S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/04/2018 - 02:31

విజయవాడ, అక్టోబర్ 3: ఉపాధి హామీ పథకం మండల కంప్యూటర్ సెంటర్(ఎంసీసీ)ల్లో పని చేస్తున్న కార్యాలయ సహాయకుల వేతనం నెలకు రూ.3000 నుంచి రూ.6000లకు పెంచుతున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులు పి రంజిత్ బాషా బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

10/04/2018 - 02:30

మదనపల్లె, అక్టోబర్ 3: ప్రభుత్వాలు మారాలంటే 18ఏళ్ళు నిండిన యువత ఓటరులుగా మారాలని సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువతలో ఆలోచన విధానాలలో మార్పులు చాలా అవసరం అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో బుధవారం యువత, విద్యార్థులతో ఆయన ఆత్మీయ సభలో మాట్లాడుతూ జీవితంలో ఓ లక్ష్యాన్ని ఏర్పాటుచేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

10/03/2018 - 17:53

కడప: కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన ఈరోజు కడప జిల్లాలో పర్యటించారు. కడప, రాజంపేట నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాయలసీమ పట్ల తెలుగుదేశం చిన్నచూపు చూస్తుందని అన్నారు.

10/03/2018 - 12:59

అనంతపురం : హిందూపురం మండలం కిరికెర గేటు వద్ద బుధవారం దారుణ హత్య చోటు చేసుకుంది. సికె పల్లి మండలం దామాజిపల్లికి చెందిన రామంజనేయులు అనే వ్యక్తిని దుండగులు కారులో తీసుకొచ్చి, కిరికెర గేటు వద్ద కారుతో తొక్కించి దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.

10/03/2018 - 12:40

అమరావతి: గీతం యూనివర్శిటీ వ్యవస్థాపకులు, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే మంత్రులు నారా లోకేశ్, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, అచ్చెన్నాయుడు, పరిటాల సునీత, దేవినేని ఉమ తదితరులు సంతాపం వ్యక్తంచేశారు, మూర్తి మృతి పట్ల పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా సంతాపం తెలిపారు.

10/03/2018 - 12:39

విశాఖపట్నం: గీతం యూనివర్శిటీ అధినేత, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈనెల 6న కాలిఫోర్నియాలోని గీతం యూనివర్శిటీ పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆయన ప్రసంగించవలసి వుంది. మంగళవారం ఆయన కాలిఫోర్నియా నుంచి అలస్కాలోని అంకరేజ్ సఫారిని సందర్శించేందుకు వెళుతుండగా వీరు ప్రయాణిస్తున్న వ్యానును ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొంది.

10/03/2018 - 06:33

అమరావతి, అక్టోబర్ 2: కేంద్రం మెడలు వంచైనా రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తాం.. అది ఎన్నికలలోపు కావచ్చు.. లేదా తరువాత కావచ్చు..ఎప్పుడైనా ఈ పోరాటం ఆగదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ ప్రారంభం సందర్భంగా ఉండవల్లి ప్రజావేదికలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నిరుద్యోగ లబ్ధిదారులతో మంగళవారం ముఖాముఖి నిర్వహించారు.

10/03/2018 - 06:35

శ్రీకాకుళం, అక్టోబర్ 2: ప్రత్యక్ష నారాయణడు శ్రీ సూర్యనారాయణ స్వామి పాదాలను మంగళవారం ఉదయం సూర్యకిరణాలు స్పృశించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి తాను పులకించిపోయానని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘవీరారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం సూర్యనారాయణ స్వామి ఆలయానికి వచ్చిన ఆయన ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు.

10/03/2018 - 06:31

విజయవాడ, అక్టోబర్ 2: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఎందుకు నోరు మెదపటం లేదని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య ప్రశ్నించారు.

10/03/2018 - 06:29

విజయవాడ, అక్టోబర్ 2: పరిసరాల పరిశుభ్రత - పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ గ్రామాల్లో కృషి చేస్తున్న 33 మందిని ప్రభుత్వం గుర్తించగా గాంధీ జయంతి రోజు మంగళవారం స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వచ్ఛతే సేవ సభలో సీఎం చంద్రబాబు వారిని నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

Pages