S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/03/2018 - 02:00

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ప్రపంచ స్టాక్ మార్కెట్ల నుంచి అందే సంకేతాలు, తాజా స్థూలార్థిక గణాంకాలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువలో కదలికలు, ముడి చమురు ధరలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా.

09/03/2018 - 01:27

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: విదేశీ మదుపరులు ఆగస్టు నెలలో భారత క్యాపిటల్ మార్కెట్లలో నికరంగా రూ. 5,100 కోట్లకు పైగా నిధులను పెట్టుబడులుగా పెట్టారు. వీటిలో రూ. 1,775 కోట్ల నిధులను ఈక్విటీ మార్కెట్లలో, రూ. 3,414 కోట్ల నిధులను డెబిట్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టారు. దేశీయ క్యాపిటల్ మార్కెట్లలోకి విదేశీ మదుపరుల నిధులు తరలిరావడం ఇది వరుసగా రెండో నెల.

09/03/2018 - 01:25

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: అమెరికాకు చెందిన అలైట్ సొల్యూషన్స్ ఎల్‌ఎల్‌సి నుంచి 1.5 బిలియన్ డాలర్ల ఆర్డర్‌ను పొందినట్లు ఐటి దిగ్గజం విప్రో పేర్కొంది. తమ సంస్థ ఇటీవలకాలంలో అతి పెద్ద ఆర్డర్‌ను పొందడం ఇదే తొలిసారి అని విప్రో పేర్కొంది. ఈ ఒప్పందం పదేళ్ల పాటు అమలులో ఉంటుంది. ఇలినాయిస్‌కు చెందిన అలైట్ సొల్యూషన్స్‌కు వివిధ సేవలపై సొల్యూషన్స్‌ను అందిస్తామని విప్రో పేర్కొంది.

09/03/2018 - 01:24

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: మన దేశం నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై మధ్య కాలంలో సుమారు అయిదు శాతం తగ్గి, 10.64 బిలియన్ డాలర్ల విలువకు చేరుకున్నాయి. ప్రధాన అభివృద్ధి చెందిన మార్కెట్లలో వీటికి డిమాండ్ తగ్గడం వల్ల వీటి ఎగుమతులు తగ్గిపోయాయి.

09/03/2018 - 01:23

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: పెండింగ్ కేసుకు సంబంధించి కోర్టును తప్పుదోవబట్టించే విధంగా ఆదాయం పన్ను శాఖ వ్యవహరించినందుకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు విహారయాత్ర స్థలం కాదని కోర్టు పేర్కొంది. జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.

09/03/2018 - 22:07

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశవ్యాప్తంగా తపాలా బ్యాంకింగ్ సేవలు ప్రారంభమయ్యాయి. భారత పోస్టు బ్యాంకు సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఇక్కడ ప్రారంభించారు. తపాలా బ్యాంకింగ్ సేవలు దేశంలోని దాదాపు అన్ని శాఖల్లో గల మూడు లక్షల మంది పోస్టుమ్యాన్‌లు, గ్రామీణ డాక్ సేవక్‌ల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండడనున్నాయి.

09/02/2018 - 01:58

* రాణించిన పవర్, లోహ, ఆరోగ్య సంరక్షణ, ఐటీ, టెక్నాలజీ, వాహన, బ్యాంకింగ్ షేర్లు
* ఈ వారం మార్కెట్ సరళిపై సమీక్ష

09/02/2018 - 02:01

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశంలో గృహ, వాహన, ఇతర రుణాల వడ్డీ రేట్లు పెరగబోతున్నాయి. ఎందుకంటే దేశంలోని అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శనివారం బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను (ఎంసీఎల్‌ఆర్‌ను) 0.2 శాతం పెంచింది. ఇతర బ్యాంకులు కూడా తమ బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది.

09/02/2018 - 02:02

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: బంగారం ధర వరుసగా మూడో రోజు శనివారం కూడా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల పసిడి ధర రూ. పది పెరిగి, రూ. 31,350కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తుండటంతో పసిడి ధర మూడో రోజు కూడా పెరిగింది.

09/02/2018 - 01:37

బీజింగ్, సెప్టెంబర్ 1: చైనాలో సోమవారం నుంచి జరుగనున్న చైనా-ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశంలో ఆఫ్రికా దేశాల్లో చైనా పెట్టుబడులకు సంబంధించి మరికొన్ని పథకాలను చైనా అధ్యక్షుడు గ్జీ జింగ్‌పింగ్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఆఫ్రికా దేశాలకు సంబంధించిన అనేక మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

Pages