S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/07/2018 - 23:38

అమరావతి, ఆగస్టు 7: ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ గృహనిర్మాణ లక్ష్యాలను అధిగమించాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, తక్షణమే సమస్య పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో మంగళవారం 13 జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

08/07/2018 - 23:38

నంద్యాల, ఆగస్టు 7: విత్తన ఉత్పత్తిలో నంద్యాల సీడ్‌హబ్‌ను దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయడంతోపాటు వ్యవసాయం లాభదాయకంగా ఉండేలా కృషి చేస్తానని అన్నారు.

08/07/2018 - 23:37

విజయవాడ (క్రైం), ఆగస్టు 7: రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ప్రత్యేక మహిళా కోర్టులు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంతోపాటు ఆయా కేసులకు సంబంధించి విచారణ త్వరితగతిన పూర్తి చేసి సత్వరమే దోషులకు శిక్షలు పడేలా పోలీసుశాఖ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ ప్రత్యేక మహిళా కోర్టులు దోహదపడనున్నాయి.

08/07/2018 - 23:37

విజయవాడ (క్రైం), ఆగస్టు 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వనం-మనం కార్యక్రమంలో భాగస్వామ్యమైన ఏపి పోలీసుశాఖ కేవలం 20రోజుల వ్యవధిలోనే లక్ష్యాన్ని అధిగమించింది. రాష్ట్రంలోని అన్ని పోలీసు జిల్లాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన డీజీపీ ఆర్‌పి ఠాకూర్ ఆదేశాలను అందుకున్న పోలీసులు లక్ష్యాన్ని మించి మొక్కలు నాటారు. రాష్ట్రంలో పది లక్షలు మొక్కలు నాటాలని నిర్దేశించగా..

08/07/2018 - 23:36

విజయవాడ, ఆగస్టు 7: ఏపీలో అన్ని రంగాల్లో వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్న నిర్లక్ష్యంపై సీపీఐ, సీపీఎం ఆధ్వర్యాన ఐక్య ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ప్రకటించారు.

08/07/2018 - 23:35

విజయవాడ, ఆగస్టు 7: ఏపీఎస్ ఆర్టీసీలో కార్మిక సంఘాల గుర్తింపు కోసం ఈ నెల 9వ తేదీ జరగనున్న ఎన్నికలకు సంబంధించి ప్రస్తుత గుర్తింపు యూనియన్ నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లారుూస్ యూనియన్ కూటమిల మధ్య గత కొద్ది రోజులుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు.

08/07/2018 - 23:35

విజయవాడ, ఆగస్టు 7: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షుడు, నలుగురు సభ్యుల ఎంపిక కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని నియమిస్తూ రాష్ట్ర పర్యాటక, భాష, సాంస్కృతిక కార్యదర్శి ముకేష్‌కుమార్ మీనా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

08/07/2018 - 23:34

విశాఖ (జగదాంబ), ఆగస్టు 7: తెలుగు భాష, సాహిత్యాల పురోగతికి అహర్నిశలూ కృషి చేస్తున్న నాలుగు సాహిత్య సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో వచ్చే నవంబర్ 3,4 తేదీల్లో ఆరో ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వహిస్తున్నట్లు లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు.

08/07/2018 - 04:25

అమరావతి, ఆగస్టు 6: అసాధ్యాన్ని సుసాధ్యం చేయటంపైనే యువత దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో స్మార్ట్ పవర్‌గ్రిడ్ ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులు వినూత్న ఆలోచనలు చేయాలి.. నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని సీఎం ప్రజావేదిక ప్రాంగణం నుంచి సోమవారం ముఖ్యమంత్రి హై ఎనర్జీ డెన్సిటీ స్టోరేజి డివైస్(బ్యాటరీ)ను ఆవిష్కరించారు.

08/07/2018 - 04:23

అమరావతి, ఆగస్టు 6: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై సోమవారం జిల్లా కలెక్టర్లతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కడప, ప్రకాశం జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Pages