S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/17/2015 - 11:29

హైదరాబాద్: కాల్‌మనీ పేరిట వడ్డీ వ్యాపారులు చేస్తున్న అరాచకాలపై తక్షణం చర్చించాలని ఎ.పి. అసెంబ్లీలో వైకాపా సభ్యులు పట్టుబట్టడంతో తీవ్ర గందరగోళం చెలరేగింది. గురువారం ఉదయం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయిన వెంటనే కాల్‌మనీ వ్యవహారంపై చర్చకు వైకాపా అధినేత, ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్ డిమాండ్ చేశారు.

12/16/2015 - 12:57

గుంటూరు: రాజుపాలెం మండలం అద్దంకి – నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై నెమలిపురి గ్రామం వద్ద బుధ‌వారం ఉద‌యం ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్నపిడుగురాళ్ల పట్టణానికి చెందిన సైదావలి(50), రాజావలి(48) మృతి చెందారు.

12/16/2015 - 12:48

విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసును వెలుగులోకి తీసుకొచ్చిన విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్.. తన దీర్ఘకాలిక సెలవును రద్దు చేసుకుని బుధవారం విధులకు హాజరయ్యారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పండగ సమయంలో కుటుంబ సభ్యులంతా ఆస్ట్రేలియాలో కలవాలని అనుకున్నాం.

12/16/2015 - 11:52

విజయవాడ: ఎ.పి. మంత్రివర్గ సమావేశం బుధవారం ఉదయం ఇక్కడ ప్రారంభమైంది. ఈ నెలలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాలపై వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చిస్తున్నారు. అమరావతి నిర్మాణం, ఇసుక వేలం విధానం, కాల్‌మనీ వ్యవహారం, ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి, తదితర అంశాలకు సంబంధించి మంత్రుల అభిప్రాయాలను ఆయన తెలుసుకుంటున్నారు

12/16/2015 - 11:51

తిరుమల: తిరుచానూర్ పద్మావతి అమ్మవారికి పంచమి తీర్థం సందర్భంగా బుధవారం ఉదయం టిటిడి అధికారులు శ్రీ వేంకటేశ్వరస్వామి తరఫున పసుపు, కుంకుమ సారె అందజేశారు. ఆ తర్వాత ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం, చక్రతీర్థం కార్యక్రమాలు నిర్వహించారు.

12/16/2015 - 11:51

చిత్తూరు: నగరి సమీపంలోని తుడుకుపేట వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులో ఎసిబి అధికారులు బుధవారం ఆకస్మిక సోదాలు జరిపి అక్కడి సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు కనుగొన్నారు. లెక్క తేలకుండా ఉన్న 10 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

12/16/2015 - 11:50

తిరుపతి: ఏజెన్సీ ప్రాంతాల్లో మత మార్పిడులను నివారించేందుకు ఆలయాలను నిర్మించాలని కోరినప్పటికీ టిటిడి యాజమాన్యం స్పందించలేదని విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి విమర్శించారు. ఆయన బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో టిటిడి ఆలయాలను నిర్మించటంతో ఆ సంస్థపై ఆర్థిక భారం పడుతోందన్నారు.

12/16/2015 - 11:49

విజయవాడ: విజయవాడలో కాల్‌మనీ అక్రమాలు వెలుగుచూసిన నేపథ్యంలో పోలీసులు ఎ.పి.లోని అన్ని జిల్లాల్లో వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో బుధవారం కూడా సోదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లు, బీమా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చిలకలూరిపేటలో ఇద్దరు, మార్కాపురంలో నలుగురు వడ్డీ వ్యాపారులను అరెస్టు చేశారు.

12/15/2015 - 16:35

విజయవాడ : ప్రభుత్వాసుపత్రులలో బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఈ-ఔషధి ద్వారా వ్యాధులను గుర్తించే అవకాశం ఉన్నందున దీనిని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రులలో వసతులను మెరుగుపరుస్తామని వెల్లడించారు.

12/15/2015 - 16:34

విజయవాడ : కాల్‌మనీ వ్యవహారంలో నిందితులుగా ఉన్నవారు ఎంతటి పెద్దవారైనా వదిలే ప్రసక్తిలేదని ఏపీ డీజీపీ రాముడు స్పష్టంచేశారు. ఆయన మంగళవారంనాడు విలేకరులతో మాట్లాడుతూ బాధితులపై బెదిరింపులకు పాల్పడుతున్నవారిని పీడీ యాక్ట్ చట్టం, వడ్డీ కోసం మహిళలను లోబర్చుకున్నవారిపై నిర్భయ చట్టం కింది కేసులు నమోదు చేస్తామని చెప్పారు.

Pages