S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/20/2017 - 23:53

విజయవాడ, డిసెంబర్ 20: జనవరి 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చౌకధరల దుకాణాల్లో పంచదారను కార్డుదారులకు అందించనున్నామని, పేదవాడు పండుగను ఆనందంగా జరుపుకునేందుకు చంద్రన్న ప్రత్యేక కానుకలను అందిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

12/20/2017 - 23:52

విశాఖపట్నం, డిసెంబర్ 20: గీతం డీమ్డ్ యూనివర్శిటీతో సింగపూర్ కంపెనీ అవగాహన ఒప్పం దం కుదుర్చుకుంది. గీతం వర్శిటీలో ఫిన్‌టెక్ అకాడెమీ నిర్వహిస్తున్న కోర్సుల పట్ల సింగపూర్‌కు చెందిన నీ ఆన్ పాలిటెక్నిక్ విద్యాలయం సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు కలిసి పనిచేసేందుకు ఉత్సాహం చూపుతోందని గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.షీల తెలిపారు.

12/20/2017 - 00:33

ముంబయి, డిసెంబర్ 19: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన రెండోరోజున మంగళవారం కూడా స్టాక్ మార్కెట్లు లాభాల జోరును కొనసాగించాయి. ఈ పరిణామం మదుపరులకు మహదానందం కలిగించింది. గుజరాత్ ఎన్నికల్లో భాజపా విజయ దుందుభి మోగించడంతో సోమవారం నాడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. మంగళవారం కూడా అదే జోరు కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు కూడా దేశయ మార్కెట్‌ను బలపరిచాయి.

12/20/2017 - 00:32

ముంబయి, డిసెంబర్ 19: అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్‌లో ప్రభుత్వరంగ, చిన్న తరహా వాణిజ్య సంస్థల అభివృద్ధిపై దృష్టి సారించనుంది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ఇండియా అధ్యక్షుడు అనంత్ మహేశ్వరి వెల్లడించారు. చిన్న, మధ్యతరహా వ్యాపార రం గం, డిజిటల్ ఇండియాకు సంబంధించి ప్రభుత్వరంగ సంస్థలతో కలసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

12/20/2017 - 00:29

న్యూఢిల్లీ, డిసెంబర్ 19:డ్రెడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ)లో 73.47 శాతం భాగాన్ని ప్రైవేటు పరం చేయాలని కేంద్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యు డు కేవీపీ రామచంద్రరావు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. అలాగే రాజ్యసభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు.

12/20/2017 - 00:34

విశాఖపట్నం, డిసెంబర్ 19: భారతీయ రైల్వేలో జోన్ల మధ్య సమన్వయం లోపిస్తోంది. దీని ప్రభావం ప్రయాణికులపై పడుతోంది. ఎక్కడా లేనివిధంగా దక్షిణమధ్య రైల్వే, ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ల మధ్యనే ఇది కనిపిస్తోంది. రైళ్ళ క్లియరెన్స్ సమస్యగా మారిందని, అందువల్లే సీజన్లలో ప్రత్యేక రైళ్ళు విశాఖ మీదుగా, విశాఖ వరకు అనుకున్నంతగా నిర్వహించలేకపోతున్నామనే వాదన దక్షిణమధ్య రైల్వే నుంచి వినిపిస్తోంది.

12/20/2017 - 00:27

తిరుపతి, డిసెంబర్ 19: అగ్రశ్రేణి బ్యాటరీ తయారీదారునిగా తమ స్థానా న్ని మరింత బలోపేతం చేస్తూ అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ ద్విచక్ర వాహన బ్యాటరీ ప్లాంట్‌ను మంగళవారం చిత్తూరు జిల్లా యాదమరి మండలం పేరమిట్ట గ్రామంలో అమరరాజా గ్రోత్ కారిడార్ వద్ద ప్రారంభించింది. ఈ ప్లాంట్‌ను జాన్సన్ కంట్రోల్స్ చైర్మన్ అండ్ సీ ఈ ఓ జార్జ్ ఆర్ ఓలీవర్ ప్రారంభించారు.

12/20/2017 - 00:25

విజయవాడ, డిసెంబర్ 19: ప్రజలకు సాంఘిక భద్రత, పేద కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ప్రారంభించిన పథకం పీఎంజెజెబీవై చంద్రన్న బీమా పథకమని కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలోని కార్మికశాఖ మంత్రి కార్యాలయంలో అధికారులు, ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

12/20/2017 - 00:24

అమరావతి, డిసెంబర్ 19: పండిన పంటలకు మంచి ధర లభించేలా రైతులకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా రాష్ట్రంలో కోల్డ్ చైన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డితో కలిసి మంత్రి సోమిరెడ్డి మాట్లాడారు.

12/19/2017 - 02:06

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఆరోగ్య బీమాను అందజేస్తున్న కంపెనీలు తమ పాలసీల ప్రీమియంలు సరళంగా, ప్రజలు భరించగలిగే స్థాయిలో ఉంచవలసిన అవసరం ఉందని, అప్పుడే ఆ పాలసీలు ఎక్కువ మంది ప్రజలకు చేరువ అవుతాయని, అవసరం ఉండి కూడా ఇప్పటికీ పాలసీలు తీసుకోని ప్రజలకు వీటిని అందించడానికి వీలు కలుగుతుందని ఇన్సూరెన్స్ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ) చైర్మన్ టీఎస్ విజయన్ పేర్కొన్నారు.

Pages