S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/03/2018 - 06:28

విశాఖపట్నం, అక్టోబర్ 2: కేంద్రం సహకరించి, పరిస్థితులు అనుకూలించి ఉంటే ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి నెలకు రెండు వేల రూపాయలు పెంచి మూడు వేలు ఇచ్చే వాళ్లమని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా రాష్టవ్య్రాప్తంగా ప్రారంభమైన ముఖ్యమంత్రి యువనేస్తం పథకంపై విపక్ష వైసీపీ నేత జగన్ చేస్తున్న విమర్శలను విశాఖలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఖండించారు.

10/03/2018 - 06:27

కాకినాడ, అక్టోబర్ 2: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు యువనేస్తం పథకం కింద అందించే నిరుద్యోగ భృతిని ఒక రూపాయి బోణీతో ప్రభుత్వం ముందుగా ప్రారంభిస్తోంది. యువనేస్తం పథకం కింద ఎంపికైన నిరుద్యోగుల ఖాతాలకు తొలుత రూపాయి వంతున ప్రభుత్వం జమ చేయనుంది. ఒక రూపాయి సక్రమంగా జమ అయినట్టు నిర్ధారణ జరిగిన పక్షంలో మిగిలిన 999 రూపాయలను ఈనెల 4వ తేదీన ప్రభుత్వం జమ చేయనుంది.

10/03/2018 - 03:46

విజయవాడ(సిటీ), ఆక్టోబర్ 2: ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య రంగంలో నూతన శకం ప్రారంభం కానుంది. ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్న ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారి ఎలక్ట్రానిక్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేసిందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది.

10/03/2018 - 03:43

అమరావతి, అక్టోబర్ 2: ఆంధ్రప్రదేశ్‌తో మహాత్మాగాంధీకి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే అంశాలతో చిత్రీకరించిన లఘుచిత్రం సీడీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు.

10/03/2018 - 03:40

విజయవాడ (పాతబస్తీ), అక్టోబర్ 2: మహాత్మాగాంధీ జీవితం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందని అఖిల భారత స్వాతంత్య్ర సమరయోధుల సంఘం ప్రధాన కార్యదర్శి సత్యానంద్ యాజీ అన్నారు. విజయవాడలోని పాల ఫ్యాక్టరీ వద్ద గల సయ్యద్ అప్పలస్వామి కాలేజీ ఆవరణలో నిర్మించిన గాంధీ దేవాలయాన్ని మంగళవారం ఆయన ప్రారంచారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ జ్యోతి ప్రజ్వలనం చేశారు.

10/03/2018 - 03:39

అమరావతి, అక్టోబర్ 2: స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం అమలులో రాష్ట్రానికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏపీకి ప్రధమ స్థానం దక్కింది. ఇప్పటికే ఓడీఎఫ్‌లో దేశంలోకెల్లా రాష్ట్రం ముందంజలో ఉంది. జాతీయ స్థాయిలో ఇంధన వనరులు, పర్యాటకం, జలవనరుల నిర్వహణలో ఇప్పటికే పెద్దఎత్తున ఇతర రాష్ట్రాల కంటే ముందు వరసలో నిలిచింది.

10/03/2018 - 03:36

అమరావతి, అక్టోబర్ 2: రాష్ట్రంలో నిరుద్యోగ భృతి పథకం అమలుతో ప్రతిపక్ష వైకాపా భూస్థాపితం కావడం తథ్యమని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి ఎన్ అమర్‌నాథ్‌రెడ్డి విమర్శించారు. ఈ ఉద్దేశ్యంతోనే నిరుద్యోగ భృతి పథకానికి వైకాపా అడుగడుగునా అడ్డుపడుతోందని మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. వైసీపీ తీరును యువత గమనిస్తున్నారని, వారి ఆగ్రహానికి జగన్ గురికాక తప్పదని హెచ్చరించారు.

10/03/2018 - 03:36

విజయవాడ, అక్టోబర్ 2: ప్రతి మంచి పనికి ముందు ఏదో ఒక చెడ్డ పని చేయడమే ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి నైజం అని రాష్ట్ర క్రీడలు, న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. యువతను వంచిస్తున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వారికి సమాధానం చెప్పాలని మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో కొల్లు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని అడ్డుకోవడం యువతరానికి ద్రోహం చేయడమేనన్నారు.

10/03/2018 - 03:35

గుంటూరు, అక్టోబర్ 2: దేశంలోనే అత్యుత్తమ పథకంగా యువనేస్తం నిలిచిపోతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. మంగళవారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వమూ అమలు చేయని విధంగా ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేసి చరిత్ర సృష్టించారన్నారు.

10/03/2018 - 03:35

విజయవాడ, అక్టోబర్ 2: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉండవల్లిలోని ఆయన నివాసంలో రాష్ట్ర డీజీపీ ఆర్‌పి ఠాకూర్ సోమవారం రాత్రి కలిశారు. పోలీసు ఉన్నతాధికారుల బదిలీలపై చర్చించినట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియ ఈ ఏడాది చివరిలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్ల బదిలీలపై దృష్టి సారించారు.

Pages