S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/14/2015 - 11:53

విజయవాడ: సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించి అన్ని వర్గాల వారు అభివృద్ధి ఫలాలు అందుకునేలా కృషి చేయాలని ఎ.పి. సి.ఎం. చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. సోమవారం ఇక్కడ కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులను నిర్ణీత వ్యవధిలో సద్వినియోగం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

12/14/2015 - 11:51

చిత్తూరు: చంద్రగిరి మండలం చామల అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి సుమారు కోటి రూపాయలు విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల జాడ తెలుసుకొని స్మగ్లర్లు పరారయ్యారు. వారిని పట్టుకొనేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

12/14/2015 - 11:50

విశాఖ: విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎక్సైజ్ పోలీసులు సోమవారం తనిఖీలు నిర్వహించి రూ.2 కోట్ల విలువచేసే 1600 కిలోల గంజాయిని, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని అక్రమంగా తరలిస్తున్న చింతపల్లికి చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు.

12/14/2015 - 11:49

చిత్తూరు: ఆర్థిక లావాదేవీలు, భూ తగాదాలే చిత్తూరు మేయర్ దంపతుల హత్యకు కారణమని విచారణలో తేలినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ సోమవారం చెప్పారు. ఈ జంట హత్యల కేసులో 23 మందిపై కేసులు నమోదు చేసి ఆరు తుపాకులు, ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నామని, కేసు విచారణ తొంభై శాతం వరకూ పూర్తయిందని చెప్పారు.

12/14/2015 - 11:48

శ్రీకాకుళం: పట్టణంలోని మధురానగర్‌లో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ బాలనాయక్ ఇంట్లో ఏసిబి అధికారులు సోమవారం ఉదయం సోదాలు జరిపారు. విశాఖ, విజయనగరంలోనూ ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో తనిఖీలు జరుపుతున్నారు. పలు గ్రానైట్ కంపెనీలలో పెట్టుబడులకు సంబంధించి డాక్యుమెంట్లను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు కనుగొనడంతో బాలనాయక్‌పై కేసు నమోదు చేశారు.

12/12/2015 - 16:43

చింతపూడి : ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కరిస్తామని రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా చింతపూడి మార్కెట్‌ యార్డులో నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తల శిక్షణ తరగతుల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. సమస్యలను సానుభూతితో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఏపీడీ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.

12/12/2015 - 16:42

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా యానాం శివారు దరియాలతిప్ప ఏటిగట్టు వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. గతరాత్రి ఇండికా కారు అదుపు తప్పి గోదావరి నదిలో పడిపోయింది.

12/12/2015 - 14:09

పామర్రు : కృష్ణాజిల్లా కొమరవోలులో జరిగిన జనచైతన్య యాత్రలో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటించారు. తొలుత గ్రామంలోని ఎన్టీఆర్‌ దపంతుల విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. డ్వాక్రా మహిళలకు గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

12/12/2015 - 14:01

తిరుమల: శ్రీవారి లక్ష్మీహారం వూరేగింపు కార్యక్రమం వైభవంగా సాగింది. ఏటా తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో గజవాహన సేవలో లక్ష్మీహారాన్ని అలంకరించడం ఆనవాయితీ. కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం పద్మావతి అమ్మవారికి జరిగే గజవాహన సేవలో హారాన్ని ఆలంకరించనున్నారు.

12/12/2015 - 13:58

తిరుచానూరు: శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం మోహినీ అవతారంలో తిరుమాడ వీధుల్లో వూరేగారు. అమ్మవారి పల్లకి వాహన సేవ నయనానందకరంగా సాగింది. సాయంత్రం 4 గంటలకు వసంతోత్సవం, రాత్రికి గజవాహన సేవ జరగనుంది. పల్లకి సేవలో తితిదే ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో పోలా భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Pages