S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/03/2018 - 03:34

అమరావతి, అక్టోబర్ 2: ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై పోలీసులు లాఠీ చార్జి చేయటం దుర్మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. గాంధీ జయంతి స్ఫూర్తిని కేంద్రప్రభుత్వం తుంగలో తొక్కడం దారుణమన్నారు. జైజవాన్..జైకిసాన్ అని నినదించిన లాల్‌బహదూర్‌శాస్ర్తీ ఆశయాలకు ఈ ఘటనతో తూట్లు పొడిచారని విమర్శించారు. దేశానికి అన్నంపెట్టే రైతన్న కర్తతర్పణం చేయాల్సి రావటం గర్హనీయమన్నారు.

10/03/2018 - 03:34

విజయవాడ(సిటీ), ఆక్టోబర్ 2: ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం వెలగపూడి సచివాలయంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఇటీవల నక్స్‌ల్స్ చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమకు క్యాబినెట్ సంతాపం తెలపనుంది.

10/02/2018 - 17:13

విజయవాడ: స్థానిక మున్సిపల్ స్టేడియంలో సచ్ఛత సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఏం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

10/02/2018 - 17:13

జంగారెడ్డిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ జంగారెడ్డిగూడెంలో డ్వాక్రా మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా రుణాల పంపిణీలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

10/02/2018 - 13:00

జంగారెడ్డిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత మంగళవారం ఉదయం గుర్వాయగూడెంలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. పండితులు వేద ఆశీర్వచనం పలికారు. ఆంజనేయుడికి పూజలు చేసిన అనంతరం పవన్ వెళ్లిపోయారు.

10/02/2018 - 12:59

హైదరాబాద్: గాంధీ జయంతి సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి అసెంబ్లీలోని మహాత్ముని విగ్రహం ఎదుట పుష్పాంజలి ఘటించారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో వచ్చిన ఆయన తొలుత అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రామరాజ్య స్థాపనకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని అన్నారు.

10/02/2018 - 11:59

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా జిల్లాలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించుకుని కోడెల ఇంటికి వెళ్లిపోయారు.

10/02/2018 - 11:57

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో పిసిసి అధ్యక్షులు ఎన్‌.రఘువీరా రెడ్డి మంగళవారం అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్నారు. అనంతరం ఇంటింటికి కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని ఆలయం వెలుపల నిర్వహించారు. అంతకు ముందు ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌లో గాంధీ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

10/02/2018 - 04:24

విజయనగరం: చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు బయలుదేరాను. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రజలను కోరారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సోమవారం ఆయన విజయనగరంలో పర్యటించారు.

10/02/2018 - 02:03

గుంటూరు, అక్టోబర్ 1: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఒక్క సీటు గెలిచినా రాజకీయ సన్యాసం చేస్తానని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అసత్యాలను భుజాన వేసుకుని రాష్టమ్రంతటా తిరుగున్నారని విమర్శించారు.

Pages