S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/03/2017 - 00:20

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: దేశీయ టెలికామ్ సంస్థల్లో ఒకటైన ఆర్‌కామ్ (రిలయన్స్ కమ్యూనికేషన్స్) లిమిటెడ్ తమ డైరెక్టర్ల బోర్డును విస్తరించినట్లు ప్రకటించింది. ఆర్‌కామ్ టెలికామ్ వ్యాపార విభాగం అధ్యక్షుడు పునీత్ గార్గ్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గానూ, చీఫ్ ఫైనాన్షిల్ ఆఫీసర్ (సిఎఫ్‌ఓ) వి.మణికంఠన్‌కు డైరెక్టర్ గానూ పదోన్నతి కల్పించినట్లు ఆ సంస్థ సోమవారం వెల్లడించింది.

10/03/2017 - 00:19

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: దేశంలోని ఇ-కామర్స్ పోర్టళ్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విధానాన్ని బాహాటంగా ఉల్లంఘిస్తున్నాయని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సిఎఐటి) ఆరోపించింది. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు చేపట్టకపోతే న్యాయం కోసం తాము కోర్టును ఆశ్రయిచాల్సి ఉంటుందని సిఎఐటి సోమవారం స్పష్టం చేసింది.

10/03/2017 - 00:19

హైదరాబాద్, అక్టోబర్ 2: దేశంలో 2020 నాటికి సెరామిక్ పరిశ్రమ రూ.50 వేల కోట్ల టర్నోవర్‌కు చేరుకుంటుందని ఆ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ పరిశ్రమకు మరింత ఊతమిచ్చేందుకు నవంబర్ 16 నుంచి 19 వరకు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో అతిపెద్ద సిరామిక్ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఆ పరిశ్రమ వర్గాలు స్పష్టం చేశాయి. మేకిన్ ఇండియాలో భాగంగా భారీ ప్రదర్శన గాంధీనగర్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

10/03/2017 - 00:18

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ప్రభుత్వ రంగ బీమా సంస్థల్లో తన వాటాను కొంత విక్రయించడం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 11 వేల రూపాయల దాకా ఆర్జించాలని ప్రభుత్వం యోచిస్తున్న విషయం తెలిసిందే. కాగా, రాబోయే కొద్ది వారాల్లో రెండు ప్రభుత్వ రంగ బీమా సంస్థలు న్యూ ఇండియా అస్యూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(జిఐసి ఆర్‌ఇ) తొలి పబ్లిక్ ఇష్యూల ద్వారా మార్కెట్లోకి రావాలని అనుకొంటున్నాయి.

10/03/2017 - 00:18

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: రానున్న పదేళ్లలో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని, డిజిటైజేషన్, జనాభా పరమైన సానుకూల పరిస్థితులు, ప్రపంచీకరణ, సంస్కరణలు ఇందుకు ఆలంబనగా నిలుస్తాయని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన తాజా నివేదికలో అభిప్రాయపడింది.

10/03/2017 - 00:17

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.4 శాతం వృద్ధిరేటు సాధిస్తుందని గతంలో అంచనా వేసిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ‘్ఫచ్’ ఇప్పుడు దానిని 6.9 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధిరేటు అనూహ్యంగా 5.7 శాతానికి పతనమై మూడేళ్ల కనిష్ట స్థాయికి దిగజారడంతో ఫిచ్ తన అంచనాలను సవరించింది.

10/03/2017 - 00:17

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: యూరియా ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేలా చూడటంతో పాటు దిగుమతులు తగ్గించుకోవడం కోసం దేశంలో మూతపడిన నాలుగు ఎరువుల కర్మాగారాలను 2020-21 నాటికల్లా పునరుద్ధరించడానికి మిగులు నిధులు పుష్కలంగా ఉండే బొగ్గు, విద్యుత్, చమురు రంగాలకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు 30 వేల కోట్ల దాకా పెట్టుబడులు పెట్టనున్నాయి.

10/02/2017 - 00:09

భీమవరం, అక్టోబర్ 1: కాలుష్య కోరల్లో చిక్కుకుపోయి విలవిల్లాడుతున్న ఆక్వా రంగాన్ని రక్షించేందుకు ‘మాస్టర్‌ప్లాన్’ సిద్ధమవుతోంది. ఇక భవిష్యత్తులో కాలుష్యం మాటే ఉండబోదు. ఆక్వా సాగు పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లోకి వచ్చేస్తోంది.

10/02/2017 - 00:08

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: ఒఎన్‌జిసి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా శశి శంకర్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు సిఎండిగా ఉన్న దినేష్ కె.సర్రాఫ్ శనివారం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో శశి శంకర్ బాధ్యతలు చేపట్టారు. చమురు అనే్వషణ, ఉత్పత్తి రంగాల్లో శశి శంకర్‌కు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

10/02/2017 - 00:08

ముంబయి, అక్టోబర్ 1: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషభ్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్) మొబైల్ వ్యాపారం విలీనానికి సంబంధించి ఎయిర్‌సెల్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకొన్నట్లు ప్రకటించింది. పరస్పర అంగీకారంతో ఎయిర్‌సెల్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకొన్నట్లు ఆర్‌కామ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

Pages