S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/29/2016 - 05:03

న్యూఢిల్లీ, జూలై 28: బయటి పరిణామాల ప్రభావాలకు లోనుకావడాన్ని తగ్గించుకోవడానికి, అలాగే పెట్టుబడుల అవకాశాలను మెరుగుపర్చుకోవడానికి ప్రభుత్వం జిఎస్‌టి బిల్లును ఆమోదించడం, సబ్సిడీలకు సంబంధించి మరిన్ని సంస్కరణలు చేపట్టడం లాంటి వాటితో సహా ఆర్థిక స్థిరీకరణ చర్యలను కొనసాగించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఒక నివేదికలో అభిప్రాయ పడింది.

07/29/2016 - 05:02

న్యూఢిల్లీ, జూలై 28: రెవిన్యూ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఆదాయం పన్ను శాఖకు చెందిన కొంతమంది అధికారులు ఒక తీర్మానాన్ని ఆమోదించడాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణిస్తూ,క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

07/28/2016 - 04:51

న్యూఢిల్లీ, జూలై 27: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ లీఎకో.. అమెరికాకు చెందిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ విజియోను హస్తగతం చేసుకుంది. నిశ్చయాత్మక ఒప్పందంలో భాగంగా 2 బిలియన్ డాలర్ల (ప్రస్తుతం భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 13,500 కోట్లు)కు విజియో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ వ్యాపారం, టెక్నాలజీ, మేధో సంపత్తి ఆస్తులను చేజిక్కించుకున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో లీఎకో తెలిపింది.

07/28/2016 - 04:48

లండన్/న్యూఢిల్లీ, జూలై 27: తమ విదేశీ హోటళ్ల అమ్మకానికి సంబంధించి వచ్చిన ఆఫర్‌ను సహారా గ్రూప్ తిరస్కరించింది. ‘సహారా-సెబీ’ కేసులో అధినేత సుబ్రతారాయ్ విడుదలకు సుప్రీం కోర్టు సూచించిన పూచీకత్తును సమర్పించడానికి లండన్, న్యూయార్క్ నగరాల్లోని మూడు లగ్జరీ హోటళ్లను సహారా అమ్మకానికి పెట్టినది తెలిసిందే.

07/28/2016 - 04:48

ముంబయి, జూలై 27: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఓ మోస్తరు లాభాలను అందుకున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లులో కొన్ని నిర్ణయాల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీపడటం మార్కెట్ సెంటిమెంట్‌ను కొంతమేర పెంచింది.

07/28/2016 - 04:46

ముంబయి, జూలై 27: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ).. మొత్తం 13 బ్యాంకులపై 27 కోట్ల రూపాయల జరిమానాను విధించింది. ఫెమా నిబంధనలు, కెవైసి నియమాలను ఉల్లంఘించినందుకుగాను 13 ప్రభుత్వరంగ, ప్రైవేట్‌రంగ బ్యాంకులపై కొరడా ఝుళిపించింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ, ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్‌సహా మరో 8 బ్యాంకులకు నిబంధనలను సరిగ్గా అమలు చేయాలని గట్టిగా మందలించింది.

07/28/2016 - 04:46

న్యూఢిల్లీ, జూలై 27: దేశీయ అతిపెద్ద మార్ట్‌గేజ్ లెండర్ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 26.86 శాతం వృద్ధి చెంది 2,796.92 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఇదే త్రైమాసికంలో 2,204.29 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బుధవారం సంస్థ తెలియజేసింది.

07/28/2016 - 04:45

విజయవాడ, జూలై 27: రాష్ట్రంలో రేషన్ దుకాణాలను మినీ సూపర్ బజార్లుగా మార్చాలన్న ప్రభు త్వం ఆలోచనను రేషన్ షాపుల డీలర్లు స్వాగతించారు. డీలర్ల కమీషన్‌ను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల డీలర్ల సమాఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియచేసింది. సమాఖ్య నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబును బుధవారం సిఎం క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు.

07/28/2016 - 04:44

విశాఖపట్నం, జూలై 27: రైలు ప్రయాణికులకు పసందైన, అందుబాటు ధరలో ఉండేలా భోజన, అల్పాహారం సదుపాయం కల్పించాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) ఆధ్వర్యంలో దీనిని నిర్వహించనుంది. ఇందుకోసం కార్యాచరణ సిద్ధమైంది. భారతీయ రైల్వే పరిధిలో 17 రైల్వే జోన్లు ఉన్నాయి.

07/28/2016 - 04:44

విజయవాడ, జూలై 27: రాష్ట్రంలో అపారంగా ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రిడ్ల వ్యవస్థ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. రాష్ట్రంలో అంతులేని జలరాశి పారుతోంది. 974 కిలో మీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. భూగర్భంలో అమూల్యమైన ఖనిజ సంపద ఉంది. ఈ వనరులన్నింటినీ ఒక ప్రణాళిక ప్రకారం సమర్థవంతంగా వినియోగించుకుంటే నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చవచ్చు.

Pages