S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/03/2019 - 04:22

అనంతపురం సిటీ, జనవరి 2: తెలుగుదేశం నేతలు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటున్నారని, వారి అవినీతి, అక్రమాలకు అడ్డులేకుండా పోయిందని నెహ్రూ యువ కేంద్ర జాతీయ ఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్థన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం అనంతపురం నగరంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఏ విభాగం చూసినా అవినీతి పెరిగిపోయిందన్నారు.

01/03/2019 - 04:21

విజయవాడ, జనవరి 2: విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్ పనులు ఇక వేగవంతం కానున్నాయి. ఇందులో భాగమైన సామర్లకోట - రాజానగరం రోడ్డు వెడల్పు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. రెండు లేన్ల రహదారిని నాలుగు లేన్ల రహదారిగా ఈ ప్రాజెక్టులో మారుస్తారు. 30 నెలల్లో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టుకు రూ. 300.28 కోట్లు ఖర్చవుతాయి.

01/03/2019 - 04:20

విజయవాడ, జనవరి 2: తనను నమ్ముకున్న 5 కోట్ల మంది ఆంధ్రులతోపాటు దేశ ప్రజలందరి గొంతుకగా మారి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశత్వ విధానాలపై తన ఆక్రోశాన్ని వెలిబుస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ అన్నారు.

01/03/2019 - 04:19

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 2: శ్రీ్భగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేయకపోవడం చారిత్రిక తప్పిదమేనని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ఆంధ్రరత్నభవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో భాగంగా జరిగిన హైకోర్టు విభజన ప్రక్రియలో అధికార వికేంద్రీకరణ సూత్రాన్ని విస్మరించడం శోచనీయమన్నారు.

01/03/2019 - 03:18

విజయవాడ, జనవరి 2: రాష్ట్రంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న జన్మభూమి-మా ఊరు కార్యక్రమంపై ప్రజా స్పందన తెలుసుకోవాలని ఆర్టీజీఎస్ సీఈవో బాబు అహ్మద్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో జన్మభూమి కార్యక్రమ ఏర్పాట్లపై బుధవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మభూమికి సంబంధించి ప్రజల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సేకరించాలన్నారు.

01/03/2019 - 03:16

విశాఖపట్నం, జనవరి 2: టీడీపీ ప్రభుత్వం బీసీలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించ లేదని, సంక్షేమ పథకాల మంజూరులోనూ విఫలమైందని వైసీపీ బీసీ అధ్యయన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. బీసీ కులాలు, వర్గాల్లోని సమస్యలను తెలుసుకునేందుకు విశాఖ వచ్చిన కమిటీ సభ్యుల బృందం బుధవారం బీసీ సంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది.

01/03/2019 - 03:16

విజయనగరం, జనవరి 2: రాష్ట్రంలో అభివృద్ధి కావాలో.. అరాచకం కావాలో ప్రజలే తేల్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. బుధవారం ఇక్కడ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేఖరులతో ఆయన మాట్లాడుతూ దేశంలో అవినీతి రహిత పాలన, అభివృద్ధి కొనసాగాలంటే ప్రధానిగా మోదీ అధికారంలోకి రావాలన్నారు.

01/03/2019 - 03:13

విజయవాడ, జనవరి 2: రాష్ట్రంలో 110 పురపాలక సంఘాల పరిధిలో 970 ప్రాంతాల్లో ఉచిత వైఫై సేవలు ఫిబ్రవరి 15 నాటికి అందుబాటులోకి రానున్నాయి. వెలగపూడి సచివాలయంలో ఏపీ డిజిటల్ ఇన్ఫా, ఏపీ ఫైబర్ నెట్ కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా బుధవారం సమీక్ష నిర్వహించారు.

01/03/2019 - 03:13

విజయవాడ, జనవరి 2: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 12 నుంచి 20 వరకు సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల క్యాలెండర్ ప్రకారం 8 నుండి సెలవులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ జన్మభూమి కార్యక్రమం దృష్ట్యా మార్పు చేశారు. ఈమేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

01/03/2019 - 03:20

అమరావతి: వద్దన్నా వచ్చిన విభజనతో అంతా అయోమయం. రాజధాని ఎక్కడంటే ఏం చెప్పాలో తెలీని పరిస్థితి. స్వరాష్ట్రంలో పరిపాలనకు సొంత భవనాల్లేవు. అధికార యంత్రాంగానికి సౌకర్యాల్లేవు. అన్నింటినీ మించి ఆర్థిక కష్టాలు. ఈ స్థితిలో సరిగ్గా నాలుగున్నరేళ్లు గడిచేసరికి ఆర్థిక వృద్ధిరేటు ఎలా ఉంటుందన్న ఆందోళన మాయమై.. దేశంలోనే అత్యధిక వృద్ధిరేటును సాధించింది ఆంధ్ర రాష్ట్రం.

Pages