S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/29/2017 - 00:11

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: చమురు మార్కెటింగ్ సంస్థ అయిన హిందుస్థాన్ పెటోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్)ను దక్కించుకోవడం కోసం అవసరమైన 32 వేల కోట్ల నిధుల్లోకొంతభాగాన్ని సమకూర్చుకోవడం కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి), గెయిల్ ఇండియాలోని తన వాటాల్లో కొంతభాగాన్ని విక్రయిస్తామని ప్రభుత్వ రంగ చమరు, సహజవాయువ సంస్థ (ఒఎన్‌జిసి) చైర్మన్ డికె సర్రాఫ్ తెలిపారు.

09/29/2017 - 00:11

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ఎటిఎం సేవలు, నగదు డెలివరీ, తీసుకు రావడం లాంటి సేవలను అందించే సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ తన తొలి పబ్లిక్ ఇష్యూకు సంబంధించిన ప్రాథమిక పత్రాలను మార్కెట్ రెగ్యులేటర్ అయన సెబీకి సమర్పించింది. ఈ ఐపిఓ ద్వారా ఆ సంస్థ రూ 1000-1200 కోట్ల నిధులు సమకూర్చకోవాలని అనుకొంటోంది. ఈ పబ్లిక్ ఇష్యూలో కంపెనీకి ఇప్పుడున్న షేర్‌హోల్డర్లు 4,44,00,000 షేర్లను విక్రయిస్తారు.

09/27/2017 - 23:46

ఏడో రోజూ భారీ నష్టాలు

09/27/2017 - 23:44

సంస్థల ఇబ్బందులపై దృష్టిపెట్టాం
అవసరమైనప్పుడు జోక్యం చేసుకొంటాం
పరిశ్రమకు కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా హామీ
ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ డేటా: ముకేశ్ అంబానీ
ఒకే వేదికపై టెలికాం దిగ్గజాలు

09/27/2017 - 23:42

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: భారత్‌లో పర్యాటక రంగంలో ఆధ్యాత్మిక పర్యాటకం, మెడికల్ టూరిజం, వన్యప్రాణి, సాహస క్రీడలు లాంటి రంగాలు అభివృద్ధి చెందడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. బుధవారం ఇక్కడ జాతీయ పర్యాటక అవార్డులను ఆయన ప్రదానం చేశారు.

09/27/2017 - 23:39

ఓర్లాండో, సెప్టెంబర్ 27: మారుతున్న సాంకేతిక విజ్ఞానానికి అనుగుణంగా మైక్రోసాఫ్ట్‌ను సత్య నాదెళ్ల పరుగులు పెట్టిస్తున్నారంటూ సంస్థ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రశంసల వర్షం కురిపించారు. టెక్నాలజీపరంగా తలెత్తున్న ప్రతి అవకాశాన్నీ సత్య నాదెళ్ల సద్వినియోగం చేసుకున్నారని తద్వారా ఈ పరిశ్రమలో మైక్రోసాఫ్ట్‌కు తిరుగులేని స్థానాన్ని కల్పించారని ఆయన అన్నారు.

09/27/2017 - 23:38

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందేలా చేయడానికి భారత్ చేస్తున్న కృషికి ఊతమిచ్చేందుకు 2018-22 మధ్య కాలంలో ఆ దేశానికి ఇస్తున్న రుణ సహాయాన్ని గరిష్ఠంగా ఏడాదికి 4 బిలియన్ డాలర్లకు పెంచాలని అనుకొంటున్నట్లు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఎడిబి) తెలిపింది.

09/27/2017 - 23:36

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ప్రపంచ పోటీతత్వ సూచీ (గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్)లో భారత్ 40వ స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలిచిన ఈ జాబితాలో గత ఏడాదితో పోలిస్తే భారత్ ఒక స్థానం దిగజారింది. 137 దేశాలున్న ఈ జాబితాలో స్విట్జర్లాండ్ మొదటిస్థానంలో ఉండగా, అమెరికా, సింగపూర్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) బుధవారం ఈ జాబితాను విడుదల చేశారు.

09/27/2017 - 00:46

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: మరో మూడేళ్ల కాలంలో 5-జి సేవలను అందుబాటులోకి తెచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఏకంగా 500 కోట్ల రూపాయలతో ఓ నిధిని ఏర్పాటుచేయాలని కూడా సంకల్పిస్తోంది.

09/27/2017 - 00:46

వరుసగా ఆరోరోజు కూడా స్టాక్ మార్కెట్ ప్రతికూల పథంలో పయనించింది. విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడటం, మరోపక్క కొరియా సంక్షోభం నేపథ్యంలో నెలకొన్న నిరాశావాదమే ఈ పరిస్థితులకు కారణమైంది. ఇనె్వస్టర్లందరూ తదుపరి నష్టాలను నివారించే దిశగానే జాగ్రత్తలు పాటించారు. దీని ఫలితంగా సెనె్సక్స్ 26.87 పాయింట్లు తగ్గింది. గత నెలలో ఎన్నడూ లేనివిధంగా 31,599.76 పాయింట్లకు తగ్గింది.

Pages