S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/12/2018 - 01:11

ముంబయి, జూలై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తొలి త్రైమాసికంలో అంచనాలను మించి ఆదాయాన్ని ఆర్జించడంతో ఆ కంపెనీ షేర్ల విలువ బుధవారం 5.47 శాతం పుంజుకొని జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన రూ. 1,979.60లకు చేరింది.

07/11/2018 - 23:27

న్యూఢిల్లీ, జూలై 11: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి ఈ నెల 21న జరిగే సమావేశంలో కొన్ని వస్తువులపై పన్ను రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. పన్ను హేతుబద్ధీకరణ కసరత్తులో భాగంగా ఆదాయం తక్కువగా ఉన్న వాటిపై పన్ను రేట్లను తగ్గించే అవకాశం ఉంది. పన్ను రేట్లు తగ్గే అవకాశం ఉన్న వస్తువులలో సానిటరి నాప్కిన్స్, హస్తకళలు, చేనేత వస్తువులతో పాటు కొన్ని సేవలు ఉన్నాయి.

07/11/2018 - 23:26

న్యూఢిల్లీ, జూలై 11: భారత్ ఫ్రాన్స్‌ను ఏడో స్థానంలోకి నెట్టి ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2017 సంవత్సరానికి ప్రపంచ బ్యాంకు సేకరించిన గణాంకాల ప్రకారం భారత్ ఈ ఘనత సాధించింది. 2017 సంవత్సరాంతం నాటికి భారత్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2.597 ట్రిలియన్ డాలర్లు కాగా, ఫ్రాన్స్ జీడీపీ 2.582 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

07/11/2018 - 23:25

జైపూర్, జూలై 11: స్థానిక సంస్థల ద్వారా ప్రజాసామ్యాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో 74వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదని నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది. 24 ఏళ్ల తరువాత కూడా పరిస్థితిలో ఆశించిన మార్పు రాలేదని నీతి ఆయోగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. 1992లో నగరపాలిక చట్టం (74వ సవరణ) చేయగా 1993 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.

07/11/2018 - 23:24

న్యూఢిల్లీ, జూలై 11: ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియా విలీనాన్ని ప్రభుత్వం ఆమోదించిందని టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. అయితే ఈ ఒప్పందం పూర్తి కావాలంటే రెండు కంపెనీలు కొన్ని లాంఛనాలను పూర్తి చేయవలసిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు.

07/11/2018 - 23:23

సత్యవేడు, జూలై 11: జపాన్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ టోరే ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన ఉత్పత్తి కేంద్రం నెల్లూరు, చిత్తూరు జిల్లా సరిహద్దులోని శ్రీసిటీ సెజ్‌లో ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యాక్టరీ నిర్మాణానికి బుధవారం శ్రీసిటీలో భూమిపూజ జరిగింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమరనాథరెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించి లాంఛనంగా నిర్మాణాన్ని ప్రారంభించారు.

07/11/2018 - 16:22

ముంబయి: దేశీయ సూచీలు మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 26 పాయింట్ల స్వల్ప లాభంతో 36,266 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా ఒకే ఒక్క పాయింట్‌ లాభపడి 10,948 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.82గా కొనసాగుతోంది.

07/11/2018 - 04:42

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా విహంగ వీక్షణ పర్యాటక ప్రాజెక్టు మొదలైంది. తమిళనాడుకు చెందిన కూనాల్ ఎయిర్ చార్టర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సెస్నా ఎయిర్‌క్రాఫ్ట్‌తో పర్యాటక ప్యాకేజీ సర్వీసును ప్రవేశపెట్టింది.

07/11/2018 - 00:20

నోయడాలో మంగళవారం జరిగిన స్మార్ట్ఫోన్ ఫ్యాక్టరీ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద స్మార్ట్ఫోన్ ఫ్యాక్టరీ కావడం గమనార్హం.

07/11/2018 - 00:15

ముంబయి, జూలై 10: ప్రోత్సాహకరంగా ఉన్న కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఆదాయాల దన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు మంగళవారం బాగా బలపడ్డాయి.

Pages