S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/05/2018 - 00:55

గుంటూరు, అక్టోబర్ 4: బీజేపీ పాలిత రాష్ట్రాల పట్ల ఒకరకంగానూ, ఆంధ్రప్రదేశ్ పట్ల మరోరకంగానూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ మండిపడ్డారు. భోబోపాల్, ఇండోర్ మెట్రోలకు రూ.7 వేల కోట్లను కేంద్రం సాయం చేయగా విజయవాడ, విశాఖ మెట్రో రైళ్లు నిర్మాణానికి రూపాయి ఇవ్వడానికి చేతులు రావడం లేదా అంటూ ప్రశ్నించారు.

10/05/2018 - 00:54

విజయవాడ, అక్టోబర్ 4: ముస్లింల సంక్షేమం, అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని ప్రభుత్వ విప్, హజ్ కమిటీ సభ్యులు ఎంఏ షరీఫ్ తెలిపారు. 2019 హజ్‌యాత్ర విజయవాడ ఎయిర్‌పోర్డు నుంచి సాధ్యమయ్యేలా ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారన్నారు. గురువారం విజయవాడలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జిల్లా హజ్ సొసైటీల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

10/05/2018 - 00:54

గుంటూరు, అక్టోబర్ 4: తూర్పుగోదావరి జిల్లాలో అర్చకుడు మల్లికార్జున శర్మ ఆత్మహత్య ఘటనను మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తమ శవ రాజకీయాలకు వాడుకుంటున్నారని, అసలు నిజాన్ని గుర్తించి మాట్లాడాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కో-కన్వీనర్ సిరిపురపు శ్రీ్ధర్ హితవు పలికారు. అర్చకుని ఆత్మహత్యకు చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ ఐవైఆర్ వ్యాఖ్యలు చేయడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు.

10/05/2018 - 00:53

గుంటూరు, అక్టోబర్ 4: తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిన్న చిన్న అర్చకుల పొట్ట కొడుతున్నారని బీజేపీ నేత, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఆరోపించారు.

10/04/2018 - 17:22

ఆలంపూర్: కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. జోగులాంబ దేవాలయం నుంచి ప్రారంభించిన ఎన్నికల రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన ఏ మాటా కూడా కేసీఆర్ నిలబెట్టుకోలేదని, తెలంగాణను వ్యతిరేకించినవారినే ఆయన మంత్రివర్గంలో నియమించుకున్నారని అన్నారు. ఇంకా ఈ రోడ్‌షోలో కాంగ్రెస్ నాయకులు భట్ట విక్రమార్కుడు, జీవన్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.

10/04/2018 - 13:58

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులో ఈ నెల 10న కోర్టుకు హాజరు కావాలని కోడెలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో గతంలో హైకోర్టులో స్టే పొందగా...అది గత నెల 27తో ముగిసింది.

10/04/2018 - 07:12

అమరావతి, అక్టోబర్ 3: కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోంది.. అయినా కుంగిపోకుండా దీక్షా దక్షతలతో పనిచేస్తున్నాం.. ఇదే వారికి కంటగింపుగా మారింది.. లక్ష్య సాధనలో ఏదీ లెక్కచేయకుండా ప్రజల సంతృప్తి స్థాయి ప్రామాణికంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు.

10/04/2018 - 07:11

విజయవాడ ( ఇంద్రకీలాద్రి),అక్టోబర్ 3: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా మహోత్సవాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దుర్గగుడి ఈవో వీ కోటేశ్వరమ్మ తెలిపారు. పాతబస్తీ మాడపాటి వారి విశ్రాంతి భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ 8. 30 కోట్ల రూపాయల వ్యయంతో ఉత్సవాల నిర్వహణకు పారదర్శకతతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

10/04/2018 - 07:10

అమరావతి, అక్టోబర్ 3: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను కారు షెడ్లకు.. పారిశ్రామిక వేత్తలను జైళ్లకు పంపిన ఘనత వైఎస్ కుటుంబానిదని తెలుగుదేశం ప్రభుత్వం కల్పిస్తున్న నిరుద్యోగ భృతిపై మాట్లాడే నైతిక అర్హత ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డికి లేదని రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు స్పష్టం చేశారు.

10/04/2018 - 07:08

విజయవాడ, అక్టోబర్ 3: తెలుగుదేశం పార్టీ అగ్రనేతల అకాల మరణాలు ఆ పార్టీకి శరాఘాతంలా తగులుతున్నాయి. ప్రధానంగా ప్రమాదాలు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ మరణం నుంచి ఆ పార్టీ నేతలు కోలుకోకముందే మరో సీనియర్ నేత మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించారు.

Pages