S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/02/2016 - 01:20

న్యూఢిల్లీ, ఆగస్టు 1: వౌలిక రంగాభివృద్ధి జూన్‌లో 5.2 శాతంగా నమోదైంది. బొగ్గు, సిమెంట్ రంగాల్లో రెండంకెల వృద్ధి ఇందుకు దోహదం చేసింది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాలతో కూడిన ఈ వౌలిక రంగం వృద్ధిరేటు నిరుడు జూన్‌లో 3.1 శాతంగానే ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 38 శాతం వాటా ఈ ఎనిమిది కీలక రంగాలదే.

08/02/2016 - 01:11

ముంబయి, ఆగస్టు 1: బ్యాంకింగ్ రంగంలో కొత్తవారికి మరింత అవకాశాన్నిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సోమవారం ఆన్-ట్యాప్ యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్సు విధానాన్ని ప్రకటించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం 500 కోట్ల రూపాయల ప్రారంభ మూలధనంతో ఏ సంస్థ అయినా ప్రైవేట్ బ్యాంకును పెట్టవచ్చు. బ్యాంక్ నికర విలువ ఎల్లప్పుడూ 500 కోట్ల రూపాయలకు తగ్గకూడదు.

08/02/2016 - 01:10

న్యూఢిల్లీ, ఆగస్టు 1: రాయితీ వంటగ్యాస్ ధర సోమవారం స్వల్పంగా పెరిగింది. సిలిండర్‌కు రూపాయి 93 పైసలు చొప్పున పెరగగా, ఈ పెరుగుదలతో ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర 421.16 రూపాయల నుంచి 423.09 రూపాయలకు చేరింది. జూలై 1న కూడా రూపాయి 98 పైసలు పెరిగినది తెలిసిందే. డీజిల్, పెట్రోల్ మాదిరిగానే వంటగ్యాస్, కిరోసిన్ ధరలపైనా రాయితీని ఎత్తివేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించినది తెలిసిందే.

08/02/2016 - 01:10

కొత్తగూడెం, ఆగస్టు 1: గడచిన నాలుగు మాసాల బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనలో సింగరేణి సంస్థ వెనుకబడింది. నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యం 2 కోట్ల 28 లక్షల 5,800 టన్నులవగా, కోటీ 79 లక్షల 40,365 టన్నులు మాత్రమే సాధించి 88 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకుంది. మొత్తం సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో కొత్తగూడెం, శ్రీరాంపూర్ మాత్రమే ఉత్పత్తి లక్ష్యాలను సాధించాయి.

08/02/2016 - 01:09

న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి సోమవారం కార్ల ధరలను పెంచింది. వివిధ రకాల మోడళ్ల ధరలను 20,000 రూపాయల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇటీవల మార్కెట్‌కు పరిచయం చేసిన ఎస్‌యువి విటారా బ్రీజా ధర 20,000 రూపాయలు పెరిగితే, బాలెనో ధర 10,000 రూపాయలు పెరిగినట్లు చెప్పింది.

08/02/2016 - 01:09

ముంబయి, ఆగస్టు 1: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 48.74 పాయింట్లు పడిపోయి 28,003.12 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ అతి స్వల్పంగా 1.95 పాయింట్లు కోల్పోయి 8,636.55 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్ లాభపడితే, చైనా సూచీ నష్టపోయింది.

08/02/2016 - 01:08

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ప్రజలంతా కూడా ఆధార్‌తో తమతమ మొబైల్ నెంబర్లను అనుసంధానం చేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) కోరింది. దీనివల్ల ఆన్‌లైన్‌లో వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సులభంగా అందుకోవచ్చని తెలిపింది. కాబట్టి ఆధార్ కార్డు పొందిన సమయంలో మొబైల్ నెంబర్‌ను నమోదు చేసుకోనట్లయితే, తప్పక నమోదు చేసుకోవాలని ఓ ప్రకటనలో సోమవారం యుఐడిఎఐ సిఇఒ అజయ్ భూషణ్ పాండే సూచించారు.

08/02/2016 - 05:15

న్యూఢిల్లీ, ఆగస్టు 1: రుణ రికవరీ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు) ప్రశ్నార్థకం చేస్తున్న నేపథ్యంలో ఈ బిల్లు అమల్లోకి వస్తే రుణాల వసూళ్లు తేలిక కానుందని నిపుణులు చెబుతున్నారు. అయితే విద్యా రుణాల విషయంలో వెసులుబాటు ఉంటుందన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ..

08/02/2016 - 01:07

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ వొడాఫోన్ కూడా ఇంటర్నేట్ చార్జీలను తగ్గించింది. ఇప్పటికే భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్ తమ 2జి, 3జి, 4జి సేవల డేటా చార్జీలను తగ్గించినది తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం వొడాఫోన్ సైతం తమ 2జి, 3జి, 4జి విభాగాల్లో ఇంటర్నేట్ ధరలను 67 శాతం వరకు దించింది.

08/02/2016 - 01:06

విజయవాడ, ఆగస్టు 1: భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ముగింపు నాటికి రెండు కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారులను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది కూడా.

Pages