S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/30/2017 - 00:15

ముంబయి, సెప్టెంబర్ 29: పెద్ద నోట్ల రద్దు తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులు ప్రదానంగా పిఓఎస్ మిషన్ల ద్వారా ఆన్‌లైన్ కార్డు చెల్లింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉండడంతోఇప్పటికే నిధుల కొరతతో అల్లాడుతున్న బ్యాంకులు ఏటా రూ. 3,800 కోట్ల ఆదాయాన్ని కోల్పోయే అవకాశముందని ఓ నివేదిక హెచ్చరిస్తోంది.

09/30/2017 - 00:13

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: దేశ ఆర్థిక లోటు ఆగస్టు చివరి నాటికి 2017-18 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాల్లో 97 శాతానికి చేరుకొంది. ప్రధానంగా ప్రభుత్వ వ్యయం పెరగడమే దీనికి కారణం. ప్రభుత్వ వ్యయానికి, రాబడికి మధ్య ఉండే అంతరానే్న ఆర్థిక లోటుగా పేర్కొంటారు. నికరంగా చూసినట్లయితే 2017-18 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో ఆర్థిక లోటు రూ.

09/30/2017 - 00:13

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: నాణ్యమైన టెలికామ్ పరికరాలను తయారు చేయడంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు పొందిన స్వీడన్ సంస్థ ఎరిక్సన్ 5జి టెక్నాలజీ (ఐదో తరం టెలికామ్ సేవలను అందించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం) గురించి మన దేశంలోని కొన్ని ప్రముఖ టెలికామ్ ఆపరేటర్లతో ముందస్తు చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది.

09/30/2017 - 00:12

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: టెలికాం కంపెనీలు వేలంలో కొనుగోలు చేసిన స్పెఅక్టమ్‌కు చెల్లింపుల గడువును ఇప్పుడున్న పదేళ్లనుంచి 16 సంవత్సరాలకు పెంచడానికి టెలికాం కమిషన్ శుక్రవారం ఆమోదం తెలిపింది.

09/29/2017 - 01:09

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 28: నిర్మాణ రంగానికి జీఎస్టీ గుదిబండగా మారింది. వినియోగదారుకీ పెనుభారంగా పరిణమించింది..ప్లాట్ల రేట్లు జిఎస్టీ వల్ల దాదాపు 35 శాతం పెరిగిపోయాయి. ఇటు జిఎస్టీ, అటు వ్యాట్ టాక్సు బిల్డర్లపై పడటంతో ఆ భారం వినియోగదారుడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిఎస్టీ వస్తే వ్యాట్ ఉండదని ప్రభుత్వం చెప్పింది.

09/29/2017 - 00:08

ముంబయి, సెప్టెంబర్ 28: ఉత్తర కొరియా ఉద్రిక్తతలు, మైన్మార్ సరిహద్దుల్లో భారత సైన్యం కాల్పుల నేపథ్యంలో గత వారం రోజులుగా చతికిల పడుతూ వచ్చిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కాస్త తేరుకొని లాభాల బాట పట్టాయి.

09/29/2017 - 00:09

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సిపిఎస్‌ఇ)ల పెట్టుబడుల వ్యయ ప్రణాళికలపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం సమీక్ష జరిపారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలన్న లక్ష్యంతో పెట్టుబడుల వ్యయాన్ని పెంపొందించాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలకు స్పష్టం చేశారు.

09/29/2017 - 00:09

అంబాజీపేట/అయినవిల్లి, సెప్టెంబర్ 28: పండుగలు, పర్వదినాల్లో డిమాండు ఎక్కువగా ఉండే కొబ్బరి కాయల ధర ఒక్కసారిగా కొండెక్కింది. వినాయక చవితి, దసరా, దీపావళి, కార్తీకమాసం ఇలా వరుస పర్వదినాలతో కొబ్బరికి డిమాండు విపరీతంగా పెరిగింది. ఈ సీజనులో కొబ్బరి ధర కాస్త పెరగడం సర్వసాధారణమే. అయితే ఈ ఏడాది మాత్రం ఊహించని రీతిలో ధర చుక్కలనంటుతోంది.

09/29/2017 - 00:10

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ పద్ధతిలో నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేయడం ద్వారా రూ.2 వేల కోట్లను సమీకరించుకోవాలన్న తమ ప్రతిపాదనను వాటాదారులు ఆమోదించారని ప్రభుత్వ రంగ జలవిద్యుత్ సంస్థ ఎన్‌హెచ్‌పిసి గురువారం వెల్లడించింది.

09/29/2017 - 00:10

హైదరాబాద్, సెప్టెంబర్ 28: ప్రముఖ సిమెంట్ తయారీ కంపెనీ ఓరియెంట్ సిమెంట్‌తో దక్షిణ మధ్య రైల్వే (ద.మ.రై) ఏడాది పాటు స్థిరీకరించిన రవాణా చార్జీలతో సిమెంట్ రవాణా చేసేందుకు ఒప్పందం చేసుకుంది. రవాణా చార్జీల హెచ్చు తగ్గులతో సంబంధం లేకుండా ఒకే చార్జీని ఏడాది పాటు స్థిరీకరించుకుని ఒప్పందం చేసుకున్నట్లు రైల్వే తెలిపింది.

Pages