S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/04/2018 - 07:07

అమరావతి, అక్టోబర్ 3: గురుకుల విద్యార్థులు ఖండాంతరాలు దాటి తెలుగువారి సత్తాను చాటారని గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు అభినందించారు.

10/04/2018 - 07:06

విజయవాడ, అక్టోబర్ 3: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కులాంతర వివాహాల రక్షణ చట్టం తేవాలని సీపీఐ, సీపీఎం రాష్టస్థ్రాయి సదస్సు తీర్మానించింది. కుల దురహంకార హత్యలను ఖండిస్తూ ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ దాసరిభవన్‌లో రాష్ట్ర సదస్సు జరిగింది.

10/04/2018 - 04:39

రాజమహేంద్రవరం, అక్టోబర్ 3: ప్రధాని మోదీ పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి పెనుముప్పు పొంచివుందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ఉపాధ్యక్షురాలు బృందాకారత్ అన్నారు. మోదీ మనుస్మృతి పాలనతో ప్రజల ప్రజాస్వామిక హక్కులను, రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారన్నారు. మోదీ, చంద్రబాబునాయుడు దొందూ దొందేనన్నారు.

10/04/2018 - 04:34

అమరావతి, అక్టోబర్ 3: గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయవద్దని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులతో బుధవారం ఉదయం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ నిర్లిప్తత విడనాడండి.. ప్రజల్లోకి వెళ్లండి..మనం అందరం గ్రామాల నుంచే వచ్చాం..గ్రామాల్లో వౌలిక సదుపాయాల అభివృద్ధి అందరి బాధ్యత..

10/04/2018 - 04:33

తిరుపతి, అక్టోబర్ 3: తమను కన్నబిడ్డల్లా ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులు వెంకట నారాయణ, కుప్పయ్య ఎంతో మంచివాళ్లని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులకు మద్దతుగా విద్యార్థులు రోడ్డుపై బైటాయించి రాస్తారోకో, మానవహారం ఏర్పాటు చేసిన సంఘటన బుధవారం తిరుపతి శివారు సత్యనారాయణపురంలో జరిగింది.

10/04/2018 - 04:32

కడప సిటీ, అక్టోబర్ 3: రాష్ట్ర ప్రభుత్వం పనితీరు, రాష్ట్రంలో జరుగుతున్న విచ్చలవిడి అవినీతిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం మరో ఐదు ప్రశ్నలు సంధించారు. ప్రతివారం కన్నా ప్రభుత్వానికి ఐదు ప్రశ్నలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బుధవారం కడప నగరానికి వచ్చిన కన్నా 14వ వారం ఐదు ప్రశ్నలను సంధించారు.

10/04/2018 - 02:35

అమరావతి, అక్టోబర్ 3: రోడ్డు ప్రమాదాల్లో టీడీపీ నాయకులు రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మృతి చెందడం పట్ల రాష్ట్ర కేబినెట్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం హరికృష్ణ, ఎంవీవీఎస్ మూర్తితో పాటు ఇటీవల మావోయిస్టుల దాడిలో మృతిచెందిన కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమకు నివాళులర్పించింది.

10/04/2018 - 02:34

అమరావతి, అక్టోబర్ 3: దేశవ్యాప్తంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, రైతులపై లాఠీచార్జీలు, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు వైసీపీ, జనసేన పార్టీలకు కనిపించటంలేదా అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో తమను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.

10/04/2018 - 05:12

అయినవిల్లి: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అమెరికాలో దుర్మరణం చెందారన్న సమాచారంతో ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం ఎస్ మూలపొలం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మతుకుమిల్లి పట్ట్భారామయ్య, మాణిక్యం దంపతులకు 1938 జూలై 3న మూర్తి జన్మించారు. మూర్తి పూర్తిపేరు మతుకుమిల్లి వీర వెంకట సత్యనారాయణమూర్తి.

10/04/2018 - 02:31

కాకినాడ, అక్టోబర్ 3: రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం రూ.2,344 కోట్ల నిధులతో 1.25 లక్షల దళిత కుటుంబాలకు లబ్ధిచేకూరుస్తున్నామని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకరరావు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో బుధవారం ఎస్సీ కార్పొరేషన్, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Pages