S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/05/2018 - 12:14

విజయవాడ: కనకదుర్గ అమ్మవారి గుడిలో జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం విజయవాడ రైల్వే స్టేషన్‌లో రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అదనపు డివిజనల్ మేనేజర్ సుమన ఆధ్వర్యంలో అధికారులు స్టేషన్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఏర్పాట్లను పరిశీలించారు. దసరా సందర్భంగా 25 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. అదనపు బుకింగ్ కౌంటర్లు, హెల్ప్‌డెస్క్‌లు, భద్రతాఏర్పాట్లు పరిశీలించారు.

10/05/2018 - 12:13

విజయవాడ: విజయవాడలో శుక్రవారంనాడు ఐటీ అధికారులు విస్తత్రంగా సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన సదరన్ కన్‌స్ట్రక్షన్ డెవలపర్స్ అండ్ కనస్ట్రక్షన్స్ కార్యాలయంపైనా, ఆ సంస్థ ప్రతినిధుల ఇళ్లపైనా దాడులు నిర్వహించారు. అలాగే కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని ప్రీకాస్టింగ్ ఇటుకల తయారీ కంపెనీపై కూడా దాడులు జరిగాయి. మొత్తం ఏడు బృందాలుగా విడిపోయిన అధికారులు ఈ సోదాలు నిర్వహించారు.

10/05/2018 - 01:47

గుంటూరు, అక్టోబర్ 4: ఆడబిడ్డలను తోబుట్టువులుగా భావించే ఏకైన పార్టీ తెలుగుదేశమని, డ్వాక్రా సంఘాలను ప్రారంభించి మహిళల ఆర్థిక పురోగతికి తెలుగుదేశం ప్రభుత్వం చేయూతనిచ్చిందని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. రాష్ట్రంలో 90 లక్షల మంది డ్వాక్రా సైన్యం ఉన్నారంటే ఆ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని కొనియాడారు.

10/05/2018 - 02:37

రాజమహేంద్రవరం, అక్టోబర్ 4: నేటి సమాజంలో చట్టాలే మహిళలకు ఆయుధాలని, వాటిని సక్రమ రీతిలో ఉపయోగించుకోవాలని ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి రోహిణి పిలుపునిచ్చారు. సాక్షులకు రక్షణ లేకపోవడంవల్ల చాలా కేసుల్లో కోర్టువరకు వచ్చేసరికి విఫలమవుతున్నాయన్నారు. అందువల్ల సాక్షులకు ప్రభుత్వం తగిన రక్షణ కల్పించడానికి కృషిచేయాలని, సాక్ష్యాధారాలకు స్వేచ్ఛ కల్పించాలన్నారు.

10/05/2018 - 01:43

కాకినాడ, అక్టోబర్ 4: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో పైపులైను ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్)ను సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. భాగ్యనగర్ గ్యాస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ నగర ప్రజలకు కొంత కాలంగా పైపులైన్ ద్వారా వంట గ్యాస్‌ను సరఫరా చేస్తున్నారు.

10/05/2018 - 01:41

విజయవాడ, అక్టోబర్ 4: ఇచ్చిన హామీలను నెరవేర్చని టీడీపీని ఈ సారి ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, హామీలు నెరవేర్చకపోవడం, అవినీతి పాలనపై ధర్నా చౌక్‌లో గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

10/05/2018 - 01:40

రేణిగుంట/ఏర్పేడు, అక్టోబర్ 4: ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి బ్రాండ్ అంబాసిడర్ సీ ఎం చంద్రబాబు నాయుడేనని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారాలోకేష్ అన్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం, వికృతమాల గ్రామం వద్ద, రేణిగుంట ఐటీ హబ్ పరిధిలో రూ. 150 కోట్లతో డిక్సన్ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ ఉత్పత్తులను గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

10/05/2018 - 01:39

హిందూపురం, అక్టోబర్ 4: రాయలసీమలో నెలకొన్న కరవుపై వామపక్షాల ఆధ్వర్యంలో త్వరలో దండయాత్ర చేపట్టనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. కరవు కాటకాలతో అల్లాడుతున్న రాయలసీమ పట్ల టీడీపీ ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంభిస్తోందని ఆయన ఆరోపించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కరవు మండలాలను ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు.

10/05/2018 - 02:54

సూళ్లూరుపేట: ప్రతి సామాన్యుడికి ప్రగతి ఫలాలు అందించడమే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఉద్దేశ్యమని ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ అన్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లో నిర్వహించిన అంతరిక్ష వారోత్సవాలను (వరల్డ్ స్పేస్ వీక్) గురువారం ఆయన ప్రారంభించారు.

10/05/2018 - 00:55

విజయవాడ, అక్టోబర్ 4: ఒకరు కళాశాల అధ్యాపకులు, మరొకరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, వేరొకరు ఉన్నత స్థాయి పట్ట్భద్రులు.. ఇలాంటి వారందరూ తమ వృత్తులను విడనాడి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు తల్లిదండ్రుల స్ఫూర్తి, ప్రభుత్వం అందిస్తున్న చేయూత, అవలంబిస్తున్న వ్యవసాయ విధానాలే కారణంగా చెప్పవచ్చు.

Pages