిని అరెస్టు చేశారు. భారీఎత్తున ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

12/17/2015 - 11:32

చిత్తూరు: ఇక్కడి ధర్మరాజుల వీధిలో గురువారం ఉదయం ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలి ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.

12/17/2015 - 11:31

విశాఖ: ఓ కేసులో తనను పట్టుకొనేందుకు వచ్చిన పోలీసులను చూసి భయపడిన ఓ వ్యక్తి నాలుగో అంతస్తు నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎం.వి.పి. కాలనీ సెక్టర్ 4లో గురువారం ఈ ఘటన జరిగింది. మృతుడు హైదరాబాద్ మలక్‌పేట నివాసి అనీ, ఓ కేసు సందర్భంగా అతణ్ణి పోలీసులు ప్రశ్నించేందుకు వచ్చారని తెలిసింది.

12/17/2015 - 11:31

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఉలవపాడు అంబేద్కర్ నగర్‌లో రిటైర్డ్ ఉద్యోగి నారయ్య ఇంట్లో బుధవారం రాత్రి దొంగలు పడి ఇరవై సవర్ల బంగారాన్ని దోచుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

12/17/2015 - 11:30

విజయవాడ: క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు నిత్యావసర సరకులను ఉచితంగా అందజేసేందుకు చంద్రన్న పేరిట ఎ.పి. ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేసేందుకు సిద్ధం చేసింది. గిఫ్ట్ ప్యాక్‌లో కిలో గోధుమపిండి, అరకిలో కందిపప్పు, వంద గ్రాముల నెయ్యి, శనగపప్పు, బెల్లం, పామాయిల్ వంటివి ఉంటాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో క్రిస్మస్ సందర్భంగా వీటిని పంపిణీ చేస్తారు.

12/17/2015 - 11:30

విజయనగరం: గజపతినగరంలో గురువారం ఉదయం వౌనిక అనే విద్యార్థిని పాఠశాలకు వెళ్తుండగా రోడ్డుపై దొరికిన 8వేల రూపాయల నగదును పోలీసులకు అందజేసింది. ఆమె నిజాయితీని పోలీసులు ప్రశంసించారు. ఈ నగదును పి.ఎస్.ఆర్.పురం గ్రామానికి చెందిన అప్పారావు అనే వ్యక్తి పోగొట్టుకున్నట్టు పోలీసులు గుర్తింపు నగదును అతడికే అందజేశారు.

12/17/2015 - 11:29

గుంటూరు: పట్టణంలో గురువారం ఉదయం కళాశాలకు వెళ్తున్న ఓ విద్యార్థినిపై ఓ యువకుడు సుత్తితో బలంగా కొట్టి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన ఆ యువకుడి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

Pages