S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/12/2015 - 13:49

గుంటూరు: పౌరుషానికి ప్రతీకగా నరసరావుపేట అని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నరసరావుపేట పురపాలక సంఘం శత వసంతాల వేడుకలో భాగంగా రెండోరోజు జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుతో కలిసి పట్టణంలో పర్యటించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాల ద్వారా స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు.

12/12/2015 - 13:28

విశాఖః ముఖ్యమంత్రి చంద్రబాబును పరుష పదజాలంతో దూషించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కేసు నమోదైంది. విశాఖ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ లో 124(ఎ) 307, 506, 511సెక్షన్ ల కింద కేసు నమోదు చేశామని చింతపల్లి సీఐ సీహెచ్ రుద్రశేఖర్ తెలిపారు.

12/12/2015 - 13:09

విజయవాడ: గేట్‌వే హోటల్‌లో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు.

12/11/2015 - 15:31

గుంటూరు: నరసరావుపేట మున్సిపాలిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఎ.పి సి.ఎం. చంద్రబాబు శుక్రవారం ఇక్కడికి వస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటైన పైలాన్‌ను ఆయన ఆవిష్కరిస్తారు. 11వేల మరుగుదొడ్లను ప్రారంభించి స్థానికులకు మాట్లాడుతారు. టిడిపి చేపట్టే జన్మ చైతన్య యాత్రలో కూడా ఆయన పాల్గొంటారు.

12/11/2015 - 15:30

విశాఖ: అరకులోయ మండలం గనె్నల అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి దాటాక పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోలు మరణించినట్లు చెబుతున్నప్పటికీ పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. మృతులు ఒరిస్సాడకి చెందినవారని తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుగుతుండగా మావోలు కాల్పులు ప్రారంభించడంతో పోలీసులు కూడా అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపారు.

12/11/2015 - 15:29

విజయవాడ: ఇక్కడి కృష్ణలంకలోని స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ శుక్రవారం ఉదయం పరామర్శించారు. మద్యంలో మిథనాల్ కలవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఆయన అన్నారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మరో 27 మంది కోలుకుంటున్నారని మంత్రి చెప్పారు.

12/11/2015 - 15:28

తిరుపతి: తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవ వేడుకగా జరిగింది. వేణుగోపాలస్వామి రూపంలో అమ్మవారు తిరుమాడ వీధుల్లో ఊరేగారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ రోజు రాత్రి హనుమంత వాహన సేవ జరుగుతుంది.

12/11/2015 - 15:24

చిత్తూరు : కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం టీడీపీ నేతల సమావేశంలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల వల్లే పార్టీలో అనేకమంది చేరుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్యకర్తలను ఆయన కండువా కప్పి ఆహ్వానించారు.

12/11/2015 - 15:23

ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబుపై పరుష వ్యాఖ్యలు చేసిన పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పీతల సుజాత తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ అందరికీ ఆమోదయోగ్యమైన ఇసుక విధానాన్ని అమలు చేస్తామని, దీనికోసం అందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు.

12/11/2015 - 15:22

విజయవాడ : గోదావరి డెల్టాలో రబీకి నీళ్లీవ్వాల్సి రావటంతో పట్టిసీమలోని అన్ని పంపులను మూసివేశారు. పట్టిసీమ నుంచి కృష్ణాడెల్టాకు రోజుకు 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Pages