S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/08/2018 - 01:51

న్యూఢిల్లీ, జూలై 7: ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వరుసగా మూడో రోజు శనివారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.75.98కి చేరింది. అలాగే లీటర్ పెట్రోల్ ధర ముంబయిలో రూ.83.37కు, కోల్‌కతాలో రూ. 78.66కు, చెన్నయ్‌లో రూ. 78.85కు పెరిగింది. లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో శనివారం రూ. 67.76కు పెరిగింది. ముంబయిలో లీటర్ డీజిల్ ధర రూ.

07/07/2018 - 01:19

ముంబయి, జూలై 6: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఊగిసలాటలో సాగిన లావాదేవీలలో తిరిగి కొంత వరకు బలపడ్డాయి. వాహన, స్థిరాస్తి, క్యాపిటల్ గూడ్స్, ఇంధన షేర్లకు మదుపరుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతు వల్ల మార్కెట్ కీలక సూచీలు పుంజుకున్నాయి.

07/07/2018 - 01:08

విజయవాడ, జూలై 6: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో రోజ్ గార్డెన్‌ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి పరిధిలోని శాఖమూరు వద్ద 300 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న పార్క్‌లో భాగంగా దీనిని అభివృద్ధి చేయనున్నారు. రోజ్ గార్డెన్‌ను 22 ఎకరాల్లో దాదాపు 30 కోట్ల రూపాయలతో అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టనుంది.

07/07/2018 - 01:07

న్యూఢిల్లీ, జూలై 6: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) రూ. 136 కోట్ల మొండి బకాయిలను రాబట్టుకోవడానికి మూడు నిరర్ధక ఆస్తులను (ఎన్‌పీఏలను) విక్రయానికి పెట్టింది. ఈ మూడు నిరర్ధక ఆస్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి గల సంస్థలు ముందుకు రావాలని ఆహ్వానించింది.

07/07/2018 - 01:06

న్యూఢిల్లీ, జూలై 6: లిక్కర్ బారన్ విజయ్ మాల్యాకు చెందిన ఆస్తులలో వీలయినన్ని ఎక్కువ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి భారతీయ బ్యాంకులు బ్రిటన్ అధికారులతో కలిసి పనిచేస్తున్నాయి. భారత్‌లో వివిధ బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొని, తరువాత ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా బ్రిటన్‌లోని ఒక కోర్టు తీర్పు ఇచ్చిన విషయం విదితమే.

07/07/2018 - 01:05

విజయవాడ, జూలై 6: రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని, ఈ నగరం పెట్టుబడిదారులకు స్వర్గ్ధామమని, అవకాశాలకు గని వంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ఆరు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఈ నెల 8, 9 తేదీల్లో సింగపూర్‌లో ప్రపంచ నగరాల సదస్సుకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.

07/06/2018 - 16:41

ముంబయి:దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. సెనె్సక్స్ వంద పాయింట్లకు పైగా లాభపడగా..నిఫ్టీ 10,750పైన ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభపడింది.మార్కెట్లు కాసేపటికే జోరందుకున్నా ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 83 పాయింట్ల లాభంతో 35,658కి పెరిగింది. నిఫ్టీ 23 పాయింట్లు పుంజుకుని 10,773 వద్ద స్థిరపడింది.

07/06/2018 - 00:47

ముంబయి, జూలై 5: చౌక ధరలకు మొబైల్ వాయిస్ కాల్స్, డాటా ను అందించడం ద్వారా దేశంలో మొబైల్ ఫోన్ల మార్కెట్‌ను ఒక కుదు పు కుదిపిన దేశంలోనే అత్యంత ధనవంతుడయిన ముకేశ్ అంబానీ గురువారం అల్ట్రా హై-స్పీడ్ ఫిక్స్‌డ్ లైన్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌ను ఆవిష్కరించారు. దేశంలోని 1,100 నగరాలలో ని ఇళ్లు, సంస్థలకు ఈ ఫిక్స్‌డ్ లైన్లను అందించనున్నారు.

07/06/2018 - 00:50

ముంబయి, జూలై 5: వరుసగా రెండు రోజుల పాటు లాభపడిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టపోయాయి. చైనానుంచి దిగుమతి అయ్యే కొన్ని సరుకులపై అమెరికా సుంకాలు విధించనున్న తరుణంలో ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం పడిపోయాయి. ఆసియా మార్కెట్లను అనుసరిస్తూ భారత స్టాక్ మార్కెట్లు కూడా నష్టపోయాయి.

07/06/2018 - 00:37

లండన్/బెంగళూరు, జూలై 5: భారత్ నుంచి పరారై లండన్‌లో తలదాచుకుంటున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో చుక్కెదురైంది. భారత్‌కు చెందిన 13 కోర్టుల కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన యుకె హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆర్డర్‌ను జారీ చేసింది. ఈ ఆర్డర్ కింద కోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అతని ఏజెంట్లు లండన్‌లోని విజయ్ మాల్యా ఆస్తులు, ఇండ్లలో ప్రవేశించే హక్కును కల్పించింది.

Pages