S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/23/2017 - 01:14

న్యూఢిల్లీ/ ముంబయి, డిసెంబర్ 22: ఏ ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)నూ మూసివేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) శుక్రవారం స్పష్టం చేశాయి. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను మూసివేసే అవకాశం ఉందని సోషల్ మీడియా సహా మీడియాలో సాగుతున్న ప్రచారం వదంతులు మాత్రమేనని పేర్కొన్నాయి. నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) భారంతో కుంగిపోతున్న పీఎస్‌బీ..

12/23/2017 - 01:12

ముంబయి, డిసెంబర్ 22: క్రిస్మస్ పండుగ సమీపిస్తున్న వేళ శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లావాదేవీలు ఉత్సాహపూరితంగా సాగి, కీలక సూచీలు రెండూ జీవిత కాల గరిష్ఠ స్థాయిలను తాకాయి. ఐటీ, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు మదుపరుల నుంచి మంచి ఆదరణ లభించడంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 34,000 పాయింట్ల దరిదాపుల్లోకి చేరింది.

12/23/2017 - 01:11

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి లండన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ డాన్ విజయ్ మాల్యాకు ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై దాఖలైన ఫెరా కేసు జనవరి 4న విచారణకు రానుంది. నిజానికి శుక్రవారం ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు విచారించాల్సి ఉంది. అయితే మెజిస్ట్రేట్ దీపక్ షెరావత్ సెలవులో ఉండడంతో విచారణకు రాలేదు.

12/23/2017 - 01:08

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: బాలికలను నిర్బంధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తర ఢిల్లీలోని రోహిణి ఆశ్రమం వ్యవస్థాపకుడు వీరేందర్ దేవ్ దీక్షిత్‌ను జనవరి 4లోగా తమ ఎదుట హాజరుపరచాలని ఢిల్లీ హైకోర్టు సిబిఐని శుక్రవారం ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ హరిశంకర్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

12/23/2017 - 01:07

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరం మోసాలకు గురికావడం వల్ల రూ. 16,789 కోట్లు నష్టపోయాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వాణిజ్య బ్యాంకులు, ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)కు సమర్పించిన ఫ్రాడ్ మానిటరింగ్ నివేదికల ప్రకారం, 2016-17 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు మోసాల కారణంగా రూ.

12/23/2017 - 02:51

శ్రీరాంపూర్ రూరల్ డిసెంబర్ 22: సిరుల మాగాణి సింగరేణి ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొంటూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ తవస్తోంది. తెలంగాణలో సిరులను విరజల్లుతూ వేలాది మందిని అక్కున చేర్చుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సిరుల మాగాణి సింగరేణి 128వ.వసంతాలు పూర్తి చేసుకుని 129వ.

12/22/2017 - 00:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కేసులో ప్రత్యేక కోర్టు నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇవ్వడంతో గురువారం స్టాక్ మార్కెట్‌లో ఈ కేసుతో సంబంధం ఉన్న కంపెనీల షేర్ల ధరలు 20 శాతం వరకు పెరిగాయి. డీబీ రియాల్టీ షేర్ ధర 19.89 శాతం పెరిగి, రూ. 43.70 వద్ద ముగిసింది.

12/22/2017 - 00:49

ముంబయి, డిసెంబర్ 21: దేశీయ స్టాక్ మార్కెట్ల లావాదేవీల్లో గురువారం ఉత్సాహం కొరవడింది. క్రిస్మస్, సంవత్సరాంతం సమీపిస్తుండటంతో మదుపరులు ఆచితూచి అడుగులు వేయడంతో కీలక మార్కెట్ సూచీలు స్తబ్దుగా సాగాయి. ఖచ్చితంగా చెప్పాలంటే కాస్తంత పడిపోయి ప్రతికూల ధోరణితోనే ముగిశాయి.

12/22/2017 - 00:48

హైదరాబాద్, డిసెంబర్ 21: రాష్ట్రంలో బ్యాంకులు ప్రభుత్వానికి, ప్రజలకు సహకారం అందించడం లేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ జరిగిన ఎస్‌ఎల్‌బిసి సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం వివిధ కార్పోరేషన్లు, పరిషత్తుల ద్వారా స్వయం ఉపాధి పనులకోసం యువతీ యువకులకోసం సబ్సిడీ ఇస్తోందన్నారు.

12/22/2017 - 00:44

విజయవాడ, డిసెంబర్ 21: సాలీ నా రూ.700 కోట్ల పైగా నష్టాన్ని చవిచూస్తున్న ఏపీఎస్‌ఆర్‌టీసీ లాభాలు గడించకపోయినప్పటికీ వివిధ రూ పాల్లో నష్టాలను గణనీయంగా తగ్గించుకోటానికి గడచిన ఏడాదికాలంగా చేస్తున్న కృషి కొంతమేర ఫలిస్తున్నది. దాదాపు రూ.3వేల 600 కోట్లు పైగా స్థిరమైన నష్టం ఎటూ ఉండనే ఉంది. రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ జరిగితే ఈ నష్టాలు కొంతమేర తగ్గిపోయే అవకాశం లేకపోలేదు.

Pages